Weather : తెలుగు రాష్ట్రాలకు రెడ్ అలర్ట్ ... నేడు ఈ జిల్లాల్లో భారీ నుండి అతిభారీ వర్షాలు

Published : May 05, 2025, 07:32 AM ISTUpdated : May 05, 2025, 07:36 AM IST

ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణలో వర్షాలు దంచికొడుతున్నాయి. అసలు ఇది ఎండాకాలమా లేక వర్షాకాలమా అన్న అనుమానం వచ్చేలా వర్షాలు కురుస్తున్నాయి. మరి ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి వాతావరణం ఉంటుందంటే... 

PREV
15
Weather : తెలుగు రాష్ట్రాలకు రెడ్ అలర్ట్ ... నేడు ఈ జిల్లాల్లో భారీ నుండి అతిభారీ వర్షాలు
Weather Updates

Rain Alert : తెలుగు రాష్ట్రాల్లో ఓవైపు ఎండలు మండిపోతుంటే మరోవైపు వర్షాలు దంచికొడుతున్నాయి.  ఉదయం నుండి మధ్యాహ్నం వరకు సూర్యుడు భగ్గుమంటున్నాడు... ఉక్కపోత, వడగాలులకు ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. సాయంత్రం అయ్యిందంటే చాలు మెల్లిగా ఈదుగాలులు మొదలై వాతావరణం చల్లగా మారిపోయి చిరుజల్లుల నుండి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇలా ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఈ వేసవిలో ఎండావాన పరిస్థితులు నెలకొన్నాయి. 

 ఇవాళ (మే 5, సోమవారం) కూడా తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. అలాగే మండుటెండలు కూడా కొనసాగుతాయని తెలిపింది. ఇలా తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ లో వర్షాలు కురిసే ఏఏ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయి? ఏఏ జిల్లాల్లో అధిక ఉష్ణోగ్రతల నమోదు కానున్నాయి? ఇక్కడ తెలుసుకుందాం. 

25
Telangana Rains

తెలంగాణ వాతావరణం : 

తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశాలున్న జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఇలా మొత్తం 21 జిల్లాల్లో ఈదరుగాలులు, ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందంటూ అలర్ట్ చేసారు. ఉమ్మడి మెదక్ తో పాటు మహబూబ్ నగర్, కామారెడ్డి జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయి.  

రాజన్న సిరిసిల్ల, కరీంనగర్,  పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి,సూర్యాపేట, నల్గొండ, మహబూబ్ నగర్, ములుగు, భద్రాద్రి, ఖమ్మం, వరంగల్, సిద్దిపేట, జనగాం, హన్మకొండ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసారు. ఈ జిల్లాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.

35
Andhra Pradesh Weather

ఆంధ్ర ప్రదేశ్ వాతావరణం :  

ఆంధ్ర ప్రదేశ్ లో కూడా ఇవాళ(సోమవారం) పగలు ఎండ, రాత్రికి వాన పరిస్థితి ఉంటుందని వాతావరణ విభాగం తెలిపింది. చాలా జిల్లాల్లో ఈదురుగాలులు, ఉరుములతో కూడిన తెలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు. ఇదే సమయంలో పగటిపూట ఎండలు మండిపోతాయని...  41 నుండి 43 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హెచ్చరించారు. 

ఏపీలో పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీచేసింది వాతావరణ శాఖ. ప్రకాశం,   కృష్ణా, బాపట్ల,  నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. అలాగే గంటకు 60 నుండి 80 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశాలున్నాయట... అందుకే ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసారు. ఇక అల్లూరి సీతారామరాజు, విజయనగరం, అనకాపల్లి జిల్లాలో మోస్తరు వర్షాలు,  కాకినాడ, విశాక, కొనసీమ ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు.
 

45
Andhra Pradesh Rains

ఏపీలో భారీ వర్షాలు : 

ఆంధ్ర ప్రదేశ్ లో ఆదివారం భారీ వర్షాలు కురిసాయి. అత్యధికంగా కాకినాడ జిల్లా కాజులూరులో 100 మి.మీ, చొల్లంగిపేటలో 94 మి.మీ, కాకినాడలో 66 మి.మీ వర్షపాతం నమోదయ్యింది. ఇక అకాల వర్షానికి విజయవాడ నగరం అతలాకుతలం అయ్యింది.   తిరుపతిలో కూడా ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం భీభత్సం సృష్టించింది. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం, ఏలూరు, కోనసీమ జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురిసాయి. 
 

55
Andhra Pradesh Weather

పిడుగుపాట్లకు ఎనిమిదిమంది మృతి

ఏపీలో కురిసిన భారీ వర్షాలు ఎనిమందిని పొట్టనపెట్టుకున్నాయి. బలమైన ఈదురుగాలులు, పిడుగుపాట్లకు పలు జిల్లాలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఇలా తిరుపతిలో ముగ్గురు, ప్రకాశం, బాపట్ల,కృష్ణా జిల్లాల్లో పిడగుపాటుతో మరణించారు. ఇక ఏలూరు జిల్లాల్లో ఒకరు పిడుగుపాటుకు, మరొకరు చెట్టుకూలిన ఘటనలో మరణించారు. 
 
బాపట్ల జిల్లాలో భారీ వర్షానికి ఈదురుగాలులు, పిడుగులు తోడయ్యాయి. దీంతో వేరువేరు ప్రమాదాల్లో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు... మృతులు సుప్రదీప్‌(23), గడ్డం బ్రహ్మయ్య(50). ఇలా ఎండాకాలంలో కురుస్తున్న వర్షాలు ప్రాణాలు బలితీసుకుంటున్నాయి. 

Read more Photos on
click me!

Recommended Stories