School Holidays : విద్యార్థులు ఎగిరిగంతేసే న్యూస్.. ఏపీలో రెండ్రోజులు, తెలంగాణలో మూడ్రోజులు స్కూళ్లు, కాలేజీలకు సెలవులు

Published : Aug 07, 2026, 04:20 PM IST

వచ్చే రెండ్రోజులు (ఆగస్ట్ 8,9) అంటే శని, ఆదివారం ఆంధ్ర ప్రదేశ్ లో విద్యాసంస్థలకు సెలవులు ఉన్నాయి. అదే తెలంగాణలో అయితే ఆగస్ట్ 8,9,10 మూడ్రోజులు సెలవులున్నాయి. ఎందుకో తెలుసా?

PREV
13
తెలుగు విద్యార్థులకు సెలవులే సెలవులు

School Holidays : తెలుగు రాష్ట్రాల విద్యార్థులు, ఉపాధ్యాయులకే కాదు ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకు తీపి కబురు అందింది. ఈ వీకెండ్‌లో పాఠశాలలు, కళాశాలలతో పాటు ప్రభుత్వ, ప్రైవేట్ ఆఫీసులకు వరుస సెలవులు రానున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో వరుసగా రెండు రోజులు, తెలంగాణలో వరుసగా మూడు రోజుల పాటు విద్యాసంస్థలు మూతపడనున్నాయి. 

చదువుల ఒత్తిడి నుంచి కాస్త ఉపశమనం పొందేందుకు, కుటుంబ సభ్యులతో సరదాగా సమయం గడిపేందుకు ఈ లాంగ్ వీకెండ్ ఎంతో దోహదపడనుంది. ఇంతకీ ఈ సెలవులకు గల కారణాలు ఏమిటో, ఏయే రోజుల్లో సెలవులు ఉన్నాయో పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

23
ఆంధ్రప్రదేశ్‌లో 2 రోజుల సెలవులు... ఎందుకో తెలుసా?

ఆంధ్రప్రదేశ్ లోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలకు ఈ వీకెండ్‌లో వరుసగా రెండు రోజుల పాటు సెలవు లభించనుంది.

ఆగస్టు 8 (రెండో శనివారం) : ప్రతి నెల రెండో శనివారం రాష్ట్రంలోని విద్యాసంస్థలకు సాధారణ సెలవు ఉంటుంది. ఇలా ఆగస్టు 8న రెండో శనివారం కావడంతో స్కూళ్లు, కాలేజీలకు సెలవు ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ఈ సెలవు వర్తిస్తుంది. ఎలాగూ ఐటీ, కార్పోరేట్ ఉద్యోగులకు ప్రతి శనివారం మాదిరిగానే ఈరోజు సెలవు ఉంటుంది.

ఆగస్టు 9 (ఆదివారం) : ఇది సాధారణ వారాంతపు సెలవు దినం. ఇలా ఏపీలోని విద్యార్థులు, ఉద్యోగులకు వచ్చే శని, ఆదివారాలు (ఆగస్ట్ 8,9) వరుసగా రెండు రోజుల పాటు లాంగ్ వీకెండ్ లభించనుంది. ఉద్యోగాలు చేసే తల్లిదండ్రులు, పిల్లలకు సెలవులే కాబట్టి ఫ్యామిలీ మొత్తం చిన్న ట్రిప్ ప్లాన్ చేసుకోవచ్చు.. సరదాగా గడపవచ్చు.

33
తెలంగాణలో మూడ్రోజులు సెలవులే.. ఎందుకో తెలుసా?

ఆంధ్రప్రదేశ్‌తో పోలిస్తే తెలంగాణ విద్యార్థులకు మరింత ఎక్కువ సమయం విశ్రాంతి లభించనుంది. ఈ వీకెంట్ లో తెలంగాణలో వరుసగా మూడు రోజుల పాటు పాఠశాలలకు సెలవులు రానున్నాయి. ఆఫీసులకు కూడా ఈ సెలవులున్నాయి... అంటే ఉద్యోగులకు లాంగ్ వీకెండే.

ఆగస్టు 8 (రెండో శనివారం) : ప్రతి నెల రెండో శనివారం ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలకు సెలవు ఉంటుంది. ఇలా ఈ ఆగస్ట్ లో 8వ తేదీన రెండో శనివారం ఉంది... కాబట్టి విద్యాసంస్థలకు సెలవుంది.

ఆగస్టు 9 (ఆదివారం) : సాధారణ వారాంతపు ఆదివారం సెలవు.

ఆగస్టు 10 (సోమవారం) : తెలంగాణ వ్యాప్తంగా అత్యంత వైభవంగా జరిగే 'బోనాలు' వేడుకల సందర్భంగా ప్రభుత్వం ప్రత్యేక సెలవును ప్రకటించింది. ఈ ఆదివారం లాల్ దర్వాజ మహంకాళి ఆలయంతో పాటు నగరంలోని అమ్మవారి దేవాలయాల వద్ద బోనాల వేడుకలు జరుగుతాయి. రాష్ట్రవ్యాప్తంగా మరికొన్ని ప్రాంతాల్లో కూడా బోనాల పండగను జరుపుకుంటారు. 

ఇలా ఆషాడమాసంలో చివరి ఆదివారం (ఆగస్ట్ 9న) బోనాల వేడుకలు జరగనుండటంతో తర్వాతిరోజు అంటే ఆగస్ట్ 10న అధికారికంగా సెలవు ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. దీంతో తెలంగాణలోని విద్యార్థులకు ఆగస్టు 8, 9, 10 తేదీల్లో (శని, ఆది, సోమవారాలు) వరుసగా మూడు రోజులు లాంగ్ వీకెండ్ లభిస్తుంది.

Read more Photos on
click me!

Recommended Stories