Government Jobs : తెలుగు యువతకు బంపరాఫర్.. కేవలం పదో తరగతి పాసైతే చాలు ప్రభుత్వ ఉద్యోగం

Published : Feb 17, 2026, 02:40 PM ISTUpdated : Feb 17, 2026, 02:54 PM IST

APSRTC Recruitment 2026 :  ఆంధ్ర ప్రదేేశ్ లో మరో భారీ జాబ్స్ నోటిఫికేషన్ కు కూటమి ప్రభుత్వం సిద్దమయ్యింది. త్వరలోనే ఏపిఎస్ ఆర్టిసిలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడే అవకాశాలున్నాయి. 

PREV
15
ఏపీలో భారీగా ఉద్యోగాల భర్తీ..

APSRTC Jobs : ప్రభుత్వం ఉద్యోగం సాధించాలన్నది చాలామంది యువతీయువకుల కల... ఇది నిజం చేసేందుకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం సిద్దమయ్యింది. ఇప్పటికే మెగా డిఎస్సితో పాటు పోలీస్ ఉద్యోగాల భర్తీని పూర్తిచేసింది... ఇలా విద్యా, హోం శాఖల్లోనే కాదు మిగతా చాలా విభాగాల్లో ఖాళీలను భర్తీ చేసింది కూటమి ప్రభుత్వం. ఇప్పుడు ప్రభుత్వరంగ సంస్థ ఆర్టిసిలో ఉద్యోగాల భర్తీకి సిద్దమయ్యారు... బస్సు డ్రైవర్, కండక్టర్ పోస్టులతో పాటు ఇతర టెక్నికల్ స్టాఫ్ నియామకాలకు కూటమి ప్రభుత్వం సిద్దమయ్యింది.

25
ఆర్టిసి ఉద్యోగాల భర్తీపై మంత్రి క్లారిటీ...

ఇటీవల ఆంధ్ర ప్రదేశ్ రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (APSRTC) పై సమగ్ర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇందులో ఆర్టిసిలో ఖాళీల గురించి అధికారులతో మంత్రి చర్చించారు. ఈ క్రమంలోనే ఇప్పటికే 7,673 పోస్టుల భర్తీకి ప్రభుత్వ అనుమతి కోరినట్లు... ఇందుకు సంబంధించిన ప్రతిపాదన పంపినట్లు ఆర్టిసి అధికారులు తెలిపారు. ప్రభుత్వ అనుమతి రాగానే నియామక ప్రక్రియ మొదలుపెడతామని మంత్రి రాంప్రసాద్ రెడ్డికి తెలిపారు.

35
ఏపీఎస్ ఆర్టిసిలో భారీ రిటైర్మెంట్స్...

ఇప్పటికే ఏపిఎస్ ఆర్టిసిలో ఉద్యోగుల కొరత ఉందని... ఇది రాబోయే రోజుల్లో మరింత పెరిగే అవకాశాలున్నాయని అధికారులు వాపోతున్నారు. ఈ విషయాన్ని మంత్రి రాంప్రసాద్ రెడ్డి దృష్టికి తీసుకెళ్ళారు. ఇటీవల కాలంలో ఎంతమంది ఉద్యోగులు రిటైర్ అయ్యారు.. రాబోయే రోజుల్లో ఇంకెంతమంది కానున్నారో వివరించారు.

2020లో ఏపీఎస్ ఆర్టిసిలో 51,488 మంది ఉద్యోగులు ఉండగా ప్రస్తుతం 44,131 కి తగ్గారని అధికారులు మంత్రికి తెలిపారు. ఇక 2026, 2027, 2028 సంవత్సరాల్లో పెద్ద సంఖ్యలో ఉద్యోగులు రిటైర్ కానున్నారని వివరించారు. కాబట్టి వెంటనే డ్రైవర్లు, కండక్టర్లు, మెకానిక్స్ తదితర పోస్టులను భర్తీ చేయాల్సిన అవసరం ఉందని వివరించారు... దీంతో ఆ దిశగా చర్యలు చేపట్టనున్నట్లు మంత్రి హామీ ఇచ్చారు. 

ఆర్టిసిలో ఉద్యోగ నియామకాలకు సంబంధించి అన్ని ప్రభుత్వ విభాగాల అనుమతి వెంటనే లభించేలా చర్యలు తీసుకోనున్నట్లు మంత్రి తెలిపారు. అంటే అనుమతులు లభించిన వెంటనే ఏపిఎస్ ఆర్టిసి ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్ వెలువడనుంది.

45
తక్కువ విద్యార్హతలో ఉద్యోగాలు..

సాధారణంగా ఆర్టిసిలో తక్కువ విద్యార్హతలతో ఉద్యోగ నియామకాలు జరుగుతాయి. పదో తరగతి, ఇంటర్మీడియట్ అర్హతలుంటే చాలు ఉద్యోగాలను పొందవచ్చు. టెక్నికల్ పోస్టులకు ఐటిఐ తప్పనిసరి. కేవలం కొన్ని ఉద్యోగాలకు మాత్రమే డిగ్రీ, పిజి వంటి క్వాలిఫికేషన్స్ అవసరం అవుతాయి. 

ఆర్టిసి ఉద్యోగాలకు దరఖాస్తు చేసే అభ్యర్థుల వయసు 18 నుండి 42 ఏళ్ళలోపు ఉండాలి. రిజర్వేషన్ అభ్యర్థులకు వయోపరిమితి సడలింపు ఉంటుంది. గతంలో కేవలం పదో తరగతిలో వచ్చిన మార్కులు (మెరిట్) ఆధారంగా డ్రైవర్, కండక్టర్ పోస్టులను భర్తీ చేసేవారు.  అయితే ఈ ఉద్యోగాలకు పోటీ పెరగడంతో రాత పరీక్ష, నైపుణ్య పరీక్ష (డ్రైవర్, టెక్నికల్ పోస్టులకు) నిర్వహించే అవకాశాలున్నాయి. డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ఆధారంగా తుది నియామకం చేపడతారు.

55
కారుణ్య నియామకాలు

ఏపీఎస్ ఆర్టిసిలో కారుణ్య నియామకాలు కూడా భారీగా పెండింగ్ లో ఉన్నాయి. 2020 నుంచి వైద్య కారణాలతో 682 మంది ఉద్యోగులు రిటైర్ అయినట్లు అధికారులు మంత్రి రాంప్రసాద్ రెడ్డికి తెలిపారు. వీరిలో 36 మందికి ప్రత్యామ్నాయ ఉద్యోగం, మిగిలిన 646 మందికి ఆర్థిక పరిహారం చెల్లించాల్సి ఉందని వివరించారు. ఒక్కో ఉద్యోగికి రూ.15 లక్షల చొప్పున మొత్తం ఆర్థిక భారం రూ.96.90 కోట్లుగా అంచనా వేశారు.

ఉమ్మడి కడప ప్రాంతంలో కండక్టర్ ఖాళీలు లేకపోవడంతో 191 కారుణ్య నియామక దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని అధికారులు మంత్రి దృష్టి తీసుకువచ్చారు. 2023 లోనే సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తైనా ఇప్పటివరకు నియామకాలు జరగలేదని... APSRTC పదేపదే ఫాలోఅప్ చేసినా కలెక్టర్ కార్యాలయం నుంచి స్పష్టమైన స్పందన రాలేదని అధికారులు మంత్రికి వివరించారు. ఈ సమస్యను పరిష్కరించి అభ్యర్థులకు ఉద్యోగాలు కల్పించేలా చూస్తానని మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు.

Read more Photos on
click me!

Recommended Stories