ఇక ఆంధ్రప్రదేశ్ ప్రాంతాల్లో కూడా తుపాను ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ‘దిత్వా’ ప్రస్తుతం కారైకాల్‌కు 220 కిలోమీటర్లు, పుదుచ్చేరికి 330 కిలోమీటర్లు, చెన్నైకి 430 కిలోమీటర్ల దూరంలో ఉంది. గడిచిన ఆరు గంటల్లో సుమారు 7 కిలోమీటర్ల వేగంతో కదిలిన తుపాను, ఆదివారం తెల్లవారుజామున తీవ్రమైన వాయుగుండంగా మారి తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ ఆంధ్ర ప్రాంతాలకు చేరుకునే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండగా, ప్రకాశం, నెల్లూరు, కడప, అన్నమయ్య జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు ఉంటాయని తెలిపారు. బాపట్ల, పల్నాడు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.