Crop Incerance: అన్నదాతలకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి పంటల బీమా (PMFBY) నమోదు గడువును పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. పలు ప్రాంతాల్లో వర్షాలు ఆలస్యంగా కురవడం, విత్తు నాటే సమయం పెరగడంతో ఈ నిర్ణయాన్ని తీసుకుంది.
రైతులకు ప్రభుత్వం నుంచి ఒక ఇంపార్టెంట్ అప్‌డేట్ వచ్చింది. ఈ ఏడాది వాతావరణంలో వస్తున్న విపరీతమైన మార్పులు, ఎల్ నినో భయాల నేపథ్యంలో పంటలకు బీమా చేయించుకోవడం చాలా అవసరమని ప్రభుత్వం చెబుతోంది. వాస్తవానికి ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన (PMFBY) కింద ప్రీమియం చెల్లించేందుకు ఆగస్టు 15వ తేదీతోనే గడువు ముగిసింది. కానీ, గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ చాలామంది రైతులు రిజిస్ట్రేషన్ చేసుకోలేకపోయారు. అందుకే అన్నదాతల క్షేమం కోసం ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బీమా నమోదు గడువును ఈ నెలాఖరు వరకు, అంటే ఆగస్టు 31వ తేదీ వరకు పొడిగించింది.
26
ఎల్ నినో ముప్పు.. జాగ్రత్త పడాల్సిందే
ఈ సంవత్సరం ఎల్ నినో ప్రభావం వల్ల వర్షాభావ పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఏ క్షణంలో వాతావరణం మారిపోతుందో, అకాల వర్షాలు ముంచెత్తుతాయో లేదా కరవు తాండవిస్తుందో చెప్పడం కష్టం. అసెంబ్లీలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. రైతులెవరూ రిస్క్ తీసుకోవద్దని, వెంటనే బీమా ప్రక్రియ పూర్తి చేసుకోవాలని కోరారు. పంట చేతికి వచ్చే వరకు ఏ గ్యారెంటీ లేని ఈ రోజుల్లో పంటల బీమా అనేది రైతుకు ఒక సురక్షితమైన కవచంలా పనిచేస్తుందని స్పష్టం చేశారు.
36
ప్రభుత్వం భరించే ప్రీమియం ఎంత?
చాలామంది రైతులు ఇన్సూరెన్స్ అంటే వేలల్లో ఖర్చవుతుందని భయపడుతుంటారు. కానీ ఫసల్ బీమా యోజనలో రైతు చెల్లించాల్సిన ప్రీమియం చాలా చాలా తక్కువ. ఖరీఫ్ పంటలకు కేవలం 2 శాతం, రబీ పంటలకు 1.5 శాతం, వాణిజ్య పంటలకు 5 శాతం ప్రీమియం మాత్రమే చెల్లిస్తే సరిపోతుంది. ఉదాహరణకు రైతు వాటా అత్యంత స్వల్పంగా ఉంటే, మిగిలిన ప్రధానమైన ప్రీమియం మొత్తాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే భరిస్తాయి. రూపాయి ఖర్చు పెద్దగా లేకుండా వేల రూపాయల నష్టపరిహారం పొందే అవకాశాన్ని అస్సలు వదులుకోవద్దని అధికారులు చెబుతున్నారు.
రైతులు తమ సమీపంలోని సీఎస్‌ఈ (CSC) సెంటర్లు లేదా మీ సేవా కేంద్రాలను సంప్రదించి బీమా నమోదు చేసుకోవచ్చు.
ముఖ్యమైన డాక్యుమెంట్: మీ 'రైతు రిజిస్ట్రీ నంబరు' ఆధారంగానే బీమా ప్రీమియం స్వీకరిస్తారు.
వరి సాగు రైతులు: వరి పంట వేసే రైతులు ఆగస్టు 31 లోపు రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవచ్చు.
ఇతర పంటల రైతులు: మిగిలిన పంటలు వేసిన రైతులు తమ ప్రాంతీయ వ్యవసాయ అధికారులు లేదా బీమా కంపెనీ ప్రతినిధులను సంప్రదించాలి.
ప్రస్తుతం ఏపీలో 16.15 లక్షల హెక్టార్లలో బీమా నమోదైంది. జాతీయ స్థాయిలో మన రాష్ట్రం పంటల బీమాలో 5వ స్థానంలో నిలిచింది. అనంతపురం (3.66 లక్షల హెక్టార్లు), కర్నూలు (3.31 లక్షల హెక్టార్లు), శ్రీసత్యసాయి (2.31 లక్షల హెక్టార్లు) జిల్లాల్లో అత్యధికంగా నమోదు చేసుకున్నారు.
56
ప్రజాప్రతినిధులు రంగంలోకి దిగాలి
ఈ బీమా నమోదు కార్యక్రమాన్ని కేవలం అధికారుల బాధ్యతగానే చూడకుండా, ప్రజాప్రతినిధులు, స్థానిక ఎమ్మెల్యేలు కూడా చొరవ తీసుకోవాలని మంత్రి అచ్చెన్నాయుడు పిలుపునిచ్చారు. నియోజకవర్గాల వారీగా ప్రత్యేక సమావేశాలు పెట్టి, రైతు సేవా కేంద్రాల సిబ్బందితో కలిసి రైతులకు ఫుల్ అవేర్‌నెస్ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ప్రకృతి వైపరీత్యాలు, తెగుళ్లు వచ్చినప్పుడు ఏ ఒక్క రైతు కన్నీరు పెట్టకూడదనే ఉద్దేశంతోనే ప్రభుత్వం పారదర్శకంగా ఈ పథకాన్ని అమలు చేస్తోందని తెలిపారు.
66
పంటల బీమాతో కలిగే టాప్ ప్రయోజనాలు
కోత అనంతర రక్షణ: పంట కోసిన తర్వాత పొలంలో ఆరబెట్టినప్పుడు హఠాత్తుగా తుపాను వచ్చి ధాన్యం తడిసిపోయినా పరిహారం వస్తుంది.
విత్తనం పడకపోయినా ఓకే: వాతావరణం సహకరించక అసలు విత్తనాలు వేయలేని పరిస్థితి వచ్చినా లేదా మొలకలు రాకపోయినా బీమా కవరేజ్ లభిస్తుంది.
సాంకేతిక పరిజ్ఞానం: డ్రోన్లు, శాటిలైట్ మ్యాపింగ్ ద్వారా పంట నష్టాన్ని వేగంగా, పారదర్శకంగా అంచనా వేసి నేరుగా రైతు ఖాతాలోనే క్లెయిమ్ జమ చేస్తారు.
రుణాల భారం కాన్సిల్: పంట పోయినా బీమా పరిహారంతో బ్యాంక్ అప్పులు తీర్చి, తర్వాతి సీజన్‌కు కావాల్సిన విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసుకోవచ్చు. వానలు లేక పంటలు ఎండిపోయినా, భారీ వర్షాలతో పంటల నష్టం జరిగినా బీమా వర్తిస్తుంది. అయితే, దీనికి కొన్ని పరిమితులు ఉంటాయి.