బయటినుండే వచ్చింది: కేంద్ర హోంశాఖకు నిమ్మగడ్డ లేఖపై ఫోరెన్సిక్ రిపోర్ట్

First Published | May 5, 2020, 12:37 PM IST

కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండాలనే ఉద్దేశ్యంతో ఏపీ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను అప్పటి ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వాయిదా వేశారు. ఈ ఎన్నికలు వాయిదా వేసిన తర్వాత కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ కు రాసిన లేఖపై  పోరెన్సిక్ సంచలన నివేదిక ఇచ్చింది. 

ఏపీ రాష్ట్ర మాజీ ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కేంద్ర హోంశాఖ కార్యదర్శికి రాసిన లేఖపై సీఐడీ దూకుడును పెంచింది. ఈ లేఖ ఎన్నికల సంఘం కార్యాలయంలో తయారు కాలేదని ఫోరెన్సిక్ నివేదిక ఇచ్చినట్టుగా ఫోరెన్సిక్ నివేదిక ఇచ్చింది.
undefined
ఏపీ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేసిన తర్వాత కేంద్ర హోంశాఖ కార్యదర్శికి ఈ ఏడాది మే 18వ తేదీన నిమ్మగడ్డ రమేష్ కుమార్ లేఖ రాశాడు. ఈ లేఖ విషయమై వాస్తవాలను తేల్చాలని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి డీజీపీ గౌతం సవాంగ్ కు లేఖ రాశారు. ఈ లేఖపై విచారణను సీఐడీ చేపట్టింది.
undefined

Latest Videos


నిమ్మగడ్డ రమేష్ కుమార్ రాసిన లేఖను సీఐడీ అధికారులు ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపారు.ఈ లేఖ ఎన్నికల సంఘం కార్యాలయంలో తయారు కాలేదని ఫోరెన్సిక్ ల్యాబ్ తేల్చింది. ఎస్ఈసీ కార్యాలయంలో ఉపయోగించిన ల్యాప్ టాప్, డెస్క్ టాప్ లను పరిశీలించిన తర్వాత ఈ రిపోర్టును ఫోరెన్సిక్ నివేదిక ఇచ్చింది.
undefined
నిమ్మగడ్డ రమేష్ కుమార్ పీఎస్ సాంబమూర్తి తప్పుడు నివేదిక ఇచ్చారని సీఐడీ అధికారులు చెబుతున్నారు. మార్చి 18వ తేదీన పెన్ డ్రైవ్ లో లేఖ వచ్చిందని సీఐడీ అధికారులు చెబుతున్నారు. ఈ లేఖ ఎక్కడ తయారైందనే విషయమై దర్యాప్తు చేస్తున్నామని దర్యాప్తు అధికారులు ప్రకటించారు. రహస్యమైన ఈ లేఖ ఎలా బయటకు వచ్చిందో కూడ విచారణ చేస్తున్నామని సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ చెప్పారు.
undefined
మాజీ ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ రాసిన లేఖ టీడీపీ కార్యాలయంలో తయారైందని కొందరు టీడీపీ నాయకులు కూడ ఈ లేఖ తయారీలో కీలకంగా వ్యవహరించారని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆ లేఖలో ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.
undefined
ఈ లేఖ విషయమై సీఐడీ అధికారులు ఎన్నికల సంఘం కార్యాలయంలో విచారణ జరిపారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ పీఎస్ సాంబమూర్తి ఉపయోగించిన ల్యాప్ టాప్ , డెస్క్ టాప్ లను పరిశాలించారు. ఎన్నికల సంఘం అధికారులను ప్రశ్నించారు.
undefined
పెన్ డ్రైవ్ ధ్వంసం, డెస్క్ టాప్ ఫార్మెట్ చేయడంతో పాటు ల్యాప్ టాప్ లో లెటర్ ను డిలీట్ చేసినట్టుగా విచారణలో సాంబమూర్తి చెప్పారని గతంలోనే సీఐడీ అధికారులు ప్రకటించారు.అయితే ఈ లేఖ తాను రాసిందేనని మాజీ ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కూడ ప్రకటించిన విషయం తెలిసిందే.
undefined
click me!