పోలీసులూ జాగ్రత్త ... మీ బట్టలూడదీసి నిలబెడతా : వైఎస్ జగన్ సీరియస్ వార్నింగ్

Published : Feb 18, 2025, 01:50 PM ISTUpdated : Feb 18, 2025, 01:58 PM IST

 విజయవాడ జైల్లో రిమాండ్ ఖైధీగా ఉన్న మాజీ ఎమ్మెల్యే, వైసిపి నేత వల్లభనేని వంశీని మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా పోలీసులపై సంచలన కామెంట్స్ చేసారు జగన్.  

PREV
13
పోలీసులూ జాగ్రత్త ... మీ బట్టలూడదీసి నిలబెడతా : వైఎస్ జగన్ సీరియస్ వార్నింగ్
YS Jaganmohan Reddy

 YS Jaganmohan Reddy : వైసిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పోలీసులపై మరోసారి విరుచుకుపడ్డారు. అధికార తెలుగుదేశం పార్టీకి కొమ్ముకాస్తూ వైసిపి నాయకులపై అక్రమ కేసులు పెడుతూ కొందరు ఓవరాక్షన్ చేస్తున్నారని... అలాంటివారిని వదిలిపెట్టే ప్రసక్తేలేదని హెచ్చరించారు. ఎల్లకాలం తెలుగుదేశం ప్రభుత్వం ఉండదు... తమ ప్రభుత్వం వచ్చాక అన్యాయం చేసిన అధికారుల పని పడతామంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇకనైనా పోలీసులు టిడిపి నాయకుల కోసం పనిచేయడం ఆపాలని... టోపీపై ఉండే మూడు సింహాలకు సెల్యూట్ చేయాలని జగన్ సూచించారు.

గతంలో టిడిపి కార్యాలయంపై దాడితో పాటు ఫిర్యాదుచేసిన వ్యక్తి కిడ్నాప్, బెదిరింపుల కేసులో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టయ్యాడు. అతడు విజయవాడ జైల్లో రిమాండ్ ఖైధీగా ఉన్నాడు. ఇవాళ అతడిని వైఎస్ జగన్ పరామర్శించారు... అనంతరం అదే జైలు బయట మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా పోలీసులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు జగన్. 

వంశీ అరెస్ట్ సమయంలో కూడా ఓ సిఐ చాలా దురుసుగా ప్రవర్తించాడట... మరికొద్దిరోజుల్లో రిటైర్ అవుతున్నాను కాబట్టి మీరేం చేయలేరని అన్నాడట. ఇలాంటి పోలీసులకు చెబుతున్నా... మీరు రిటైరయి సప్త సముద్రాల అవతల ఉన్నా తీసుకువస్తాం... బట్టలు ఊడదీస్తాం అని వైఎస్ జగన్ వార్నింగ్ ఇచ్చారు. 

ఈ ప్రభుత్వం చేస్తున్న అన్యాయంలో భాగస్వాములు కావద్దు.... లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని జగన్ హెచ్చరించారు. మీ వ్యక్తిత్వాన్ని కాపాడుకోవాలని పోలీసులకు సూచించారు. ఓవరాక్షన్ చేస్తే ఆ దేవుడు, ప్రజలే శిక్షిస్తారని జగన్ అన్నారు. 

23
Vallabhaneni Vamshi Arrest

టిడిపి ఆఫీసుపై కాదు...ముందు వైసిపి ఆఫీసుపైనే దాడి : వైఎస్ జగన్ 

గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడికాదు...ముందుగా వైసిపి ఆఫీసుపైనే దాడి జరిగిందని జగన్ తెలిపారు. పిబ్రవరి 20, 2023 న టిడిపి నాయకుడు చంద్రబాబు నాయుడు ఆదేశాలతోనే కొమ్మారెడ్డి పట్టాభిరాం గన్నవరం వచ్చాడని తెలిపారు. అంతకుముందే వంశీని ఉద్దేశించి 'వాడో పిల్ల సైకో...నేనే గన్నవరం వెళతా...వంశీ సంగతి తేలుస్తా' అంటూ పట్టాభి రెచ్చగొట్టేలా మాట్లాడాడని జగన్ తెలిపారు.

కొందరు మనుషులను వేసుకుని గన్నవరం వచ్చిన పట్టాభిరాం మళ్లీ వంశీని తిట్టాడని... అక్కడితో ఆగకుండా వైసిపి ఆఫీసుపై దాడికి పట్టాభి బయలుదేరాడని తెలిపారు. వైసిపి ఆఫీసు బయట ఉన్న దళిత సర్పంచ్ సీనయ్యపై కూడా పట్టాభిరాం మనుషులు దాడిచేసారని తెలిపారు. పోలీసులు ఈ దాడిని ఆపడానికి విశ్వప్రయత్నం చేసారు... ఈ క్రమంలోనే సిఐ కనకరావు తలను టిడిపి నాయకులు పగలగొట్టారని తెలిపారు. 

