టిటిడిలో పనిచేస్తూ మతంమారిన ఉద్యోగుల ఫుల్ డిటెయిల్స్ ... ఇంతమంది ఉన్నారా!

Published : Feb 06, 2025, 04:00 PM ISTUpdated : Feb 06, 2025, 04:21 PM IST

Non Hindu Employees in TTD : కూటమి ప్రభుత్వం వెంకటేశ్వర స్వామి భక్తుల కోరికమేరకు తిరుమల పవిత్రతను కాపాడేందుకు కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా అన్యమత ఉద్యోగులపై టిటిడి యాక్షన్ స్టార్ట్ చేసింది. టిటిడి ఎంతమంది అన్యమతస్తులను గుర్తించిందో తెలుసా?  

PREV
13
టిటిడిలో పనిచేస్తూ మతంమారిన ఉద్యోగుల ఫుల్ డిటెయిల్స్ ... ఇంతమంది ఉన్నారా!
Non Hindu Employees in TTD

Tirumala Tirupati Devasthanam : తిరుమల వెంకటేశ్వరస్వామి దేశంలోని కోట్లాదిమంది హిందువుల ఆరాధ్యదైవం. కలియుగ ప్రత్యక్షదైవంగా విశ్వసించే శ్రీవారు కొలువైన తిరుమల ఏడుకొండలను చాలా పవిత్రంగా భావిస్తుంటారు... ఆ దేవదేవుడికి ఎలాంటి అపచారం లేకుండా సేవలు జరగాలని కోరుకుంటారు. ముఖ్యంగా హిందూ మతవిశ్వాసాలను దెబ్బతీసే పనులు స్వామివారి సన్నిధిలో జరగకూడదనేది భక్తుల కోరుకుంటారు. తిరుమల ఆచారవ్యవహారాలు, నిబంధనలు కూడా ఇందుకు తగ్గట్లే వున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి వీటిని అమలుచేస్తుంది. 

తిరుమలలో హిందూ ఆచారవ్యవహారాలకు తూచ తప్పకుండా పాటించాలి... కేవలం ఈ మతానికి చెందినవారికే స్వామివారి దర్శనానికి అనుమతి ఉంటుంది. ఇతర మతస్తులు వెంకటేశ్వర స్వామిపై భక్తితో దర్శనం చేసుకోవాలన్నా టిటిడి అనుమతి తీసకోవాల్సిందే. ఇలా కేవలం ఒక్కసారి స్వామిని దర్శించుకునేవారికే ఇన్ని నిబంధనలుంటే నిత్యం శ్రీవారి సేవలోనే వుండే టిటిడి అధికారులకు ఇంకెన్ని నిబంధనలు వుండాలి.

అయితే గత పాలకులు ఇతర మతాలవారిని టిటిడి ఉద్యోగాల్లో చేర్చుకోవద్దనే నిబంధన మరిచారో లేక కావాలనే చేర్చుకున్నారో తెలీదు... కానీ ప్రస్తుతం టిటిడిలో అన్యమతస్తులు పనిచేస్తున్నారు. ఇలా హిందూయేతర టిటిడి అధికారులు తాజా పాలకమండలి గుర్తించింది... వీరిపై చర్యలు కూడా ప్రారంభించింది. 1989 ఎండోమెంట్ యాక్ట్ 1060 ప్రకారం హిందూ మతాచారాలను పాటించకుండా ఇతర మతాల్లో కొనసాగుతూ టిటిడిలో విధులు నిర్వర్తిస్తున్న 18 మంది ఉద్యోగులపై చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఆ ఉద్యోగుల వివరాలను టిటిడి ఛైర్మన్ బిఆర్ నాయుడు బైటపెట్టారు. 
 

23
Non Hindu Employees in TTD

టిటిడి నుండే ప్రక్షాళన :

ఆంధ్ర ప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఏర్పడగానే మొదట తిరుమలపైనే దృష్టిపెట్టింది. స్వయంగా సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ లు తిరుమల పవిత్రతను కాపాడేలా ఇకపై ఏర్పాట్లు వుంటాయని స్పష్టం చేసారు. గత ప్రభుత్వం మాదిరిగా ఇకపై తిరుమలను రాజకీయాల కోసం వాడుకోవడం వుండదన్నారు.  శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఆద్యాత్మిక అనుభూతిని అందిస్తామని హామీ ఇచ్చారు. 

అన్నట్లుగానే తిరుమల తిరుపతి బోర్డ్ ను ప్రక్షాళన చేసింది కూటమి ప్రభుత్వం. రాజకీయాలతో సంబంధంలేని ప్రముఖ వ్యాపారవేత్త బిఆర్ నాయుడును టిటిడి ఛైర్మన్ గా నియమించారు. టిటిడి బోర్డ్ సభ్యులుగా కూడా ఆద్యాత్మికతపై అవగాహన ఉన్నవారికే అవకాశం ఇచ్చారు. ఇలా ప్రభుత్వం తిరుమల పవిత్రతను కాపాడే బాధ్యత ఈ బోర్డ్ పై ఉంచింది. 

