srikakulam folk : మారుమూల పల్లెలో పుట్టి న్యూయార్క్ టైం స్వేర్ కు చేరిన తెలుగు జానపదం.. ఏదో తెలుసా..?

Published : Apr 13, 2026, 11:47 AM IST

తెలుగు జానపదం ‘’నాదీ నక్కిలీసు గొలుసు'' ఖండాంతరాలు దాటింది. యూట్యూబ్ లో అయితే ఈ పాట మిలియన్ల కొద్ది వ్యూస్ సాధించింది. సంగీత ప్రియులను ఎంతగానో ఆకట్టుకున్న ఈ పాట ఏ ప్రాంతానికి చెందినదో తెలుసా..?

PREV
13
ఖండాంతరాలు దాటిన నక్కిలీసు గొలుసు జానపదం...

srikakulam folk : ఇప్పుడంతా జానపద పాటల హవా నడుస్తోంది. 'రాను బొంబైకి రాను'', ''బాయిలోనే బల్లి పలికే'', ''ఓ పిలగ వెంకటేశు'' అంటూ సాగే ఈ తెలంగాణ ఫోక్ సాంగ్స్ యూట్యూబ్ ను ఎంతలా షేక్ చేస్తేన్నాయో చూస్తున్నాం… క్లాస్, మాస్ అని తేడాలేకుండా అందరినీ ఆకట్టుకుంటున్నాయి. అందుకే ప్రస్తుతం ఫోక్ సింగర్స్, డ్యాన్సర్లు రాత్రిరాత్రికి సెలబ్రిటీలుగా మారిపోతున్నారు.

అయితే కేవలం తెలంగాణలోనే కాదు ఆంధ్ర ప్రదేశ్ లోని కొన్ని ప్రాంతాల్లో జానపద పాటలు బాగా ఫేమస్. ముఖ్యంగా వెనబడిన ప్రాంతం ఉత్తరాంధ్రలో తెలంగాణ తరహా జానపదాలు వినిపిస్తుంటాయి... ''ఏం పిల్లడో ఎల్దాం వస్తవా..'' అంటూ నక్సల్స్ ఉద్యమాన్ని ఉర్రూతలూగించిన వంగపండు ప్రసాదరావు ఈ ప్రాంతానికి చెందినవారే. ఇలాంటి ఉద్యమ పాటలే కాదు రొమాంటిక్ గా సాగే జానపదాలు కూడా శ్రీకాకుళం యాసలో అద్భుతంగా ఉంటాయి... అలాంటిదే ఈ 'నక్కిలీసు గొలుసు' సాంగ్.

23
ఈ ఉత్తరాంధ్ర జానపదానికి యూట్యూబ్ షేక్..

ఉత్తరాంధ్ర జానపదానికి ప్రత్యేక గుర్తింపు తెచ్చింది ఈ నక్కిలీసు గొలుసు సాంగ్. శ్రీకాకుళంలో జరిగిన ఓ యధార్థ సంఘటన ఆధారంగా రూపొందించిన 'పలాస 1978' సినిమాలో ఈ పాటను వాడారు. జానపదానికి కాస్త లేటెస్ట్ మ్యూజిక్ టచ్ ఇచ్చి సంగీత డైరెక్టర్ రఘు కుంచె మరింత అద్భుతంగా మార్చాడు... ఇలా యూట్యూబ్ లో విడుదలైన ''నాది నక్కిలీసు గొలుసు'' సాంగ్ ఇప్పటివరకు 145M అంటే 145,363,331 వీవ్స్ సాధించింది.

33
దుమ్మురేపిన నక్కిలేసు గొలుసు సాంగ్..

ఓ తెలుగు ఛానల్లో వచ్చే డ్యాన్స్ రియాలిటీ షో తో శ్రీకాకుళం జానపదం ''నాది నక్కిలీసు గొలుసు'' ప్రజల్లోకి మరింత దూసుకెళ్లింది. కొరియోగ్రాఫర్ ఆడవేషంలో డ్యాన్స్ అదరగొట్టడంతో ఈ సాంగ్ పై హైప్ పెరిగింది. సినిమా విడుదల సమయంలో కంటే ఈ టీవీ షో ద్వారానే ఈ పాట ప్రజలకు బాగా దగ్గరయ్యింది.

ఇలా ఒక్కసారి ప్రజల్లోకి దూసుకెళ్లిన 'నాదీ నక్కిలేసు గొలుసు' సాంగ్ సోషల్ మీడియాను షేక్ చేసింది. దీనిపై లక్షలాది రీల్స్ వచ్చాయి... చిన్నాపెద్ద తేడాలేకుండా వీడియోలు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. చివరకు ఎక్కడో ఉత్తరాంధ్ర మారుమూల ప్రాంతంలో పుట్టిన ఈ పాట న్యూయార్స్ టైం స్క్వేర్ వీధుల్లో ప్రదర్శించే స్థాయికి చేరింది... యావత్ ప్రపంచానికి పరిచయం అయ్యింది.

 

Read more Photos on
click me!

Recommended Stories