ఏపీలో ఈ ప్రాంత రూపురేఖ‌లు మార‌డం ఖాయం.. రూ. 1201 కోట్లతో భారీ సంస్థకు శంకుస్థాప‌న

Published : Nov 15, 2025, 02:01 PM IST

Andhra pradesh: ఏపీ ప్ర‌భుత్వం ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్వ‌హిస్తున్న 30వ సీఐఐ భాగ‌స్వామ్య స‌ద‌స్సు రెండో రోజు కొనసాగుతోంది. ఈ సంద‌ర్భంగా రాష్ట్రానికి మ‌రో భారీ పెట్టుబ‌డి వ‌చ్చింది. రేమాండ్స్ రూ. 1201 కోట్ల పెట్టుబ‌డి పెట్టనుంది.  

PREV
15
సీఐఐ సదస్సు వేదికగా..

విశాఖపట్నంలో జరుగుతున్న 30వ సీఐఐ భాగస్వామ్య సదస్సు రెండో రోజు ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడుల ప్రవాహం కొనసాగింది. ఈ సందర్భంగా సీఎం నారా చంద్రబాబు నాయుడు వర్చువల్‌గా రేమాండ్ సంస్థ ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు. అనంతపురం జిల్లాలో ఏర్పాటు చేస్తున్న‌ ఈ యూనిట్ల కోసం మొత్తం రూ.1201 కోట్ల పెట్టుబడులు పెట్ట‌నున్నారు. ఈ ప్రాజెక్టులు ప్రారంభస్థాయిలో నుంచే సుమారు 6,500 మందికి ప్రత్యక్ష ఉపాధి అందించనున్నాయి.

25
మొత్తం మూడు ప‌రిశ్ర‌మ‌లు

రేమాండ్ గ్రూప్ రాష్ట్రానికి తీసుకొస్తున్న ప్రాజెక్టుల్లో సిల్వర్ స్పార్క్ అప్పారెల్ పార్క్, ఆటో కాంపోనెంట్ ప్లాంట్, ఏరోస్పేస్ పరికరాల యూనిట్ ఉన్నాయి. అనంతపురం జిల్లా రాప్తాడులో రూ.497 కోట్లతో సిల్వర్ స్పార్క్ అప్పారెల్ తయారీ కేంద్రం, గుడిపల్లిలో రూ.441 కోట్లతో ఆటో కాంపోనెంట్ తయారీ యూనిట్, టెకులోదులో రూ.262 కోట్లతో ఏరోస్పేస్ పరికరాల ప్రొడక్షన్ యూనిట్ ఏర్పాటు చేయ‌నున్నారు. ఈ మూడు ప్రాజెక్టులు పూర్తిస్థాయి ఉత్పత్తి దశలోకి వ‌స్తే వేలాది మందికి ఉపాధి ల‌భించ‌నుంది.

35
ప్ర‌ముఖులు హాజ‌రు

ఈ కార్యక్రమంలో రేమాండ్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ గౌతమ్ మైనీ, కార్పొరేట్ డెవలప్‌మెంట్ హెడ్ జతిన్ ఖన్నా పాల్గొన్నారు. రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ.. పెట్టుబడిదారులకు రాష్ట్రం అందిస్తున్న వాతావరణాన్ని వివరించారు. పరిశ్రమల విస్తరణకు జిల్లాలో తగిన సదుపాయాలు ఉన్నాయని, ప్రభుత్వం తక్షణ సహకారం అందిస్తుందని చెప్పుకొచ్చారు.

45
పెట్టుబడుల ప్రవాహం

రేమాండ్‌తో పాటు పలు జాతీయ, అంతర్జాతీయ సంస్థలు ఈ సదస్సులో పాల్గొన్నాయి. ఎల్జీ కెమ్, అట్మాస్పియర్ కోర్, ఇఫ్కో, కార్డెలియా క్రూయిజెస్, సుమిటోమో మిత్సుయ్ బ్యాంకింగ్ కార్పొరేషన్ ప్రతినిధులతో సీఎం సమావేశాలు నిర్వహించనున్నారు. అదనంగా న్యూజిలాండ్, జపాన్, మెక్సికో దేశాల ప్రతినిధులతో చర్చలు జరపాలని ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. రాష్ట్రంలో పెట్టుబడులకు అనువైన అవకాశాలు పెరుగుతున్నాయని ఈ సదస్సు మొదటి రెండు రోజుల్లోనే స్పష్టమైంది.

55
భారీగా ఉద్యోగ‌వ‌కాశాలు

రేమాండ్ ప్రాజెక్టులు జిల్లా యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవ‌కాశాలు క‌ల్పించ‌నున్నాయి. దుస్తుల తయారీ నుంచి ఏరోస్పేస్ పరికరాల నిర్మాణం వరకూ విభిన్న రంగాల్లో ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. 6,500 మందికి ప్రత్యక్ష ఉపాధి ఏర్పడటం వల్ల స్థానిక ఆర్థిక వ్యవస్థకు బ‌లం చేకూర్చ‌నుంద‌ని ప‌లువురు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories