ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యక్ష ముప్పు కొంత తగ్గినా, ఉత్తరాంధ్ర జిల్లాలపై వర్షాల ఎఫెక్ట్ మాత్రం గట్టిగానే ఉండబోతోంది. గురువారం శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, కాకినాడ జిల్లాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే తూర్పుగోదావరి, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, పశ్చిమగోదావరి, పార్వతీపురం మన్యం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడొచ్చని అధికారులు తెలిపారు.
శ్రీకాకుళంలో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో కొన్నిచోట్ల మోస్తరు వర్షాలు కురవొచ్చు. నవంబర్ 20న శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు, అల్లూరి సీతారామరాజు, కోనసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి. దక్షిణ ఒడిశాలోనూ భారీ వర్షాలు పడొచ్చు.