లాక్ డౌన్ లోనూ యధేచ్చగా... నయా స్టైల్లో ఇసుక, మట్టి అక్రమ తరలింపు

First Published | May 1, 2020, 11:36 AM IST

ఓవైపు లాక్ డౌన్ కొనసాగుతున్నా మరోవైపు ఇసుక, మట్టి అక్రమరవాణా యధేచ్చగా సాగుతోంది. 

అమరావతి: కరోనా మహమ్మారి రోజురోజుకు విజృంభిస్తుండటంతో యావత్ దేశంలో లాక్ డౌన్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇలా ఏపిలో కూడా కేవలం వైద్య సిబ్బంది, పోలీసు వ్యవస్థ వంటి అత్యవసర సర్వీసులు తప్ప వ్యాపారసంస్థలు, ప్రజా రవాణా వంటివన్నీ మూతపడ్డాయి. రాష్ట్రం మొత్తంలో లాక్ డౌన్ కొనసాగుతున్నప్పటికి ఇసుక, మట్టి అక్రమార్కులు మాత్రం దీన్ని పట్టించుకోవడం లేదు. యధేచ్చగా తమ అక్రమదందాను సాగిస్తూ జేబులు నింపుకుంటున్నారు.
undefined
ముఖ్యంగా రాజధాని ప్రాంతంలో ఈ అక్రమ దందా ఎక్కువగా సాగుతోంది. రాత్రి వేళ అక్రమంగా మట్టి, ఇసుక తవ్వకాలు జరుపుతున్నారు. ఇలా తోట్లవల్లూరుమండల పరిధిలోని దేవరపల్లి కేంద్రంగా ఈ అక్రమ దందా నడుస్తోంది.
undefined

Latest Videos


అర్ధ రాత్రి వేళల్లో ఎవరికీ అనుమానం రాకుండా గుట్టుగా మట్టి,ఇసుక తవ్వకాలు చేపడుతున్నాయి కొన్ని ముఠాలు. అదే అర్థరాత్రి సమయంలో ఇసుక, మట్టిని గ్రామాలు దాటించడానికి కొత్త పద్దతిని ఎంచుకున్నారు అక్రమార్కులు. ట్రాక్టర్ల ద్వారా అయితే చప్పుడుకు ప్రజలకు మెలకువ వచ్చి తమ అక్రమదందా బయటపడుతుందని ఎడ్లబండిపై మట్టి, ఇసుకను తరలిస్తున్నారు. ఇలా కొందరు కొత్త తరహాలో అక్రమాలకు పాల్పడుతున్నారు.
undefined
ఇక మరికొందరు అక్రమార్కులు తమను అడ్డుకునేవారు ఎవరూ లేరన్నట్లుగా యధేచ్చగా ట్రాక్టర్లపైనే తరలిస్తున్నారు. ఇలా రోజుకి 50 ట్రాక్టర్ల మట్టి,10ఎడ్ల బళ్ళు ఇసుక, 5 నుండి 6 ట్రాక్టర్ల ఇసుక రాత్రి వేళల్లో అధిక వేగంతో,అధిక లోడుతో వెళుతున్నట్లు సమాచారం.
undefined
అయితే స్థానికులు కొన్నిసార్లు ఈ వాహనాలను పట్టుకునిడ్రైవర్లను ప్రశ్నించిన సమయంలోపోలీసులతో మాట్లాడుకునే మట్టి తరలిస్తున్నట్లు చెబుతున్నారట. కానీ ఈ విషయంపై పోలీసులను అడిగితే తమకేమీ తెలియదు... అలా జరుగుతుందా అంటున్నారట.
undefined
click me!