AP Intermediate Results : తెలుగు రాష్ట్రాల్లో ఎగ్జామ్స్ సీజన్ ముగిసి రిజల్ట్స్ సీజన్ ప్రారంభమయ్యింది. ఇప్పటికే తెలంగాణలో ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఫలితాలు వెలువడగా ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ లో రిజల్ట్స్ విడుదలయ్యాయి. ఇవాళ (ఏప్రిల్ 15, బుధవారం) ఉదయం 10.30 గంటలకు ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలను విడుదల చేసింది ఏపీ ఇంటర్ బోర్డ్.
25
రిజల్ట్స్ ఎలా చెక్ చేసుకోవాలి..?
ఆంధ ప్రదేశ్ లో ఈసారి దాదాపు 10 లక్షలకు పైగా విద్యార్థులు ఇంటర్మీడియట్ పరీక్షలు రాశారు. ఇటీవలే పరీక్షలు ముగిశాయి… అప్పటినుండి విద్యార్థులతో పాటు వీరి తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు ఫలితాలకోసం ఉత్కంఠగా ఎదురుచూశారు. వారి ఎదురుచూపులకు ఇవాళ్టితో తెరపడనుంది... మరికొద్దిసేపట్లో పలితాలు వెలువడనున్నాయి.
బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఆంధ్ర ప్రదేశ్ (BIEAP) అధికారిక వెబ్ సైట్ resultsbie.ap.gov.in ద్వారా పలితాలను ఈజీగా తెలుసుకోవచ్చు. ఇంటర్ బోర్డ్ అధికారులు ఫలితాలను ప్రకటించిన వెంటనే ఈ వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచుతారు. హాల్ టికెట్ ఆధారంగా విద్యార్థులు తమ రిజల్ట్స్ చెక్ చేసుకోవచ్చు.
ఇంటర్ బోర్డ్ మాత్రమే కాదు మరికొన్ని వెబ్ సైట్స్ ద్వారా కూడా పలితాలను పొందవచ్చు. అవి..
examsresults.ap.nic.in
results.apcfss.in
manabadi.co.in
35
ఇంటర్ ఫలితాలను తెలుసుకోండిలా... స్టెప్ బై స్టెప్ ప్రాసెస్
మొదట పైన పేర్కొన్న ఏదైనా వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయండి.
హోమ్ పేజీలో 'AP Inter 1st Year Results 2026' లేదా 'AP Inter 2nd Year Results 2026' లింక్‌పై క్లిక్ చేయండి.
మీ హాల్ టికెట్ నంబర్, పుట్టిన తేదీ (DOB) వివరాలను నమోదు చేయండి.
'Get Result' లేదా 'Submit' బటన్‌పై క్లిక్ చేస్తే మీ మార్కుల జాబితా స్క్రీన్ మీద కనిపిస్తుంది.
భవిష్యత్తు అవసరాల కోసం రిజల్ట్ కాపీని డౌన్‌లోడ్ చేసుకుని ప్రింట్ తీసి పెట్టుకోండి.
ఓకేసారి విద్యార్థులు రిజల్ట్స్ కోసం వెబ్‌సైట్స్ ఓపెన్ చేస్తారు… కాబట్టి రద్దీ ఎక్కువగా ఉండే అవకాశాలుంటాయి. ఈ క్రమంలో విద్యార్థులు 'Mana Mitra' వాట్సాప్ సేవ ద్వారా కూడా ఫలితాలు తెలుసుకోవచ్చు. ఇందుకోసం మీ ఫోన్ లోని వాట్సాఫ్ నుండి 9552300009 నంబర్‌కు "Hi" అని మెసేజ్ పంపి, సూచనలు అనుసరిస్తే మార్క్స్ మెమో ఫోన్‌కే వస్తుంది. ఈజీగా ఫలితాలు తెలుసుకునే ఏర్పాటుచేసింది ప్రభుత్వం.
55
మార్కులు తక్కువగా వస్తే నిరాశ వద్దు...
ఫలితాల అనంతరం విద్యార్థులు తమ మార్కులతో సంతృప్తి చెందకపోతే రీ-వెరిఫికేషన్ లేదా రీ-కౌంటింగ్‌కు దరఖాస్తు చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఇందుకు సంబంధించిన తేదీలను ఫలితాల ప్రకటన సమయంలోనే అధికారులు వెల్లడించనున్నారు.
అయితే మార్కులు తక్కువగా వచ్చాయని... ఫెయిల్ అయితే పేరెంట్స్ కోప్పడతారని ఆందోళన వద్దు. ఈ పరీక్షలు, ఫలితాలే జీవితం కాదు... ఈ విషయాన్ని విద్యార్థులు గుర్తించాలి. ఫలితం ఎలా ఉన్నా స్వీకరించడానికి సిద్దంగా ఉండాలి. పేరెంట్స్ కూడా పిల్లలపై ఒత్తిడి తీసుకురావద్దు... వారి తెలివిని మార్కుల ఆధారంగా కొలవడం మానేయాలి. రిజల్ట్స్ సమయంలో విద్యార్థులు కంగారుపడకుండా ధైర్యంగా ఉండాలి.