YS Jagan vs YS Sharmila : ఆంధ్ర ప్రదేశ్ లో అధికార టిడిపి కూటమి, ప్రతిపక్ష వైసిపి నాయకుల కంటే అన్నాచెల్లి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ షర్మిల మధ్యే రాజకీయ వైరం ఎక్కువగా కనిపిస్తోంది. వ్యక్తిగతంగా ఇద్దరి మధ్యా విబేధాలున్న విషయం అందరికీ తెలిసిందే... ఇదికాస్త రాజకీయ విబేధాల దారితీసాయి. సొంత అన్నకు వ్యతిరేకంగా వైఎస్ షర్మిల రాజకీయాలు చేస్తున్నారు. ఇప్పటికే కర్ణుడి చావుకు వంద కారణాలన్నట్లు జగన్ ఓటమికి షర్మిల కూడా ఓ కారణమే. అధికారికంగా ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా, లోపాయికారిగా చంద్రబాబు నాయుడు కోసం ఆమె పనిచేసారన్నది ప్రచారం. ఎలాగైతేనేం వైఎస్ జగన్ ఓడిపోయారు కాబట్టి షర్మిల ఇక ఆయనను వదిలిపెడతారని అందరూ భావించారు. కానీ షర్మిల మాత్రం అన్నను విడిచిపెట్టడంలేదు.