School Holidays 2026-27 : ఈ అకడమిక్ ఇయర్ లో 87 రోజులు సెలవులే.. తెలుగు స్టూడెంట్స్ కి ఏ నెలలో ఎన్ని సెలవులు?

Published : Jun 16, 2026, 03:06 PM IST

Andhra Pradesh School Holidays : అకడమిక్ ఇయర్ 2026-27 లో తెలుగు రాష్ట్రాల్లోని విద్యాసంస్థలకు భారీగా సెలవులు వస్తున్నాయి. దసరా, క్రిస్మస్, సంక్రాంతి పండగలకు ఎన్ని రోజులు సెలవులున్నాయి? ఏ నెలలో ఎన్ని సెలవులు వస్తున్నాయి? తెలుసుకుందాం.  

PREV
15
ఆంధ్ర ప్రదేశ్ అకడమిక్ క్యాలెండర్ 2026-27

School Holidays 2026-27 : తెలుగు రాష్ట్రాల్లో వేసవి సెలవులు ముగిసి స్కూళ్లు రీఓపెన్ అయ్యాయి.. కొత్త అకడమిక్ ఇయర్ 2026-27 ప్రారంభమయ్యింది. సమ్మర్ హాలిడేస్ లో బాగా ఎంజాయ్ చేసిన విద్యార్థులు ఉసూరుమంటూ బడిబాట పట్టారు... దాదాపు రెండు నెలల తర్వాత స్కూలుకు వెళ్లాల్సి రావడం ఎవరికైనా బాధే. అయితే విద్యార్థుల్లో ఈ బాధను తగ్గించేలా ఓ కీలక ప్రకటన చేసింది ఆంధ్ర ప్రభుత్వం. ఇప్పుడు సెలవులు ముగిస్తేనేం... రాబోయే రోజుల్లో భారీగా సెలవులు రాబోతున్నాయని తెలిపింది. ఈ మేరకు అకడమిక్ ఇయర్ లో మొత్తం 229 వర్కింగ్ డేస్ ఉండగా... ఏకంగా 87 రోజులు అంటే దాదాపు 3 నెలలు సెలవులేనని విద్యాశాఖ ప్రకటించింది.

25
ప్రధాన పండగ సెలవుల లిస్ట్..

తెలుగు ప్రజలు ఎంతో వైభవంగా జరుపుకునే పండగలు దసరా, సంక్రాంతి, క్రిస్మస్, రంజాన్. ఈ పండగలకు విద్యార్థులు, ఉద్యోగులకు భారీగా సెలవులుంటాయి. ముఖ్యంగా హిందూ పండగలు దసరా, సంక్రాంతి కి ఏపీలో వరుస సెలవులు ఉంటాయి. ఈ పండగలకు ఈసారి ఎన్నిరోజులు సెలవులు వస్తున్నాయో చూద్దాం.

దసరా సెలవులు 2026-27

సాధారణ పాఠశాలలకు - అక్టోబర్ 12 నుండి 21 వరకు అంటే పదిరోజులు సెలవులు

మైనారిటీ పాఠశాలలకు - అక్టోబర్ 15 నుండి 21 వరకు మాత్రమే సెలవులు

క్రిస్మస్ సెలవులు 2026-27

సాధారణ పాఠశాలలకు - 2026 డిసెంబర్ 25న ఒక్కరోజు మాత్రమే సెలవు ఉంటుంది.

మైనారిటీ పాఠశాలలకు - డిసెంబర్ 20 నుండి 27 వరకు అంటే ఏడ్రోజులు సెలవులుంటాయి.

సంక్రాంతి సెలవులు 2026-27

సాధారణ పాఠశాలలకు - 2027 జనవరి 11 నుండి 17 వరకు అంటే ఆరురోజులు సెలవులు

మైనారిటీ పాఠశాలలకు - జనవరి 13 నుండి 17 వరకు మాత్రమే సెలవులు

35
నెలలవారికి సెలవుల లిస్ట్...

సాధారణంగా ప్రతి నెలలో నాలుగైదు ఆదివారాలు, ఓ రెండో శనివారం కచ్చితంగా ఉంటాయి.. ఈ రోజుల్లో విద్యాసంస్థలకు ఎలాగూ సెలవే. అదనంగా పండగలు, స్థానిక పర్వదినాలు, వేడుకలకు సెలవులు వస్తాయి... వీటిని కలిపితే ప్రతి నెలలో బాగానే హాలిడేస్ ఉంటాయి. ఇలా ఆంధ్ర ప్రదేశ్ లోని విద్యాసంస్థలకు ఏ నెలలో, ఎన్నిరోజులు సెలవులు వస్తున్నాయో తెలుసుకుందాం.

