మంగళగిరి: తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంపై వైసిపి శ్రేణులు దాడికి పాల్పడిన ఘటన మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. గేట్ ను విరగ్గొట్టి టిడిపి ఆఫీస్ ప్రాంగణంలోకి ప్రవేశించిన కొందరు రాళ్లు, కర్రలతో దాడిచేసారు. కార్యాలయంలో వున్న వ్యక్తులపైనా దాడి చేసి గాయపర్చారు. విషయం తెలిసి టిడిపి చీఫ్ చంద్రబాబు నాయుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ధ్వంసమైన పార్టీ ఆఫీస్ ను పరిశీలించడంతో పాటు గాయపడిన చికిత్స పొందుతున్న వారికి పరామర్శించారు.