అంతేకాకుండా, చేనేత కుటుంబాల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఒక ప్రత్యేకమైన ఆరోగ్య భీమా పథకాన్ని ప్రవేశపెట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి సవిత తెలిపారు. ఈ పథకం ద్వారా వారికి మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. అలాగే చేనేత ఉత్పత్తుల మార్కెటింగ్‌ను బలోపేతం చేయడంలో భాగంగా, ఆంధ్రప్రదేశ్ కో-ఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ (ఆప్కో) కేంద్రాలను మరింతగా విస్తరించనున్నారు.