టిటిడి బోర్డ్ కూడా ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటోంది.  ఇందులో భాగంగా నవంబర్ 18, 2024 లో జరిగిన టీటీడీ పాలకమండలి సమావేశంలో అన్యమతస్తులపై చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. ఎండోమెంట్ యాక్ట్ 1060, 1989 ప్రకారం హిందూమత సంప్రదాయాన్ని అనుసరిస్తామని ప్రమాణం చేసి టీటీడీలో ఉద్యోగం పొంది నేడు అన్యమతంలో కొనసాగుతున్నవారిని గుర్తించారు. భక్తుల మనోభావాలను, తిరుమల పవిత్రతను దెబ్బతీస్తున్న వారిపై చర్యలు తీసుకుంటున్నట్లు టిటిడి ప్రకటించింది.

ఇప్పటికే గుర్తించిన అన్యమత ఉద్యోగులను టిటిడికి సంబంధించిన ఏ ఉత్సవాల్లోనూ పాల్గొనకుండా చూడాలని ఆదేశాలు జారీ చేసారు. ఈ 18 మంది అన్యమత ఉద్యోగుల్లో ఎవరైనా తిరుమల, టీటీడీ అనుబంధ ఆలయాల్లో, ఆలయ అనుబంధ విభాగాల్లో పనిచేస్తున్నట్లయితే వెంటనే బదిలి చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 

ఇకపై అన్యమతస్తులుగా గుర్తించిన ఉద్యోగులను టీటీడీ ఆలయాల్లో జరిగే ఉత్సవాలు, ఊరేగింపులు ఇతర హిందూ కార్యక్రమాల విధులకు నియమించకూడదని అదేశించారు. ఈ అన్యమత ఉద్యోగులను ఇతర ప్రభుత్వ శాఖలకు బదిలీ చేయాలి లేదంటే వారికి విఆర్ఎస్ ఇచ్చి టిటిడి నుండి బయటకు పంపాలని తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు తీర్మానించింది. దీని ప్రకారమే తాజాగా ఉద్యోగుల వివరాలతో కూడిన ఉత్తర్వులను జారీచేసింది టిటిడి. 
 

33

టిటిడిలో పనిచేస్తున్న అన్యమత ఉద్యోగులు వీరే : 

1. కె. సుజాత - శ్రీ పద్మావతి కాలేజీలో లెక్చరర్ 

2. కె. ప్రతాప్ - శ్రీ గోవిందరాజస్వామి ఆర్ట్స్ కాలేజ్ లెక్చరర్

3. జి. అసున్త - శ్రీ పద్మావతి పాలిటెక్నిక్ కాలేజ్ ప్రిన్సిపల్ 

4. కె. మనేక్షవ్ దయాన్ -ఎస్వి ఆర్ట్ కాలేజ్ కాంట్రాక్ట్ లెక్చరర్

5. ఎన్సి భీమన్న ‌- ఎస్వీ ఆర్ట్స్ కాలేజ్ కాంట్రాక్ట్ హాస్టల్ వర్కర్ 

6. విబి.  కోమలా దేవి - డైరెక్టర్ (ఎస్విఈటిఎ)

7. ఎ. ఆనందరాజు - టిటిడి వెల్ఫేర్ డిపార్ట్ మెంట్  (DyEO Welfare)

8. ఎ. రాజశేఖర్ బాబు - జిఎం (ఆక్షన్) AEO

9. ఎం. శేఖర్ - DE (Elec) లో హెల్పర్ 

10. ఎ. సౌభాగ్యం - BIRRD(T) హాస్పిటల్లో స్టాఫ్ నర్స్ 

11. టి. నారాయణస్వామి - ఎస్వీ పూర్ హౌస్ లో MNO 

12. జి. ఆశీర్వాదం - సీఈ ఆఫీస్ లో అసిస్టెంట్ టెక్నికల్ ఆఫీసర్ (ఎలక్ట్రికల్) 

13. టి. కల్యాణి  - BIRRD(T) హాస్పిటల్ హెడ్ నర్స్ 

14. జి. గోపి - టిటిడి సెంట్రల్ హాస్పిటల్ రేడియోగ్రాఫర్ 

15. ఎస్. రోజి - BIRRD(T) హాస్పిటల్ నర్స్ 

16. రేణు దీక్షిత్ - ఎస్వి ఆయుర్వేదిక్ కాలేజ్ ప్రిన్సిపల్ 

17. డా. కేవి విజయభాస్కర్ రెడ్డి - ఎస్వి ఆయుర్వేదిక్ కాలేజ్ ప్రొఫెసర్ 
 

click me!

Recommended Stories