బాలిక ఇంటి సమీపంలో నివసిస్తున్న కులవర్ధన్ అనే వ్యక్తిపై పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. అతడు ఘటన అనంతరం కనిపించకుండా పోవడంతో గాలింపు చర్యలు ప్రారంభించారు. దర్యాప్తులో బాలికను మాయమాటలతో ఇంట్లోకి తీసుకెళ్లి దారుణానికి పాల్పడ్డట్లు అధికారులు భావించారు. పోస్టుమార్టం రిపోర్ట్ లో సైతం లైంగిక దాడి జరిగినట్లు స్పష్టమైనట్లు సమాచారం.
చెరువులో నిందితుడి మృతదేహం
గాలింపు జరుగుతుండగానే కరంబలకోట మండలం కనసానివారిపల్లె చెరువులో ఓ మృతదేహం కనిపించినట్లు స్థానికులు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించగా అది కులవర్ధన్ మృతదేహమేనని గుర్తించారు. శరీరం ఉబ్బిపోయి ఉండటంతో దాదాపు పది గంటల ముందు మరణించినట్లు అనుమానిస్తున్నారు. ఆత్మహత్య చేసుకున్నాడా? లేక ప్రమాదవశాత్తూ చెరువులో పడ్డాడా? అనే కోణాల్లో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.
కొనసాగుతోన్న విచారణ
ఇదిలా ఉంటే నిందితుడి మృతికి సంబంధించిన ఖచ్చితమైన కారణం ఏమిటి అనే దానిపై ఫోరెన్సిక్ రిపోర్ట్ కోసం ఎదురుచూస్తున్నారు. అటు బాలిక అంత్యక్రియలు స్వగ్రామంలో నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేశారు. ఈ ఘటన జిల్లాలో భయాందోళనలకు దారితీసింది.