ఆంధ్రప్రదేశ్‌లో వాట్సప్ ద్వారా ఆస్తి పన్ను, నీటి బిల్లులు చెల్లించే అవకాశం. అక్టోబరు నుంచి అన్ని పంచాయతీల్లో అందుబాటులోకి ఈ కొత్త సౌకర్యం అందుబాటులోకి రానుంది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామీణ ప్రాంత ప్రజలకు మరింత సులభంగా, పారదర్శకంగా సేవలు అందించేందుకు 'మనమిత్ర' పేరుతో ఓ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించేందుకు సన్నద్ధమవుతోంది. ఇప్పటి వరకు పన్నులు, బిల్లులు చెల్లించేందుకు మీసేవ కేంద్రాలు, పంచాయతీ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు, వాట్సప్ యాప్ ద్వారా మొబైల్‌ఫోన్ నుంచే ఈ సేవలను పొందే వీలున్నందున, ఇది గ్రామీణ ప్రజలకు ఒక పెద్ద సౌకర్యంగా మారనుంది.
25
ఆస్తి వివరాలు, బకాయిలను
ప్రజలు తమ వాట్సప్‌లో “Hi” అనే సందేశాన్ని ‘మనమిత్ర’ నంబర్‌కు పంపితే, పన్నులు, బిల్లులు చెల్లించేందుకు అవసరమైన లింకులు వస్తాయి. అక్కడి నుంచి పాస్‌వర్డ్ లేదా ఓటీపీ ఆధారంగా లాగిన్ అయ్యి, తమ ఆస్తి వివరాలు, బకాయిలను తెలుసుకుని, డెబిట్ కార్డు లేదా యూపీఐ ద్వారా చెల్లింపు చేయవచ్చు. చెల్లింపు పూర్తయిన వెంటనే వాట్సప్‌లోనే రసీదు వస్తుంది.
35
డిజిటల్ చెల్లింపు మార్గాలను
ఇప్పటికే రాష్ట్రంలోని 13,326 పంచాయతీల్లో సుమారు రూ.822.46 కోట్ల ఆస్తి పన్నులు వసూలు చేయాల్సి ఉంది. అయితే చాలా మంది ఆస్తి యజమానులు ఇతర రాష్ట్రాల్లో నివసిస్తున్న నేపథ్యలో పన్ను చెల్లింపుల్లో జాప్యం జరుగుతోంది. ఈ సమస్యను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం డిజిటల్ చెల్లింపు మార్గాలను ప్రోత్సహిస్తోంది.
అక్టోబరు 2025 నుంచి ఈ వాట్సప్ ఆధారిత సేవలు అన్ని గ్రామ పంచాయతీల్లో అందుబాటులోకి రానున్నాయి. ఇది గ్రామీణ పాలనలో డిజిటలైజేషన్‌కు దారితీసే కీలకమైన ముందడుగుగా భావిస్తున్నారు. ఇకపై పౌరులు ఎక్కడినుండైనా తమ ఆస్తులకు సంబంధించి బిల్లులను సకాలంలో చెల్లించగలుగుతారు.
ఈ విధానం వల్ల గ్రామీణ ప్రాంతాల నుండి ప్రారంభమైన డిజిటల్ ఇండియా ప్రయోగం మరింత విస్తృత స్థాయిలో విస్తరించనుందని అధికారులు తెలిపారు.
55
ప్రభుత్వ ఆదాయం
ఈ కొత్త విధానం వలన అవినీతి అవకాశాలు తగ్గుతాయని అధికారులు విశ్వసిస్తున్నారు. డిజిటల్ లావాదేవీల ద్వారా ప్రభుత్వ ఆదాయం పెరుగుతుందనే ఆశ ఉంది. గతేడాది ప్రారంభమైన 'స్వర్ణ పంచాయతీ' పోర్టల్ ద్వారా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి చెల్లించే విధానం వల్ల ఇప్పటికే పన్నుల వసూలు స్థాయిలో మెరుగుదల కనిపించింది.