తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్లంటున్న ఆరా మస్తాన్‌

First Published | Jun 4, 2024, 10:03 AM IST

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార వైసిపి మరోసారి విజయం సాధించే అవకాశాలున్నాయని ఆరా సర్వే తేల్చింది.

Andhra Pradesh

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ విజయం సాధిస్తుందని ఆరా మస్తాన్ తన సర్వేలో ఘంటాపథంగా తెలియజేశారు. అయితే, ట్రెండ్ ఇందుకు వ్యతిరేకంగా ఉంది. పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ఆధిక్యం ప్రదర్శించింది. ఆ తర్వాత కూడా టీడీపీ కూటమి ఆధిక్యం ప్రదర్శిస్తోంది. దీనిపై ఆరా మస్తాన్ స్పందించారు. ఫలితాలు తమ ఎగ్జిట్‌ పోల్స్‌ ప్రకారమే వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. పోస్టల్‌ బ్యాలెట్‌లో లీడ్‌, మొదటి రెండు, మూడు రౌండ్ల లీడ్‌ కూటమికి అనుకూలంగానే ఉంటుందని తాను ముందే అంచనా వేశామన్నారు. ఆ తర్వాత ఫలితాలు మారే అవకాశం ఉంటుందని చెప్పుకొచ్చారు. జనసేన పోటీ చేసిన ప్రతి స్థానంలో టీడీపీ ఓటు బ్యాంకు వంద శాతం ట్రాన్స్‌ ఫర్‌ అయిందని... కానీ, టీడీపీ పోటీ చేసిన స్థానాల్లో ఆ పరిస్థితి లేదంటున్నారు....

Andhra Pradesh

ఇంతకీ ఆయన తన సర్వేలో ఏం చెప్పారంటే...

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార వైసిపి మరోసారి విజయం సాధించే అవకాశాలున్నాయని ఆరా సర్వే తేల్చింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి ప్రజాభిమానాన్ని పొందాడని... అందువల్లే వైసిపికి 94 నుండి 104 సీట్లు వచ్చే అవకాశం వుందని తేల్చింది.  ఇక టిడిపి, జనసేన, బిజెపి కూటమి గట్టి ఫైట్ ఇచ్చినా కేవలం 71-81 స్థానాలకే పరిమితం కావచ్చని తెలిపింది. ఓట్ల పరంగా చూసుకుంటే వైసిపికి 49 శాతం, టిడిపి కూటమికి 47 శాతం ఓట్ షేర్ వస్తుందని ఆరా సర్వే తేల్చింది. 
 


jagan

ఆంధ్ర ప్రదేశ్ లో లోక్ సభ ఎన్నికలతో పాటే అసెంబ్లీ ఎన్నికలు కూడా జరిగాయి. మొత్తం ఏడు దశల్లో లోక్ సభ ఎన్నికలు జరిగితే నాలుగో విడతలో ఏపీ ఎన్నికలు జరిగాయి. మే 13న రాష్ట్రంలోని 175 అసెంబ్లీ, 25 లోక్ సభ స్ధానాలకు ఒకేసారి పోలింగ్ జరిగింది. అధికార వైఎస్సార్ కాంగ్రెస్, ప్రతిపక్ష తెలుగు దేశం-జనసేన-బిజెపి  కూటమి మధ్య ఈ ఎన్నికల్లో హోరాహోరీ పోరు సాగింది.  

Pawan Kalyan

ఈ ఎన్నికల్లో ఆంధ్ర ప్రదేశ్ లో రికార్డుస్థాయిలో ఓటర్లు ఓటుహక్కును వినియోగించుకున్నారు. పల్లెలతో పాటు పట్టణ ఓటర్లు కూడా పోలింగ్ బూత్ కు కదలి రావడంతో అర్థరాత్రి వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగింది. దీంతో ఏకంగా 81.86 శాతం పోలింగ్ నమోదయ్యింది. ఇలా ఓటేయడానికి ప్రజలు పోటెత్తడం ఎవరికి లాభిస్తుంది అన్నది ఉత్కంఠగా మారింది. ఈ క్రమంలో పీపుల్స్ పల్స్ సర్వే టిడిపి కూటమికే విజయావకాశాలు ఎక్కువని తేల్చింది. ఈ సర్వేల్లో ఎవరు చెప్పినది నిజం అవుతుందో తెలియాలంటే.. మరి కాసేపు ఎదురు చూస్తే సరిపోతుంది. 

Latest Videos

click me!