Andhra Pradesh లో వారికి జీతాల పెంపు..ఏకంగా ఒక్కొక్కరికి రూ.6 నుంచి రూ.7 వేలు!

Published : Jul 01, 2025, 10:52 AM IST

గిరిజన గురుకులాల్లో ఔట్‌సోర్సింగ్ గెస్ట్ ఫ్యాకల్టీ జీతాలు రూ.6,000 నుంచి రూ.7,000 వరకు పెంపు, త్వరలో అధికారిక ఉత్తర్వులు వెలువడనున్నాయి.

PREV
17
గెస్ట్ ఫ్యాకల్టీకి జీతాల పెంపు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరోసారి ఉద్యోగులకు ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో పని చేస్తున్న ఔట్‌సోర్సింగ్ గెస్ట్ ఫ్యాకల్టీకి జీతాల పెంపు సంబరంగా మారింది. గతంలో అనేకవార్లు విన్నవించినా పరిష్కారం కాని సమస్య ఇప్పుడు తాజా ప్రభుత్వం ముందు పోవడంతో మంచి ఫలితం వచ్చిందని ఉద్యోగులు అభిప్రాయపడుతున్నారు.

27
1,650 మందికి పైగా గెస్ట్ లెక్చరర్లు లబ్ధి

ఇప్పటివరకు నెలకు సరాసరి రూ.18,000 నుంచి రూ.20,000 మధ్య జీతాలు తీసుకుంటున్న ఈ గెస్ట్ ఫ్యాకల్టీ సిబ్బంది త్వరలో రూ.6,000 నుంచి రూ.7,000 వరకు పెరిగిన వేతనాన్ని పొందనున్నారు. దీనివల్ల వారికే కాకుండా వారి కుటుంబాలకు ఆర్థికంగా బలపడే అవకాశముందని భావిస్తున్నారు. ఈ చర్య వల్ల సుమారు 1,650 మందికి పైగా గెస్ట్ లెక్చరర్లు లబ్ధి పొందనున్నారు.

37
సమస్యల పట్ల స్పష్టమైన దృష్టి

ఈ జీతాల పెంపు ప్రతిపాదన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి గెస్ట్ ఫ్యాకల్టీ సంఘం నేతలు, మంత్రులు లోకేష్, గుమ్మడి సంధ్యారాణి చేతికి అందించారు. వారు దీనిపై స్పందించి మంత్రిత్వ శాఖ అధికారులతో సంప్రదించి నిర్ణయం తీసుకున్నారు. గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి మాట్లాడుతూ ప్రభుత్వానికి ఉద్యోగుల సమస్యల పట్ల స్పష్టమైన దృష్టి ఉందని చెప్పారు. ఆర్థికంగా కష్టకాలం ఉన్నా సరే, ముఖ్యమైన విషయాలను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆమె తెలిపారు.

47
జూనియర్ లెక్చరర్లు, లైబ్రరియన్లు, ఫిజికల్ డైరెక్టర్లకు కూడా

ఈ పెంపు కేవలం గెస్ట్ ఫ్యాకల్టీకే కాకుండా, ఇతర గిరిజన గురుకులల్లో విధులు నిర్వహిస్తున్న పలు విభాగాల ఉద్యోగులకు కూడా వర్తించనుంది. రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీల్లో పనిచేస్తున్న జూనియర్ లెక్చరర్లు, లైబ్రరియన్లు, ఫిజికల్ డైరెక్టర్లకు కూడా రూ.18,000 నుంచి రూ.24,000 వరకు పెంపు ఉండబోతోంది. ఆర్ట్స్, క్రాఫ్ట్స్ టీచర్లు, ట్రెండ్గ్రాడ్యుయేట్ టీచర్లు (TGT), ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లు (PET) వేతనాలు కూడా అదేవిధంగా పెరగనున్నాయి.

57
ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు

ఈ జీతాల పెంపు గిరిజన సంక్షేమ శాఖ పరిధిలో ఉన్న స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్, కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో పనిచేస్తున్న సిబ్బందికి కూడా వర్తించనుంది. వీరిలో ప్రస్తుతం సుమారు 58 మంది జూనియర్ లెక్చరర్లు, ఫిజికల్ డైరెక్టర్లు పనిచేస్తున్నారు. వీరికి కూడా రూ.6,000 నుంచి రూ.7,000 వరకు వేతన పెంపు జరగనుంది. గత కొన్ని సంవత్సరాలుగా గెస్ట్ ఫ్యాకల్టీ సిబ్బంది జీతాల పెంపు కోసం పోరాడుతున్నారు. తమ సేవలు సకాలంలో అందిస్తున్నప్పటికీ, వేతనాలు మాత్రం స్థిరంగా ఉండిపోవడంతో ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారు పేర్కొన్నారు. కొంతమంది ఉద్యోగులు అయితే వేతనాల తక్కువతో వేరే ఉద్యోగాల కోసం వెతుకుతున్న స్థితికి కూడా వెళ్లారని సమాచారం. ఇప్పుడైతే కొత్త ప్రభుత్వం విన్నపాలపై స్పందించి చర్యలు తీసుకోవడం ఉద్యోగుల్లో ఆశ కలిగిస్తోంది.

67
మెయిన్ అంగన్‌వాడీలుగా

ఇదే సమయంలో మరో కీలక నిర్ణయం తీసుకుంటూ రాష్ట్రంలోని మినీ అంగన్‌వాడీ కేంద్రాలను మెయిన్ అంగన్‌వాడీలుగా మారుస్తున్నట్లు మంత్రి సంధ్యారాణి వెల్లడించారు. ఈ మార్పు వల్ల గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో మాతృశిశు సంక్షేమానికి మరింత మెరుగైన సేవలు అందుబాటులోకి రానున్నాయని చెప్పారు. మెయిన్ అంగన్‌వాడీ కేంద్రాల్లో కార్యకర్తతో పాటు సహాయకురాలు కూడా ఉండే అవకాశం ఉంటుంది. ఈ విధంగా సేవల విస్తరణతో పిల్లల ఆరోగ్య, విద్యా అంశాల్లో మెరుగుదల ఆశించవచ్చని ఆమె అభిప్రాయపడ్డారు.

77
విద్యా వ్యవస్థలో స్థిరత, నాణ్యత

జీతాల పెంపుతో పాటు ఉద్యోగ భద్రత, పదోన్నతులు, పని స్థితులలో మెరుగుదల తదితర అంశాలపైనా ప్రభుత్వం దృష్టి పెట్టాలని ఉద్యోగులు కోరుతున్నారు. గెస్ట్ ఫ్యాకల్టీకి సమానంగా జీతాలు ఇవ్వడం ద్వారా విద్యా వ్యవస్థలో స్థిరత, నాణ్యత పెరుగుతుందని వారు అభిప్రాయపడుతున్నారు. వీటన్నింటికి ప్రభుత్వం ముందడుగు వేయడం గమనార్హం.ఈ చర్యల వల్ల విద్యారంగం పైగా గిరిజన విద్యా సంస్థల్లో స్థిరత, నిబద్ధత ఏర్పడనుంది. గెస్ట్ ఫ్యాకల్టీకి వేతన పెంపుతో పాటు మరింత ప్రోత్సాహకరమైన వాతావరణం కల్పించబడితే విద్యా ప్రమాణాలు పెరిగే అవకాశం ఉంటుంది. ఇది విద్యార్థుల భవిష్యత్తుపై మంచి ప్రభావం చూపనుంది.

Read more Photos on
click me!

Recommended Stories