ఇలా రెచ్చగొట్టేలా మాట్లాడటం, బౌతిక దాడులకు దిగడంతో వైసిపి నాయకులు ప్రతిచర్యగా టిడిపి కార్యాలయంపైకి వెళ్లారని జగన్ తెలిపారు. పరస్పర దాడులకు సంబంధించి పోలీసులు రెండువైపులా కేసులు పెట్టారన్నారు. ఈ గొడవలో వంశీ ఎక్కడా జోక్యం చేసుకోలేదు... గన్నవరం టిడిపి ఆఫీసులో పనిచేసే సత్యవర్థన్ స్టేట్ మెంట్ లో కూడా ఎక్కడా వంశీ పేరు లేదన్నారు. కానీ అతడిని చంద్రబాబు పిలిపించుకుని తెల్లకాగితంపై సంతకం చేయించుకున్నారని... తరవారితో ఫిర్యాదు ఇప్పించారని అన్నారు. 

ఫిబ్రవరి 23, 2023 న సత్యవర్ధన్ నుండి పోలీసులు 161 స్టేట్ మెంట్ తీసుకున్నారు... అందులోనూ వంశీ పేరు లేదని జగన్ పేర్కొన్నారు. తనను ఎవరూ కులం పేరుతో తిట్టలేదని చెప్పాడు... ఘటన జరగినప్పుడే అక్కడినుండి వెళ్లిపోయానని సత్యవర్థన్ స్టేట్ మెంట్ ఇచ్చాడని వివరించారు. కానీ టిడిపి అధికారంలోకి వచ్చాక జూలై 10, 2024 ఈ కేసు రీఓపెన్ చేసారని.... సత్యవర్థన్ నుండి 161 స్టేట్ మెంట్ రెండోసారి తీసుకున్నారని తెలిపారు. అప్పుడుకూడా సత్యవర్ధన్ తనను ఎవరూ తిట్టలేదని... వంశీ అక్కడ లేడని చెప్పాడన్నారు. కానీ వంశీమీద కోపంతో 71వ నిందితుడిగా చేర్చారని జగన్ తెలిపారు.

వంశీపై పెట్టిన కేసులన్ని బెయిలబుల్ ... అందుకే ఎస్సి, ఎస్టి కేసులు పెట్టారన్నారు. గన్నవరం పార్టీ ఆఫీసును తగలబెట్టే ప్రయత్నం చేసాడని మరోకేసు పెట్టించారని జగన్ తెలిపారు. ఆ ఆఫీసు ఎస్సి ఎస్టీలది అని చెప్పి ఈ కేసు పెట్టించారు... కానీ ఆ భవనం కడియాల సీతారామయ్య అనే ఓసిది.... అతడు చంద్రబాబుకు సంబంధించిన వ్యక్తి అని జగన్ వివరించారు.

33
YSR Congress Party

సత్యవర్థన్ ను బెదిరించిది వంశీ కాదు... చంద్రబాబు, లోకేష్ లే : వైఎస్ జగన్ 

సత్యవర్ధన్ ను మెజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం ఇచ్చేందుకు అనేకసార్లు సమన్లు జారీ చేసారు... అయినా అతడిని హాజరుకాకుండా అడ్డుకున్నారని జగన్ తెలిపారు. ఇలా 20 సార్లు సమన్లు పంపిచినా కోర్టుకు రాకపోవడంతో పోలీసులపై జడ్జి సీరియస్ అయ్యారు... ఖచ్చితంగా తీసుకురావాల్సిందేనని హెచ్చరించారు... దీంతో చేసేదేమిలేక పోలీసులు అతడిని కోర్టులో హాజరుపర్చాడని తెలిపారు. అప్పుడు కూడా సత్యవర్ధన్ 161 స్టేట్ మెంట్ లో చెప్పిందే చెప్పాడని జగన్ అన్నారు. 

తాను తన తల్లి ఆటోలో కూర్చుని వచ్చామని... స్టేట్ మెంట్ వెనక ఎవరి బలవంతం లేదని సత్యవర్థన్ ఫిబ్రవరి 10, 2025 స్టేట్ మెంట్ ఇచ్చాడన్నారు. దీంతో చంద్రబాబు, లోకేష్ కు మనశ్శాంతి లేకుండాపోయింది... అందుకే పోలీసులతో కుట్రపన్ని ఫిబ్రవరి 11న సత్యవర్థన్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేయించారు. కోర్టును తప్పుదోవ పట్టించేలా తప్పుడు సాక్ష్యం ఇచ్చాడని కేసు నమోదు చేసారని జగన్ తెలిపారు.

సత్యవర్ధన్ కుటుంబాన్ని బెదిరించి ఫిబ్రవరి 12న అతడి అన్ననుండి తప్పుడు ఫిర్యాదు చేయించారని జగన్ తెలిపారు. సత్యవర్ధన్ ను కిడ్నాప్ చేసుకుని పోయాడని... రూ.20 వేలు లాక్కున్నారని ఫిర్యాదు చేయించారు. దీంతో ఫిబ్రవరి 13న పొద్దునే వంశీ అరెస్ట్ చేసారు... కానీ ఫిబ్రవరి 13న రాత్రి సత్యవర్థన్ నుండి   స్టేట్ మెంట్ తీసుకున్నారని తెలిపారు. ఇలా ఈ వంశీ అరెస్ట్ వెనక హైడ్రామా నడిచిందని...  నిజానికి సత్యవర్ధన్ ను కిడ్నాప్ చేసింది వంశీ కాదు టిడిపి నాయకులేనని వైసిపి అధినేత జగన్ ఆరోపించారు. 

Read more Photos on
click me!

Recommended Stories