AP Inter Hall Ticket 2025: ఏపీ ఇంటర్‌ హాల్‌ టికెట్లు.. వాట్సాప్‌లోనే డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఎలాగంటే..

Published : Feb 20, 2025, 10:11 AM IST

ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియట్‌ పరీక్షల షెడ్యూల్‌ను అధికారులు ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పరీక్షలకు సంబంధించిన హాల్‌ టికెట్లను విడుదల చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఇంతకీ ఇంటర్‌ హాల్‌ టికెట్లను ఎలా డౌన్‌లోడ్‌ చేసుకోవాలి.? పూర్తి వివరాలు మీకోసం..   

PREV
14
AP Inter Hall Ticket 2025: ఏపీ ఇంటర్‌ హాల్‌ టికెట్లు.. వాట్సాప్‌లోనే డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఎలాగంటే..

ఏపీలో మార్చి 1వ తేదీ నుంచి ఇంటర్‌ పరీక్షలు జరగనున్నాయి. ఫస్ట్‌ ఇయర్‌ పరీక్షలు మార్చి 1వ తేదీ నుంచి ప్రారంభమవుతుండగా సెకండ్‌ ఇయర్‌ ఎగ్జామ్స్‌ మార్చి 3వ తేదీ నుంచి జరగనున్నాయి. పరీక్షలకు ఇంకా కేవలం వారం రోజులు మాత్రమే ఉన్న నేపథ్యంలో ఇంటర్మీడియట్‌ బోర్డ్‌ హాల్‌ టికెట్లను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సిద్ధమైంది. గురువారం హాల్‌ టికెట్లు అందుబాటులోకి రానున్నాయని అధికారులు ప్రకటించారు. వాట్సాప్‌ గవర్నెన్స్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చిన క్రమంలో ఈసారి విద్యార్థులు వెబ్‌సైట్‌తో పాటు, వాట్సాప్‌లో కూడా హాల్‌ టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. 
 

24
Plus 2 exams

కాగా ఈసారి ఇంటర్‌ పరీక్షలను రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 1535 సెంటర్లలో ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ ఏడాదికి ఇంటర్‌ పరీక్షలకు మొత్తం 10,58,893 మంది విద్యార్థులు హాజరవుతున్నారు. ఫస్ట్‌ ఇయర్ మొత్తం విద్యార్ధుల్లో జనరల్‌ విద్యార్థులు 5,00,963 మంది, ఒకేషనల్‌ విద్యార్థులు 44,581 మంది ఉన్నారు. సెకండ్‌ ఇయర్‌ విషయానికొస్తే జనరల్‌ విద్యార్థులు 4,71,021 మంది, ఒకేషనల్‌ విద్యార్థులు 42,328 మంది ఉన్నారు. పేపర్‌ లీకేజీలను అరికట్టేందుకు కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రశ్నాపత్రాలపై క్యూఆర్‌ కోడ్‌ విధానాన్ని అమలు చేస్తున్నారు. దీంతో ప్రశ్నపత్రం బయటకు వస్తే అది ఎక్కడి నుంచి వచ్చిందన్న విషయాన్ని ఇట్టే తెలుసుకోవచ్చు. 
 

34
jee hall ticket

వెబ్‌సైట్‌ ద్వారా ఎలా డౌన్‌లోడ్‌ చేసుకోవాలి: 

* ఇందుకోసం ముందుగా విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి.

* వెంటనే స్క్రీన్‌పై లేటెస్ట్‌ అప్‌డేట్స్‌లో ఇంటర్‌ హాల్‌ టికెట్స్‌కు సంబంధించి ఒక లింక్‌ కనిపిస్తుంది. 

* ఆ లింక్‌ను క్లిక్‌ చేసి సంబంధిత వివరాలు అందిస్తే చాలు వెంటనే హాల్‌ టికెట్‌ డౌన్‌లోడ్‌ అవుతుంది. 

* వివరాలన్నింటినీ సరి చూసుకొని డౌన్‌లోడ్‌ చేసుకుంటే సరిపోతుంది. 
 

44
Whats App

వాట్సాప్‌లో ఎలా డౌన్‌లోడ్‌ చేసుకోవాలంటే: 

ఏపీ ప్రభుత్వం వాట్సాప్‌ గవర్నెన్స్‌లో భాగంగా నేరుగా వాట్సాప్‌లోనే పలు సేవలను అందుబాటులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే విద్యార్థులు తమ హాల్‌ టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. 

* ఇందుకోసం ముందుగా మీ స్మార్ట్‌ ఫోన్‌లో 9552300009 నెంబర్‌ను సేవ్‌ చేసుకోవాలి. 

* అనంతరం ఆ నెంబర్‌కి హాయ్‌ అని మెసేజ్‌ చేయాలి. 

* సర్వీస్‌ను సెలక్ట్‌ చేసుకోవాలని ఆప్షన్‌ కనిపిస్తుంది. 

* సర్వీస్‌ పై క్లిక్‌ చేసి విద్యా సేవలను ఎంచుకోవాలి. 

* హాల్‌ టికెట్‌ డౌన్‌లోడ్‌పై క్లిక్‌ చేయగానే. ఇంటర్మీడియట్‌ ఎగ్జామ్స్‌ ఆప్షన్‌ కనిపిస్తుంది. 

* దానిపై క్లిక్‌ చేసి సంబంధిత వివరాలు అందిస్తే చాలు మీ ఫోన్‌లో హాల్‌ టికెట్‌ డౌన్‌లోడ్‌ అవుతుంది. దానిని ప్రింట్ తీసుకుంటే సరిపోతుంది. 
 

click me!

Recommended Stories