బోణీ కొట్టిన టీడీపీ... శెభాష్‌ బుచ్చయ్య

First Published | Jun 4, 2024, 11:54 AM IST

రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణపై 61వేల 564 ఓట్ల ఆధిక్యంతో బుచ్చయ్య చౌదరి గెలిచారు....

gorantla

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్‌డీయే కూటమి ఖాతా తెరిచింది. అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి తొలి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. రాజమండ్రి రూరల్ అసెంబ్లీ నియోజకవర్గంలో తెలుగుదేశం అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఘన విజయం సాధించారు. రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణపై 63వేల 56 ఓట్ల ఆధిక్యంతో బుచ్చయ్య చౌదరి గెలిచారు....
కాగా, బుచ్చయ్య చౌదరికి లక్షా 27వేల 193 ఓట్లు పోలయ్యాయి. ఆయన ప్రత్యర్థి చెల్లుబోయిన వేణుకు 64వేల 137 ఓట్లు మాత్రమే దక్కాయి. కాగా మొత్తం 20 రౌండ్లలో రాజమండ్రి రూరల్ అసెంబ్లీ నియోజకవర్గ ఓట్ల లెక్కింపు జరిగింది.

gorantla

తెలుగుదేశం పార్టీ ఎందరికో రాజకీయ జీవితాన్ని ఇచ్చింది. సాధారణ కార్యకర్తగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించి మంత్రిగా ఎదిగిన నేతలెందరో. ఈ కోవకే చెందిన రాజకీయ నాయకుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి. 

బాల్యం, కుటుంబ నేపథ్యం

గోరంట్ల బుచ్చయ్య చౌదరీ.. 1945 మార్చి 15న ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లా బాపట్లలోని నర్సాయిపాలెం గ్రామంలో జన్మించారు. ఆయన తండ్రి గోరంట్ల వీరయ్య చౌదరి తల్లి అనసూయమ్మ.  వారిది సంపన్న రైతు కుటుంబం. వారి తండ్రి వ్యవసాయంతో పాటు పలు వ్యాపారాలు నిర్వహించే వారు. బుచ్చయ్య చౌదరి గారికి ముగ్గురు తమ్ముళ్ళు. 
 

ఇక బుచ్చయ్య చౌదరి  విద్యాభ్యాసం వస్తే..  ఆయన బాపట్లలోనే ఎస్ఎస్సీ వరకు చదువుకున్నారు. ఆ తరువాత రాజమండ్రిలోని వీరశలింగం విద్యాసంస్థల్లో ఇంటర్మీడియట్ పూర్తి చేశారు. ఆ తరువాత ఆంధ్ర యూనివర్సిటీ నుంచి బీఎస్సీ డిగ్రీ పూర్తి చేసినా ఆయన ఉద్యోగాలు చేయకుండా వ్యాపారం మొదలుపెట్టారు. ఇక ఆయన కుటుంబ విషయానికి వస్తే..  ఇంటర్ చదువుతున్న రోజుల్లో తనతో పాటుగా చదువుకున్న ఝాన్సీ లక్ష్మీ గారిని ప్రేమించి పెద్దల అంగీకారంతో వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెను కంప్యూటర్ సైన్స్ లో పూర్తి చేశారు ఇద్దరు అమెరికాలో స్థిరపడ్డారు. 


gorantla

రాజకీయ ప్రవేశం

గోరంట్ల బుచ్చయ్య చౌదరిది కమ్యూనిస్టు పార్టీ సానుభూతిపరుల కుటుంబం.ఆయన చదువుకునే రోజుల్లో కమ్యూనిస్టు పార్టీల అనుబంధ విద్యార్థి సంఘాల రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉండేవారు.  తర్వాత రోజుల్లో ఎన్టీఆర్ గారిపై అభిమానంతో తెలుగుదేశం పార్టీలో చేరారు. సామాన్య కార్యకర్తగా జీవితాన్ని ప్రారంభించిన బుచ్చయ్య చౌదరి అనతికాలంలోనే గోదావరి జిల్లాలో పార్టీ కన్వీనర్ గా ఎన్నికయ్యారు.  పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతానికి కృషి చేశారు. ఈ క్రమంలో 1983 ఎన్నికల్లో ఎన్టీఆర్ రాజమండ్రి అసెంబ్లీ టికెట్ ను గోరంట్ల బుచ్చయ్య చౌదరికి ఇచ్చారు.

