పాడిరైతులకు అండగా... భారీగా పశువుల అంబులెన్స్ లు ప్రారంభించిన సీఎం జగన్

Arun Kumar P   | Asianet News
Published : May 19, 2022, 01:45 PM IST

పాడిరైతులకు అండగా ఏపీ సర్కార్ కీలక చర్యలు చేపట్టింది. పశువైద్యం కోసం ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన అంబులెన్స్ లను ముఖ్యమంత్రి జగన్ జెండా ఊపి ప్రారంభించారు.

PREV
15
పాడిరైతులకు అండగా... భారీగా పశువుల అంబులెన్స్ లు ప్రారంభించిన సీఎం జగన్
YSR Mobile Veterinary Ambulance

 అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ లో ఎస్సార్‌ సంచార పశు ఆరోగ్య సేవలు ప్రారంభమయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా పశుపోషణను మరింత పెంచేందుకు జగన్ సర్కార్ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే పశువుల చికిత్స కోసం అంబులెన్స్ లను సిద్దం చేసింది. వీటిని ఇవాళ (గురువారం) ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. 

25
YSR Mobile Veterinary Ambulance

రాష్ట్రవ్యాప్తంగా దాదాపు రూ.278 కోట్ల వ్యయంతో మొత్తం 340 పశువుల ఆంబులెన్స్‌ సేవలను అందుబాటులోకి తీసుకురావాలని జగన్ సర్కార్ నిర్ణయించింది. ఈ క్రమంలోనే మొదటి విడతలో రూ.143 కోట్ల వ్యయంతో 175 పశువుల అంబులెన్స్‌లు సిద్దమయ్యాయి. వీటిని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం వద్ద జెండా ఊపి ప్రారంభించారు సీఎం జగన్‌.

35
YSR Mobile Veterinary Ambulance

పశుపోషణకు ఊతమిస్తూ పాడిరైతుల ఇంటిముంగిటే మూగజీవాలకు మెరుగైన వైద్యసేవలందించే లక్ష్యంతో ఈ అంబులెన్స్ సేవలను అందుబాటులోకి తెచ్చినట్లు వైసిపి ప్రభుత్వం తెలిపింది.  పాడిరైతులు మూగజీవాలకు ఏదయినా ఆరోగ్యసమస్య వస్తే టోల్‌ ఫ్రీ నంబరు 1962కు ఫోన్‌చేయాలని... వెంటనే అంబులెన్స్ అక్కడికి చేరుకుని పశువైద్యులు చికిత్స అందిస్తారని ప్రభుత్వం తెలిపింది. అవసరమైతే పశువులను దగ్గర్లోని పశువైద్యశాలకు తరలించేలా అంబులెన్స్ లో ఏర్పాట్లు చేసినట్లు అధికారులు వెల్లడించారు

45
YSR Mobile Veterinary Ambulance

పశువులు అంబులెన్స్ ప్రారంభానికి ముందు వాటిని సీఎం జగన్ పరిశీలించారు. అందులో పశువైద్యం కోసం ఏర్పాటుచేసిన సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు. అలాగే పశువులకు అందించే మందుల గురించి కూడా అంబులెన్స్ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం వేదికపైకి చేరుకున్న సీఎం జగన్ జెండా ఊపి పశువైద్య అంబులెన్స్ లను లాంచనంగా ప్రారంభించారు. 

55
YSR Mobile Veterinary Ambulance

ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి (పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ) బూడి ముత్యాలనాయుడు, రెవెన్యూశాఖమంత్రి ధర్మాన ప్రసాదరావు, పశుసంవర్ధక, మత్య్సశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు, బీసీ సంక్షేమం, ఐ అండ్‌ పీఆర్‌ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, పశుసంవర్ధశాఖ స్పెషల్‌ సీఎస్‌ పూనం మాలకొండయ్య, పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 


 

click me!

Recommended Stories