జూన్ 2026

వేసవి సెలవులు ముగిసి జూన్ మిడిల్ లో విద్యాసంస్థలు పున:ప్రారంభం అయ్యాయి. కాబట్టి ఈ నెలలో మిగతా సగం రోజులే విద్యాసంస్థలు నడిచేది. ఇలా మొత్తం 19 రోజులుంటే 15 రోజులే స్కూళ్లు నడిచేది.. నాలుగు రోజులు సెలవులు వస్తున్నాయి.

జూలై 2026

ఈ నెలలో ఎక్కువగా సెలవులు ఉండవు. మొత్తం 31 రోజులకు గాను 26 రోజులు స్కూళ్లు నడుస్తాయి… ఆదివారాలు, రెండో శనివారం మాత్రమే అంటే 5 రోజులు సెలవులున్నాయి. సెలవులు ఉండవు కాబట్టి ఈ నెల విద్యార్థులకు కాస్త బారంగా గడుస్తుంది.

ఆగస్ట్ 2026

ఆగస్ట్ లో స్వాతంత్య్ర దినోత్సవంతో పాటు మరికొన్ని పండగలు వస్తాయి... కాబట్టి సెలవులు ఎక్కువగానే ఉంటాయి. ఈ నెలలో మొత్తం 31 రోజులుంటే 21 రోజులే వర్కింగ్ డేస్. అంటే పది రోజులు సెలవులు వస్తాయి.

సెప్టెంబర్ 2026

ఈ నెలలో మొత్తం 30 రోజులుంటే 22 రోజులు విద్యాసంస్థలు నడుస్తాయి. కేవలం 8 రోజులు సెలవులున్నాయి.

45
ఏ నెలలో ఎన్నిరోజులు సెలవులు?

అక్టోబర్ 2026

అక్టోబర్ లో దసరా పండగ ఉంటుంది.. కాబట్టి భారీగా సెలవులు వస్తాయి. నెలలో పదిరోజులు దసరా సెలవులే... మొత్తంగా 12 రోజులు సెలవులు వస్తాయి.

నవంబర్ 2026

నవంబర్ లో మొత్తం 30 రోజులుంటే 24 రోజులే స్కూళ్లు తెరిచివుంటాయి... 6 రోజులు సెలవులున్నాయి.

డిసెంబర్ 2026

క్రిస్మస్ పండగ నేపథ్యంలో ఈ నెలలో మైనారిటీ విద్యాసంస్థలకు ఎక్కువరోజులు సెలవులుంటాయి. డిసెంబర్ 20 నుండి 27 వరకు క్రిస్టియన్ మైనారిటీ విద్యాసంప్థలకు సెలవులున్నాయి... మొత్తంగా ఈ విద్యాసంస్థలకు 11 రోజుల సెలవులున్నాయి. సాధారణ విద్యాసంస్థలకు 6 రోజులు సెలవులున్నాయి.

జనవరి 2027

జనవరిలో సంక్రాంతి పండగ ఉంటుంది... ఏపీలో ఈ పండగను ఘనంగా జరుపుకుంటారు. కాబట్టి ఈ నెలలో విద్యాసంస్థలు 19 రోజులే నడుస్తాయి... 12 రోజుల సెలవులున్నాయి.

ఫిబ్రవరి 2027

ఫిబ్రవరి నెలలో ఎక్కువగా సెలవులుండవు. మొత్తం 28 రోజులకు గాను 23 వర్కింగ్ డేస్ ఉన్నాయి.. 5 రోజుల సెలవులున్నాయి. అంటే కేవలం సండేలు, సెకండ్ సాటర్డే మాత్నమే సెలవులు.

మార్చి 2027

మార్చి నెలలో విద్యార్థులకు పరీక్షలు ఉంటాయి... కాబట్టి ఎక్కువ సెలవులుండవు. మొత్తం 31 రోజులకు గాను 21 వర్కింగ్ డేస్...10 రోజులు సెలవులు.

ఏప్రిల్ 2027

ఏప్రిల్ చివర్లో వేసవి సెలవులు ప్రారంభం అవుతాయి. 23 రోజులకు గాను 18 వర్కింగ్ డేస్ అంటే 5 రోజులు సెలవులే.

55
ప్రతి శనివారం బ్యాగ్ ఫ్రీ డే

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ప్రాథమిక విద్యాసంస్థల్లో సరికొత్త ప్రయోగం చేస్తోంది... ప్రతి శనివారం 1 నుండి 5వ తరగతి విద్యార్థులకు బ్యాగ్ ఫ్రీ డే గా ప్రకటించింది. అంటే ఈ రోజు ఎలాంటి స్టడీ ఉండదు... కేవలం ఆటాపాటలు, ఇతర యాక్టివిటీస్ ఉంటాయి. ఇలా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల్లో సృజనాత్మకత పెంచేందుకు బ్యాగ్ ఫ్రీ డే ప్రకటించి సరికొత్త ప్రయోగం చేస్తోంది కూటమి ప్రభుత్వం.

Read more Photos on
click me!

Recommended Stories