Free Bus: విద్యార్థుల‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం గుడ్ న్యూస్‌.. ఆ రోజు ఆర్టీసీ బ‌స్సులో ఉచిత ప్ర‌యాణం

Published : Jun 16, 2026, 06:09 PM IST

Free Bus: దేశవ్యాప్తంగా జూన్ 21న జరగనున్న నీట్ (NEET) రీ-ఎగ్జామ్‌కు హాజరయ్యే విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. పరీక్షా కేంద్రాలకు వెళ్లే విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించాలని నిర్ణయించింది. 

PREV
15
హాల్ టికెట్ ఉంటే చాలు.. ఉచితంగా ప్రయాణం

నీట్ పరీక్ష రాసే విద్యార్థులు తమ హాల్ టికెట్‌ను బస్సు సిబ్బందికి చూపిస్తే ఉచితంగా ప్రయాణించవచ్చు. పరీక్షా రోజున విద్యార్థులు సకాలంలో కేంద్రాలకు చేరుకోవడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ముఖ్యంగా ఇతర పట్టణాలు, నగరాల్లో పరీక్షా కేంద్రాలు కేటాయించిన విద్యార్థులకు ఇది ఎంతో ఉపయోగకరంగా ఉండనుందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి వెల్లడించారు.

25
ఏయే బస్సుల్లో ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుంది?

APSRTC పరిధిలో నడిచే పలు సాధారణ సర్వీసుల్లో ఈ ఉచిత ప్రయాణ సదుపాయం వర్తించనుంది. పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్, మెట్రో ఎక్స్‌ప్రెస్, సిటీ ఆర్డినరీ బస్సుల్లో విద్యార్థులు ఎటువంటి చార్జీ చెల్లించకుండా ప్రయాణించవచ్చు. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని డిపోలకు ప్రత్యేక సూచనలు పంపినట్లు అధికారులు తెలిపారు.

35
ప్రత్యేక బస్సులు, హెల్ప్ డెస్క్‌లు ఏర్పాటు

పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అవసరమైన ప్రాంతాల్లో అదనపు బస్సులను నడపాలని మంత్రి అధికారులను ఆదేశించారు. పరీక్ష కేంద్రాల వద్ద ప్రత్యేక పర్యవేక్షకులను నియమించడంతో పాటు ప్రధాన బస్ స్టేషన్లలో హెల్ప్ డెస్క్‌లు ఏర్పాటు చేయనున్నారు. ఎక్కడైనా రద్దీ పెరిగితే వెంటనే అదనపు సర్వీసులు అందుబాటులోకి తీసుకురానున్నారు.

45
విద్యార్థులు, తల్లిదండ్రులకు ప్రయోజనం

ప్రతి ఏడాది వేలాది మంది విద్యార్థులు నీట్ పరీక్ష కోసం దూర ప్రాంతాలకు ప్రయాణించాల్సి వస్తోంది. దీంతో కుటుంబాలపై అదనపు ఖర్చు భారం పడుతోంది. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ప్రయాణ వ్యయాన్ని తగ్గించడమే కాకుండా విద్యార్థుల్లో ఒత్తిడిని తగ్గించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. విద్యార్థులకు ఇది ఒక ప్రోత్సాహక చర్యగా భావిస్తున్నారు.

55
పరీక్ష నిర్వహణపై కట్టుదిట్టమైన ఏర్పాట్లు

గతంలో జరిగిన వివాదాల నేపథ్యంలో ఈసారి నీట్ పరీక్షను అత్యంత పకడ్బందీగా నిర్వహించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. పరీక్షకు సంబంధించిన తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని అధికారులు సూచిస్తున్నారు. విద్యార్థులు ముందుగానే తమ ప్రయాణ ప్రణాళిక సిద్ధం చేసుకుని, హాల్ టికెట్‌తో APSRTC ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని ప్రభుత్వం కోరుతోంది.

Read more Photos on
click me!

Recommended Stories