AP EAPCET 2025 results: ఆంధ్రప్రదేశ్ ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (AP EAMCET/EAPCET) 2025 ఫలితాలను రాష్ట్ర ఉన్నత విద్యామండలి (APSCHE) ఆదివారం విడుదల చేసింది.
ఫలితాలను సెట్ కన్వీనర్ వీవీ సుబ్బారావు ప్రకటించారు. జేఎన్టీయూకే బీసీ కాన్ఫరెన్స్ హాల్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో సెట్ చైర్మన్, జేఎన్టీయూకే వైస్ ఛాన్సలర్ సీఎస్ఆర్కే ప్రసాద్ లు పాల్గొన్నారు.
ఈసారి మొత్తం 3,62,429 మంది విద్యార్థులు పరీక్షకు నమోదు చేసుకోగా, అందులో 3,40,300 మంది హాజరయ్యారు. మొత్తం 2,57,509 మంది అర్హత సాధించగా, మొత్తం ఉత్తీర్ణత శాతం 75.67% గా ఉంది.