Bill Gates : ఏపీలో మైక్రో సాఫ్ట్ అధినేత బిల్స్ గేట్స్ టూర్.. ఎందుకో తెలుసా?

Published : Feb 16, 2026, 11:54 AM IST

Bill Gates AP Visit : గేట్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు బిల్ గేట్స్ ఆంధ్ర ప్రదేశ్ లో పర్యటిస్తున్నాయి. ఆరుగురి టీంతో ఆయన రాష్ట్రానికి చేరుకోగా సీఎం చంద్రబాబు నాయుడు సాదర స్వాగతం పలికారు. ఇంతకూ బిల్ గేట్స్ పర్యటనకు కారణమేంటో తెలుసా? 

PREV
15
ఏపీకి బిల్ గేట్స్ టీం...

Bill Gates : అమెరికన్ వ్యాపార దిగ్గజం, మైక్రో సాప్ట్ అధినేత బిల్ గేట్స్ ఆంధ్ర ప్రదేశ్ లో పర్యటిస్తున్నారు. ఇవాళ (ఫిబ్రవరి 16, సోమవారం) ఉదయమే ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రాయానికి చేరుకున్న బిల్ గేట్స్ కు మంత్రులు నారా లోకేష్, వంగలపూడి అనిత, అచ్చెన్నాయుడు, సత్యకుమార్ యాదవ్ స్వాగతం పలికారు. బిల్ గేట్స్ తో పాటు గేట్స్ ఫౌండేషన్ కు చెందిన ఆరుగురు సభ్యులు విమానాశ్రయం నుండి నేరుగా ఆంధ్ర ప్రదేశ్ సచివాలయానికి చేరుకున్నారు.

25
బిల్ గేట్ప్ కు చంద్రబాబు స్వాగతం

ఈ సందర్భంగా బిల్ గేట్స్ టీం కు సచివాలయం మొదటి బ్లాక్ వద్ద స్వయంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సాదర స్వాగతం పలికారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తో పాటు తన మంత్రివర్గ సభ్యులను కూడా అక్కడే బిల్ గేట్స్ కు పరిచయం చేశారు. సీఎంతో పాటు మంత్రులు బిల్ గేట్స్ కు పుష్ఫగుచ్చాలు అందించారు. అనంతరం బిల్ గేట్స్ టీంను సచివాలయంలోకి తీసుకెళ్లిన చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా సమావేశమయ్యారు.

35
చంద్రబాబుకు బిల్ గేట్స్ ఆత్మీయ పలకరింపు

అయితే గతంలోనే చంద్రబాబుతో పరిచయం ఉండటంతో బిల్ గేట్స్ కూడా ఆత్మీయంగా పలకరించారు. చంద్రబాబును చూడగానే ముఖంలో చిరునవ్వుతో ఆనందం వ్యక్తం చేసిన బిల్ గేట్స్ 'హల్ ఫ్రెండ్.. హౌ ఆర్ యూ..?'' అంటూ పలకరించారు. ''నేను బాగున్నారు... మీరు ఎలా ఉన్నారు..'' అంటూ ఇంగ్లీష్ లో పలకరించి బిల్ గేట్స్ యోగక్షేమాలు కనుక్కున్నారు చంద్రబాబు. ఇలా చంద్రబాబు, బిల్ గేట్స్ మధ్య స్నేహపూర్వక పలకరింపులు జరిగాయి.

45
బిల్ గేట్స్ ఆర్టిజిఎస్ పరిశీలన

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దగ్గరుండి సచివాలయంలో రియల్ టైమ్ గవర్నెర్స్ సెంటర్ (RTGS) ను బిల్ గేట్స్ టీంకు చూపించారు. ఇలా కూటమి ప్రభుత్వం స్వపరిపాలన అందించేందుకు టెక్నాలజీని ఎలా ఉపయోగించుకుంటుందో సీఎం వివరించారు. ఈ వ్యవస్థను చూసి బిల్ గేట్స్ టీం కూడా ఆశ్చర్యం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది... టెక్ సీఎంగా పేరున్న చంద్రబాబును ఈస్థాయిలో టెక్నాలజీ వాడుతూ బిల్ గేట్స్ వంటివారి ప్రశంసలు కూడా పొందుతున్నారు.

55
బిల్ గేట్స్ పర్యటనకు కారణాలివే..

ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు , డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్ తో పాటు ఇతర మంత్రులు, సీఎస్ విజయానంద్ తో పాటు వివిధ శాఖల కార్యదర్శులతో బిల్ గేట్స్ టీం సమావేశం అయ్యింది. గేట్స్ ఫౌండేషన్ సహకారంతో విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో సమూల మార్పులు తీసుకువచ్చేందుకు ఏపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది... ఇలాంటి కీలక అంశాలపై బిల్ గేట్స్ టీంతో చర్చ జరగనుంది. కూటమి ప్రభుత్వానికి సహకారం అందించేందుకు ముందుకు వచ్చినందుకు బిల్ గేట్స్ టీంకు సీఎం చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు.

Read more Photos on
click me!

Recommended Stories