ఇలా పోటీ చేసిన తొలి ఎన్నికల్లోనే ఆయన ఎమ్మెల్యేగా ఘన విజయం సాధించారు. ఆ తరువాతి కాలంలో ఎన్టీఆర్ కి పార్టీలో అత్యంత నమ్మకస్తుడుగా మారాడు బుచ్చయ్య చౌదరి. అయితే ఆయనకు మంత్రివర్గంలో చోటు ఇవ్వకున్న వ్యక్తిగతంగా పార్టీలో సముచిత స్థానాన్ని కల్పించారు. ఇక 1985 ఎన్నికల్లో కూడా రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచారు బుచ్చయ్య చౌదరి. ఈ తరుణంలో ఆయనను ఉత్తరాంధ్ర ఇన్చార్జిగా అధికార పార్టీ ప్రతినిధిగా, తూర్పుగోదావరి జిల్లా పార్టీ అధ్యక్షుడిగా పార్టీలో పలు కీలకమైన కమిటీలో సభ్యుడిగా నియమించారు. ఒకనొక సమయంలో ఎన్టీఆర్ పర్యటనలకు ఆయనే డిజైన్ చేసేవారు 

ఇక 1987లో ఆంధ్రప్రదేశ్ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా ఆయను ఎన్టీఆర్ నియమించారు. 1989 వరకు ఈ పదవిలో ఆయన కొనసాగారు.1989, 1991 లోక్సభ ఎన్నికల్లో రాజమండ్రి అమలాపురం కాకినాడ పార్లమెంట్ స్థానాలకు ఇన్చార్జిగా పని చేశారు. 1994లో మూడోసారి శాసనసభ్యుడిగా ఎన్నికైన బుచ్చయ్య చౌదరికి ఎన్టీఆర్ తన మంత్రివర్గంలో చోటు కల్పించారు. ఈ సమయంలో ఆయన పౌరసరఫరాల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 1995లో పార్టీలో సంక్షోభం వస్తే..  ఎన్టీఆర్ పక్షాన పోరాటం చేసి ఆయన మరణం వరకు ఆయనతోనే నడిచారు. 1996లో ఎన్టీఆర్ టిడిపి తరుపున రాజమండ్రి లోక్ సభకు పోటీ చేసి ఓటమి పాలయ్యారు.ఎన్టీఆర్ టిడిపి అధ్యక్షురాలిగా ఉన్న లక్ష్మీ పార్వతి వ్యవహార శైలి నచ్చకపోవడంతో పార్టీ నుంచి వైదొలగి రాజకీయాలకు దూరంగా ఉన్నారు. 

అయితే.. 1997లో చంద్రబాబు నాయుడు స్వయంగా బుచ్చయ్య చౌదరి ఇంటికి వెళ్లి పార్టీలోకి ఆహ్వానించారు. చంద్రబాబు ఆహ్వానం మేరకు ఆయన మళ్లీ పార్టీలో అడుగుపెట్టారు. ఆ తరువాత 1999 లో నాలుగోసారి రాజమండ్రి నుంచి పోటీ చేసి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. తెలుగుదేశం పార్టీ తరపున రాయలసీమ, కోస్తాంధ్ర, తెలంగాణ ప్రాంతాల్లో ఇంచార్జిగా వ్యవహరించారు. 2004 నుండి 2014 వరకు పార్టీ గడ్డుకాలంలో ఉన్నా పార్టీని అంటిపెట్టుకుని ఉన్నారు. చంద్రబాబుకు ప్రతి విషయంలో సహకారిగా ఉంటూ.. ఆయన మన్నలు అందుకున్నారు.  
   
2014లో రాజమండ్రి రూరల్ టికెట్ కూడా ఎన్నో రాజకీయ చర్చలు సాగాయి.  బిజెపిలో పొత్తులో భాగంగా ఈ టికెట్ బిజెపికి ఇవ్వాలని భావించారు. చివరికి ఎన్నికలకు ముందు బుచ్చయ్య చౌదరికి కేటాయించారు. ఆ ఎన్నికల్లో బుచ్చయ్య చౌదరి ఘనవిజయం సాధించారు. ఇక 2019 ఎన్నికల్లో మరోసారి పార్టీ ఆయనకు టిక్కెట్ కేటాయించగా.. మరోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. కానీ, టీడీపీ అధికారం కోల్పోయింది. 1983 నుంచి టీడీపీలోనే కొనసాగుతున్న బుచ్చయ్య చౌదరి  9సార్లు పోటీ చేస్తే 6 సార్లు విజయం సాధించారు. ఈ సమయంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, పొలిటి బ్యూరో సభ్యుడిగా కూడా సేవలందించారు.

Latest Videos

click me!