Weather Update: బంగాళాఖాతంలో కొత్త అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాలకు మళ్లీ భారీ వర్షాలు

Published : Oct 30, 2026, 08:38 AM IST

Weather Update: బంగాళాఖాతంలో మరో కొత్త అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మరోసారి భారీ వర్షాలు పడనున్నాయి. తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

PREV
15
వచ్చే మూడ్రోజులు ఏపీ, తెలంగాణలో దంచికొట్టనున్న వానలు

అర్నబ్ తుపాను సృష్టించిన విధ్వంసం నుంచి తెలుగు ప్రజలు తేరుకోకముందే, వాతావరణ శాఖ మరో బిగ్ అప్డేట్ ఇచ్చింది. బంగాళాఖాతంలో వాతావరణ పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. దక్షిణ అండమాన్ సముద్రం, దాని పరిసర ప్రాంతాల్లో గురువారం ఉదయం ఒక కొత్త అల్పపీడనం ఏర్పడింది.

దీనికి అనుబంధంగా సముద్రమట్టానికి దాదాపు 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉన్నట్లు భారత వాతావరణ శాఖ (IMD) స్పష్టం చేసింది. ఈ పరిణామంతో రాబోయే రోజుల్లో ఏపీ, తెలంగాణల్లో వాతావరణం మరింత మారనుంది.

25
వాయుగుండంగా మారి తీరం వైపు.. తుపానుగా మారే ఛాన్స్

ప్రస్తుతం ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ-వాయవ్య దిశగా పయనిస్తూ, అక్టోబర్ 31 (శనివారం) నాటికి ఆగ్నేయ బంగాళాఖాతం, అండమాన్ సముద్ర ప్రాంతాల్లో వాయుగుండంగా బలపడనుంది. ఆ తర్వాత ఇది మరింత తీవ్రమై ఏపీ తీరం వైపు దూసుకొచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.

ఐఎండీ అంచనాల ప్రకారం, నవంబరు 2 లేదా 3వ తేదీ నాటికి ఇది మధ్య కోస్తాలోని మచిలీపట్నం-బాపట్ల ప్రాంతాల మధ్య తీరం దాటే అవకాశముంది. ఇది తుపానుగా మారుతుందా లేదా అనేదానిపై త్వరలోనే పూర్తి స్పష్టత రానుంది.

35
ఏపీకి తుపాన్ భయం: లోతట్టు ప్రాంతాలు జలమయం

ఈ తాజా ముప్పు వల్ల ఏపీలోని కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాలకు తీవ్ర వర్షసూచన ఉంది. నవంబర్ 1 నుంచి వానల తీవ్రత పెరిగి, అనేక చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. ఇప్పటికే అర్నబ్ తుపాన్ దెబ్బకు శ్రీకాకుళం జిల్లా కంచిలిలో ఏకంగా 24.8 సెం.మీ వర్షపాతం నమోదైంది.

నాగావళి, వంశధార నదులు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో పరివాహక ప్రాంతాల ప్రజలు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు ఇప్పటికే వైమానిక సర్వే ద్వారా పంట నష్టాలు, ముంపు ప్రాంతాలను పరిశీలించి బాధితులకు ధైర్యం చెప్పారు. నష్ట తీవ్రతను అంచనా వేసేందుకు కేంద్ర బృందం కూడా రంగంలోకి దిగుతోంది.

45
తెలంగాణలో చలి గాలి ప్లస్ జల్లులు: హైదరాబాద్ వెదర్ పరిస్థితి ఇదీ

మరోవైపు తెలంగాణలోనూ మిశ్రమ వాతావరణం నెలకొంది. రాబోయే మూడ్రోజులు వికారాబాద్‌, రంగారెడ్డి, నారాయణపేట, మహబూబ్‌నగర్‌, వనపర్తి, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. హైదరాబాద్ నగరంలో ఆకాశం మేఘావృతమై ఉంటూ సాయంత్రం వేళల్లో చల్లటి ఈదురుగాలులతో పాటు చిరుజల్లులు పడవచ్చు. మిగతా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో రాత్రి పూట ఉష్ణోగ్రతలు తగ్గి చలి తీవ్రత మెల్లగా పెరుగుతోంది.

55
ప్రజలకు అధికారుల కీలక సూచనలు

వర్షాల హెచ్చరికల నేపథ్యంలో విపత్తు నిర్వహణ శాఖ ప్రజలను అప్రమత్తం చేసింది..

• రైతన్నలు: ప్రస్తుతం పంట కోతల సమయం కాబట్టి ధాన్యం, ఇతర ఉత్పత్తులు తడవకుండా సురక్షిత ప్రాంతాలకు తరలించుకోవాలి.

• మత్స్యకారులు: సముద్రం అలజడిగా ఉండే అవకాశం ఉన్నందున వేటకు వెళ్లకూడదని హెచ్చరించారు.

• సాధారణ ప్రజలు: పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు, కాలువలు దాటే సాహసం చేయవద్దని, ఉరుములు-మెరుపుల సమయంలో చెట్ల కింద లేదా విద్యుత్ స్తంభాల దగ్గర నిలబడకూడదని స్పష్టం చేశారు.

Read more Photos on
click me!

Recommended Stories