రూ. 150 కోట్ల ఖర్చుకు రెడీ, గన్నవరంలో దమ్మునోడే నిలుపుతాం: చింతమనేని సంచలనం

First Published | Apr 21, 2023, 10:56 AM IST

గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గంపై  టీడీపీ కేంద్రీకరించింది.  వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో   ఈ స్థానంలో  వల్లభనేని వంశీకి ధీటైన అభ్యర్ధిని నిలపాలని  ఆ పార్టీ భావిస్తుంది. 
 

చింతమనేని ప్రభాకర్

గన్నవరం అసెంబ్లీలో  వచ్చే ఎన్నికల్లో డబ్బున్నవాడిని కాదు  దమ్మునోడిని  నిలుపుతామని టీడీపీ  నేత, మాజీ ఎమ్మెల్యే  చింతమనేని ప్రభాకర్  చెప్పారు. గన్నవరంలో  రూ. 150 కోట్లు  ఖర్చు పెడతానని  ఓ వ్యక్తి తన వద్దకు  వచ్చారని కూడా చింతమనేని   పార్టీ కార్యకర్తల సమక్షంలో  సంచలన వ్యాఖ్యలు  చేశారు. 
 

చింతమనేని ప్రభాకర్

ఉమ్మడి కృష్ణా జిల్లాలోని  గన్నవరం, గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గాలపై  టీడీపీ కేంద్రీకరించింది.  2014, 2019 ఎన్నికల్లో  గన్నవరం అసెంబ్లీ స్థానం నుండి  టీడీపీ అభ్యర్ధిగా  వల్లభనేని వంశీ  పోటీ  చేసి  విజయం సాధించారు.  2019 ఎన్నికల తర్వాత  చోటు  చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో  వల్లభనేని వంశీ టీడీపీకి రాజీనామా చేశారు. వైసీపీకి  జై కొట్టారు.  

Latest Videos


చింతమనేని ప్రభాకర్

టీడీపీ చీఫ్ చంద్రబాబు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్  పై  వల్లభనేని వంశీ  తీవ్రస్థాయిలో  విరుచుకుపడుతున్నారు.  2024 అసెంబ్లీ ఎన్నికల్లో  గన్నవరంలో  వల్లభనేని వంశీ,ని  ఓడించాలని టీడీపీ  పట్టుదలగా ఉంది.   ఈ అసెంబ్లీ నియోజకవర్గానికి  ఇంచార్జీగా  ఉన్న  బచ్చుల అర్జునుడు  అనారోగ్య కారణాలతో మృతి చెందాడు. దీంతో  ఈ  అసెంబ్లీ నియోజకవర్గంలో  కొత్త ఇంచార్జీ కోసం  టీడీపీ నాయకత్వం  అన్వేషణ ప్రారంభించింది. 

చింతమనేని ప్రభాకర్

గన్నవరవం అసెంబ్లీ నియోజకవర్గంలో  చంద్రబాబు టూర్ నేపథ్యంలో మాజీ  ఎమ్మెల్యే దాసరి బాలవర్ధన్ రావు  ఫ్లెక్సీలను  ఏర్పాటు చేశారు. 2009లో  గన్నవరం నుండి దాసరి బావర్ధన్ రావు  ఎమ్మెల్యేగా విజయం సాధించారు.  సిట్టింగ్ ఎమ్మెల్యే  దాసరి బాలవర్ధన్ రావును పక్కన పెట్టి  వల్లభనేని వంశీకి  2014లో  చంద్రబాబు టిక్కెట్టు  కేటాయించారు.  ఎమ్మెల్యే టిక్కెట్టు  కోల్పోవడంతో  పాటు  పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయలేదనే  నెపంతో  దాసరి  భాలవర్ధన్ రావు  టీడీపీని వీడి వైసీపీలో   చేరారు.  చంద్రబాబు  టూర్  సమయంలో  బాలవర్ధన్ రావు  పేరుతో  ఫ్లెక్సీలు  ఏర్పాటు  చేయడం  రాజకీయంగా  ప్రాధాన్యత సంతరించుకుంది. 

చింతమనేని ప్రభాకర్

ఇదిలా ఉంటే  గన్నవరంలో  రూ. 150 కోట్లు  ఖర్చు పెడతానని  ఓ వ్యక్తి తన  వద్దకు  వచ్చినట్టుగా  టీడీపీ నేత, దెందులూరు మాజీ ఎమ్మెల్యే  చింతననేని ప్రభాకర్ ప్రకటించారు.  అయితే  ఆ వ్యక్తి  పేరును మాత్రం  చింతమనేని ప్రభాకర్ ప్రకటించలేదు. డబ్మున్నోడిని కాదు , దమ్మునోడిని  మీ నియోజకవర్గంలో  టీడీపీ  బరిలోకి నిలుపుతుందని  చింతమనేని ప్రభాకర్ ప్రకటించారు.  మీరు మీసం మేలేసేలా  పార్టీ నాయకత్వం  చర్యలు తీసుకుంటుందని చింతమనేని ప్రభాకర్ ప్రకటించారు. 

చింతమనేని ప్రభాకర్


2024 లో  ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి  ఎన్నికలు  జరగనున్నాయి.  ఈ ఎన్నికల్లో  విజయం సాధించాలని టీడీపీ, వైసీపీ పట్టుదలగా  ఉన్నాయి.  ఈ దఫా టీడీపీని ఓడిస్తే  ఆ పార్టీ  మరింత బలహీనమయ్యే అవకాశం ఉందని  వైసీపీ భావిస్తుంది.  ఈ దఫా  కచ్చితంగా  అధికారంలోకి   రావాల్సిన  అనివార్య  పరిస్థితులున్నాయని  టీడీపీ నాయకత్వం  భావిస్తుంది.  

చింతమనేని ప్రభాకర్

ఉమ్మడి  కృష్ణా జిల్లాలోని  గన్నవరం తో పాటు  గుడివాడలలో  వల్లభనేని వంశీ,  కొడాలి నానిలను ఓడించాలని  టీడీపీ  వ్యూహారచన చేస్తుంది . ఈ రెండు  నియోజకవర్గాలపై  కేంద్రీకరించింది.

click me!