Andhra pradesh: అక్వాన్ తుఫాన్‌తో ఏపీకి భారీ ముప్పు.. ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు

Published : Nov 20, 2026, 06:48 AM IST

Andhra pradesh: అక్వాన్ తుఫాన్ ఒడిశాలోని గోపాల్‌పూర్ సమీపంలో ఈరోజు మధ్యాహ్నం తీరం దాటే అవకాశం ఉంది. దీని ప్రభావంతో శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లాల్లో భారీ వర్షాలు, గంటకు 100 కి.మీ. వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది.

PREV
15
ఒడిశా వైపు అక్వాన్ తుఫాన్ పయనం

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర తుఫాన్ అక్వాన్ గత ఆరు గంటల్లో గంటకు 13 కిలోమీటర్ల వేగంతో ఉత్తర దిశగా కదిలినట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) వెల్లడించింది. ప్రస్తుతం నరసాపురానికి 390 కిలోమీటర్లు, కళింగపట్నానికి 320 కిలోమీటర్లు, ఒడిశాలోని గోపాల్‌పూర్‌కు 410 కిలోమీటర్లు, పూరీకి 470 కిలోమీటర్ల దూరంలో తుఫాన్ కేంద్రీకృతమై ఉంది. తాజా అంచనాల ప్రకారం నవంబర్ 20న మధ్యాహ్నం నరసాపురం నుంచి పూరీ మధ్య గోపాల్‌పూర్ సమీపంలో తీరం దాటే అవకాశం ఉంది. తీరం దాటే సమయంలో గాలుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని అధికారులు హెచ్చరిస్తున్నారు.

25
ఉత్తరాంధ్రలో అతి భారీ వర్షాలు.. 100 కి.మీ వేగంతో గాలులు

అక్వాన్ తుఫాన్ ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాల్లో వాతావరణం మరింత ప్రతికూలంగా మారనుంది. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఇప్పటికే శ్రీకాకుళం జిల్లాలో వర్షాలు మొదలయ్యాయి. శుక్ర‌వారం కూడా శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో భారీ వర్షాలు కొనసాగవచ్చని అంచనా వేసింది. ఆంధ్రా, ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో గాలుల వేగం గంటకు 90 నుంచి 100 కిలోమీటర్ల వరకు ఉండవచ్చని, కొన్ని ప్రాంతాల్లో గరిష్టంగా 110 కిలోమీటర్లకు చేరే అవకాశం ఉందని తెలిపింది.

35
ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాలపై తుఫాన్ ప్రభావం

అక్వాన్ తుఫాన్ తొలుత ఆంధ్రప్రదేశ్ తీరాన్ని తాకవచ్చని వాతావరణ శాఖ అంచనా వేసింది. నెల్లూరు నుంచి తుని మధ్య తీరం దాటే అవకాశం ఉందని భావించినప్పటికీ, సముద్రంలోని వాతావరణ పరిస్థితుల కారణంగా తుఫాన్ దిశ మారింది. ప్రస్తుతం ఒడిశా వైపు కదులుతున్నప్పటికీ ఏపీకి ముప్పు పూర్తిగా తొలగిపోలేదు. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యంతో పాటు అల్లూరి సీతారామరాజు, పోలవరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లోనూ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర తీర ప్రాంతాల్లో బలమైన ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉందని అధికారులు చెబుతున్నారు.

45
తుఫాన్ నేపథ్యంలో స్కూళ్లు, అంగన్వాడీలకు సెలవులు

అక్వాన్ తుఫాన్ ముప్పును దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది. ప్రభావిత ప్రాంతాల్లో పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలకు సెలవులు ప్రకటించింది. శ్రీకాకుళం జిల్లాలో తుఫాన్ ప్రభావం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో పాఠశాలలకు అధికారులు సెలవు ప్రకటించారు. అంగన్వాడీ కేంద్రాలకు కూడా సెలవులు వర్తింపజేశారు. వర్షాలు, బలమైన గాలుల కారణంగా విద్యార్థులు, చిన్నారులు ఇబ్బందులు పడకుండా ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే జిల్లాలవారీగా సెలవుల వివరాలు, అమలయ్యే తేదీలను స్థానిక అధికారులు వెల్లడించే సూచనలను తల్లిదండ్రులు గమనించాలి.

55
ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలి

తుఫాన్ ప్రభావిత ప్రాంతాల ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లవద్దని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లకూడదని హెచ్చరికలు జారీ చేసింది. తీర ప్రాంతాల్లో నివసించే వారు అధికారుల సూచనలను పాటిస్తూ సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని తెలిపింది. రైతులు కూడా వ్యవసాయ పనుల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. బలమైన గాలుల సమయంలో చెట్ల కింద, విద్యుత్ స్తంభాల సమీపంలో ఉండకూడదు. వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాల్లో నీరు చేరే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్న అధికారులు అవసరమైన సహాయక చర్యలకు సిద్ధంగా ఉన్నారు.

Read more Photos on
click me!

Recommended Stories