Andhra: వైఎస్ జగన్ అధికారంలో ఉండగా సుమారు రూ. 500 కోట్లతో రుషికొండ ప్యాలెస్ నిర్మించారు. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టింది. నిరుపయోగంగా ఉన్న రుషికొండ ప్యాలెస్‌ను ఏం చేయాలి.? అని ప్రజలను సూచనలు అడిగింది. మరి అదేంటో ఇప్పుడు చూసేద్దాం..
ఏపీలోని కూటమి ప్రభుత్వం విశాఖపట్నంలో నిరుపయోగంగా పడి ఉన్న రుషికొండ ప్యాలెస్‌ను ఉపయోగించేందుకు ఆచరణీయమైన పరిష్కారం కోసం ఎదురుచూస్తోంది. గత వైసీపీ ప్రభుత్వం ఈ రుషికొండ ప్యాలెస్‌ను నిర్మించింది. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రెండోసారి అధికారంలో వస్తే.. ఇక్కడ నుంచి పాలన చేపట్టాలని దీన్ని నిర్మించారు. అయితే అది జరగలేదు.
25
15 నెలల నుంచి నిరుపయోగం..
అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూటమి ప్రభుత్వం ఈ రుషికొండ ప్యాలెస్‌ను ఎలా ఉపయోగించుకోవాలని సమాలోచనలు చేసింది. అందుకోసం ప్రజలను కూడా సాయం కోరింది. వారి నుంచి వచ్చే ప్రతిపాదనలను తీసుకోవాలనుకుంది. గత వారం ఈ మేరకు ప్రజల నుంచి సూచనలు అడిగింది ఏపీ పర్యాటక శాఖ.
35
స్టార్ హోటళ్ల సమాఖ్య సరికొత్త ఆలోచన..
ప్రభుత్వ పిలుపు మీరకు ఆంధ్రప్రదేశ్‌లోని స్టార్ హోటళ్ల సమాఖ్య ఓ సరికొత్త ఆలోచనతో ముందుకు వచ్చింది. పర్యాటక కార్యదర్శి అమ్రపాలికి తమ ఆలోచన చెప్పింది. ఈ ఖరీదైన ప్యాలెస్‌ను ఉపయోగించుకునేందుకు సమాఖ్య నాలుగు ప్రతిపాదనలను ముందుకు తెచ్చినట్లు తెలుస్తోంది. ఇది రాష్ట్ర ప్రభుత్వానికి ఎక్కువ భారం కాకుండా ప్రయోజనం చేకూరుస్తుందని సమాచారం.
మొదటి సూచన.. యూఎస్ఏ, యూఏఈ, సింగపూర్ వంటి దేశాలకు ఈ ప్యాలెస్‌ను కాన్సులేట్ కార్యాలయంగా ఇవ్వండని పేర్కొంది. విభజన తర్వాత రాష్ట్రంలో కాన్సులేట్ కార్యాలయం లేకపోవడం వల్ల వైజాగ్‌లోని రుషికొండ ప్యాలెస్‌ను విదేశీ రాయబార కార్యాలయంగా ఏర్పాటు చేయడం స్వాగతించదగ్గ చర్య. కాబట్టి ఇది సముచితమైన నిర్ణయం అని అంటున్నారు విశ్లేషకులు.
55
పీపీపీ మోడల్‌లో..
జాతీయ, అంతర్జాతీయ కార్పొరేట్ బ్రాండ్‌లతో పీపీపీ మోడల్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం భాగస్వామ్యంఅయ్యి.. ఈ ప్యాలెస్‌ను దీర్ఘకాలిక ప్రాతిపదికన లీజుకు ఇస్తే.. రాష్ట్ర ఆదాయం పెరుగుతుందన్నారు. అలాగే మూడో ప్రతిపాదన.. ఈ భవనాన్ని పర్యాటక కేంద్రంగా మార్చడం.. పరిసరాల్లో రిసార్ట్‌లు, బాంకెట్ హాళ్లు, వివాహ వేదికలు, వాటర్ స్పోర్ట్స్ లాంటివి నిర్మిస్తే.. వాటి ద్వారా ప్రభుత్వానికి ఆదాయం లభిస్తుంది. చివరిగా ఫుడ్ కోర్టులను ఏర్పాటు చేసి.. గిరిజన, చేతిపనుల ఉత్పత్తులను ప్రదర్శించి.. బీచ్ ఫెస్టివల్స్, సంగీత కార్యక్రమాలను నిర్వహించడం ద్వారా ప్యాలెస్‌ను సాంస్కృతిక గమ్యస్థానంగా మార్చవచ్చునని అన్నారు. మరి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటోందో చూడాలి.?