ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో మ‌రో సిలికాన్ వ్యాలీ.. ఈ ప్రాంతాలకు మ‌హ‌ర్ధ‌శ‌. శంకుస్థాప‌న‌కు స‌ర్వం సిద్ధం

Published : Apr 27, 2026, 01:07 PM IST

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో టెక్నాలజీ రంగంలో భారీ మార్పులకు దారి తీసే కీలక అడుగు పడుతోంది. గూగుల్ సంస్థ విశాఖ జిల్లాలో ప్రపంచ స్థాయి ఏఐ డేటా సెంటర్ ఏర్పాటు చేయ‌నుంది. ఇందుకు సంబంధించి ఏప్రిల్ 28న శంకుస్థాప‌న జ‌ర‌గ‌నుంది. 

PREV
15
దేశ చరిత్రలోనే కీలక ప్రాజెక్ట్

ఈ ప్రాజెక్ట్ మొత్తం సుమారు 15 బిలియన్ డాలర్ల పెట్టుబడితో రూపొందుతోంది. ఇది భారతదేశంలోనే అత్యంత పెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో ఒకటిగా నిలవనుంది. 1 గిగా వాట్ సామర్థ్యంతో ఏర్పడే ఈ డేటా సెంటర్ భారీ స్థాయిలో డేటా ప్రాసెసింగ్, స్టోరేజ్, AI క్లౌడ్ సేవలను అందించనుంది. ప్రత్యేకంగా సముద్రానికి సమీపంలో ఉన్న విశాఖ ప్రాంతం సబ్‌మెరైన్ కేబుల్ కనెక్టివిటీకి అనుకూలం కావడం ఈ ప్రాజెక్ట్‌కు ప్రధాన బలం. దీని వల్ల ప్రపంచ దేశాలతో నేరుగా డిజిటల్ కనెక్టివిటీ ఏర్పడే అవకాశం ఉంది.

25
పోర్ట్ సిటీ నుంచి డేటా సిటీగా మారుతున్న విశాఖ

ఇప్పటి వరకు పోర్ట్, స్టీల్ ప్లాంట్, షిప్‌యార్డ్‌లకు పేరుగాంచిన విశాఖపట్నం ఇప్పుడు డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కేంద్రంగా మారబోతోంది. తర్లువాడ, అడవి వరం, రాంబిల్లి ప్రాంతాల్లో సుమారు 600 ఎకరాల్లో ఈ ప్రాజెక్ట్ రూపుదిద్దుకోనుంది. ఈ ప్రాజెక్ట్‌లో AdaniConneX, Airtel Nxtra లాంటివి భాగస్వాములుగా ఉండటం విశాఖను మల్టీ-గిగావాట్ డేటా హబ్‌గా అభివృద్ధి చేయాలన్న ప్రణాళికకు బలం ఇస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం భవిష్యత్‌లో 6.5 గిగా వాట్ల సామర్థ్యంతో డిజిటల్ క్లస్టర్ నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

35
భారీగా ఉద్యోగాలు

ఈ డేటా సెంటర్ వల్ల కేవలం టెక్నాలజీ మాత్రమే కాదు, ఉపాధి రంగంలో కూడా పెద్ద మార్పు వస్తుంది. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంజినీర్లు, క్లౌడ్ ఆర్కిటెక్ట్స్, డేటా సైంటిస్టులు, సైబర్ సెక్యూరిటీ నిపుణులు, నెట్‌వర్క్ ఇంజినీర్లు, సర్వర్ మేనేజ్‌మెంట్ టీమ్స్, మెయింటెనెన్స్ & టెక్నికల్ సపోర్ట్ వంటి ఉద్యోగాలు రానున్నాయి. దీంతో పాటు కాంట్రాక్ట్ వర్క్స్, సెక్యూరిటీ, ఫెసిలిటీ మేనేజ్‌మెంట్ వంటి అనుబంధ రంగాల్లో కూడా వేలాది ఉద్యోగాలు రానున్నాయి.

45
రియల్ ఎస్టేట్ బూమ్

ఈ ప్రాజెక్ట్ ప్రభావం రియల్ ఎస్టేట్ రంగంలో స్పష్టంగా కనిపించనుంది. ముఖ్యంగా తర్లువాడ, భీమిలి, రాంబిల్లి, ఆనందపురం ప్రాంతాల్లో భూముల ధరలు వేగంగా పెరిగే అవకాశముంది. టెక్ కంపెనీలు కార్యాలయాల కోసం స్థలాలు కొనుగోలు చేయ‌డం, ఉద్యోగులు నివాసాల కోసం డిమాండ్ పెర‌గ‌డం, అంతర్జాతీయ ప్రమాణాల ఇన్‌ఫ్రా ఏర్ప‌డ‌డం వంటివి దీనికి కార‌ణాలు చెప్పొచ్చు దీని ఫలితంగా గేటెడ్ కమ్యూనిటీలు, హై-రైజ్ అపార్ట్‌మెంట్లు, కమర్షియల్ స్పేస్‌లకు డిమాండ్ గణనీయంగా పెరుగుతుంది.

55
టెక్ హబ్ దిశగా అడుగు

AI, క్లౌడ్, డేటా సర్వీసులు ఒకే చోట అందుబాటులో ఉండటం వల్ల విశాఖ ఆసియా స్థాయిలో కీలక టెక్ కేంద్రంగా మారే అవకాశం ఉంది. స్టార్టప్స్, రీసెర్చ్ సెంటర్లు, సెమీకండక్టర్ సంస్థలు ఇక్కడికి రావడానికి ఆసక్తి చూపే పరిస్థితి ఏర్పడుతుంది. భవిష్యత్తులో అంతర్జాతీయ విమానాశ్రయం అభివృద్ధి, డిజిటల్ కనెక్టివిటీ విస్తరణ, టెక్ కంపెనీల క్లస్టర్ లాంటివి వేగంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది.

మొత్తం మ‌దీ గూగుల్ ఏఐ సెంటర్ కేవలం ఒక ప్రాజెక్ట్ మాత్రమే కాదు, విశాఖపట్నం భవిష్యత్తును పూర్తిగా మార్చే మైలురాయి. పోర్ట్ సిటీగా పేరుగాంచిన నగరం ఇప్పుడు డేటా సిటీగా మారబోతోంది. టెక్నాలజీ, ఉపాధి, రియల్ ఎస్టేట్, అంతర్జాతీయ గుర్తింపు అన్ని కోణాల్లో విశాఖకు ఇది గేమ్ ఛేంజర్‌గా మారనుంది.

Read more Photos on
click me!

Recommended Stories