Published : Sep 19, 2025, 05:07 PM ISTUpdated : Sep 19, 2025, 05:18 PM IST
Dussehra Holidays : అనుకున్నదే జరిగింది… ఆంధ్ర ప్రదేశ్ లో దసరా సెలవులు మరో మూడ్రోజులు పెరిగాయి. మరి ఇప్పుడు దసరా సెలవులు ఎప్పట్నుంచి ఎప్పటివరకో తెలుసా?
Dussehra Holidays : ఆంధ్ర ప్రదేశ్ విద్యార్థులు ఎగిరిగంతేసే ప్రకటన చేసింది కూటమి ప్రభుత్వం. ఇప్పటికే దసరా సెలవులను 9 రోజులు ఇవ్వనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే... కానీ వాటిని మరో రెండ్రోజులు పెంచింది. అంతేకాదు ఈ పెంచిన సెలవులకు ఇంకో ఆదివారం అదనంగా యాడ్ అయ్యింది. దీంతో మొత్తంగా దసరా సెలవులు 9 నుండి 12 రోజులకు పెరిగాయి. ఇలా దసరా సెలవుల పెంపుపై ఏపీ విద్యాశాఖమంత్రి నారా లోకేష్ సోషల్ మీడియా వేదికన కీలక ప్రకటన చేశారు.
25
ఏపీలో పెరిగిన దసరా సెలవులు
ఇప్పటికే ప్రకటించినట్లు ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లకు దసరా సెలవులు సెప్టెంబర్ 24 నుండి కాకుండా ముందుగానే ప్రారంభం అవుతాయని విద్యాశాఖమంత్రి వెల్లడించారు. విద్యార్థుల తల్లిదండ్రులే కాదు ఉపాధ్యాయులు కూడా దసరా సెలవులు పెంచాలని కోరుతున్నట్లు తనకు సమాచారం అందిందన్నారు లోకేష్. పాఠశాలలకు దసరా సెలవులు ఈ నెల 22 నుండి ఇవ్వాలని ఉపాధ్యాయులు కోరుతున్నారని టీడీపీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు తన దృష్టికి తీసుకొచ్చారని లోకేష్ తెలిపారు. వారి కోరిక మేరకు విద్యా శాఖ అధికారులతో చర్చించి సెలవుల పొడిగింపుపై నిర్ణయం తీసుకున్నట్లు లోకేష్ వెల్లడించారు.
35
ఏపీలో కూడా సెప్టెంబర్ 20 నుండే దసరా సెలవులు
సెప్టెంబర్ 22 నుండి అక్టోబర్ 2 వరకు ఏపీలోని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లకు దసరా సెలవులు ఇవ్వాలని నిర్ణయించినట్లు లోకేష్ వెల్లడించారు. అంటే తెలంగాణలో మాదిరిగానే ఏపీలో కూడా రేపు(శనివారం) ఒక్కరోజే స్కూళ్లు నడిచేంది... సెప్టెంబర్ 21 ఆదివారం నుండి సెలవులు ప్రారంభం అవుతాయి. తెలంగాణలో దసరా తర్వాతిరోజు అక్టోబర్ 3 వరకు సెలవులుంటే ఏపీలో మాత్రం దసరా వరకే సెలవులు కొనసాగుతాయి... తర్వాతిరోజు అంటే అక్టోబర్ 3న స్కూళ్లు తిరిగి ప్రారంభం అవుతాయి.
తెలంగాణలో మరీముఖ్యంగా హైదరాబాద్ లో కార్పోరేట్, ఐటీ ఉద్యోగుల పిల్లలు చదివే ప్రైవేట్ స్కూళ్ళకి ప్రతి శని, ఆదివారం సెలవు ఉంటుంది. తల్లిదండ్రులకు వీకెండ్ లో రెండ్రోజులు సెలవు ఉంటుంది కాబట్టి వారితో గడిపేందుకు పిల్లలకు కూడా సెలవులు ఇస్తుంటారు. ఇలా వీకెండ్ లో రెండ్రోజులు సెలవులిచ్చే స్కూళ్లు హైదరాబాద్ లో చాలా ఉన్నాయి. అలాంటి విద్యాసంస్థల్లో చదివే స్టూడెంట్స్ కి దసరా సెలవులు ఓరోజు ముందుగానే అంటే సెప్టెంబర్ 20 నుండే ప్రారంభం అవుతాయి.
ఇక మరికొన్ని ప్రైవేట్ స్కూళ్లలో ఇవాళ్టితో (సెప్టెంబర్ 19) పరీక్షలు ముగుస్తున్నాయి. కాబట్టి రేపు చివరి వర్కింగ్ డే కాబట్టి దసరా, బతుకమ్మ వేడుకల నిర్వహించేందుకు ప్లాన్ చేశాయి. అంటే ఈ స్కూల్ విద్యార్థులకు కొద్దిసేపు దసరా వేడుకల తర్వాత ఇంటికి పంపిస్తారు. ఎలాంటి క్లాసులు, పరీక్షలు ఉండవు... కాబట్టి ఓ రకంగా ఇది సెలవు అనే చెప్పాలి. ఇలా సెప్టెంబర్ 20 శనివారం చాలా విద్యాసంస్థల్లో దసరా సెలబ్రేషన్స్ ఉన్నాయి.
ఇలా దసరా పండగ సెలవులు ప్రారంభం అవుతుండటంతో హైదరాబాద్ లో చదివే ఏపీ విద్యార్థులు, పేరెంట్ప్ ఆదివారం నుండే స్వస్థలాలకు తరలివెళ్లనున్నారు. ఇప్పుడు ఏపీలో కూడా ముందుగానే సెలవులు వస్తుండటంతో విజయవాడ, విశాఖపట్నం వంటి నగరాలతో పాటు ఇతర పట్టణాల్లో రద్దీ పెరగనుంది. హైదరాబాద్ నుండి వచ్చినవారితో పాటు ఈ నగరాల నుండి సొంతూళ్లకు వెళ్లేవారితో ప్రభుత్వ, ప్రైవేట్ రవాణా వ్యవస్థలు రద్దీగా మారనున్నాయి.
సిలబస్ కాలేదనో, మంచి ర్యాంకులు సాధించేలా విద్యార్థులను రెడీ చేస్తామని చెబుతూ కొన్ని విద్యాసంస్థలు సెలవుల్లో క్లాసులు, స్టడీ అవర్స్ నిర్వహిస్తుంటారు. ఇలా దసరా సెలవుల్లో క్లాసులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని విద్యాశాఖ హెచ్చరిస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ స్కూల్స్ అయితే సెప్టెంబర్ 21 నుండి అక్టోబర్ 3 వరకు.. జూనియర్ కాలేజీలు అయితే సెప్టెంబర్ 28 నుండి అక్టోబర్ 5 వరకు సెలవులు ఇవ్వాల్సిందేనని... విద్యార్థులకు క్లాసులకు రావాలని ఒత్తిడి చేయరాదని ప్రభుత్వం సూచిస్తోంది. కావాలంటే విద్యార్థులకు సెలవుల్లో చదువునేందుకు హోంవర్క్ ఇవ్వాలని సూచిస్తోంది.