ఆంధ్రప్రదేశ్‌లో రేవంత్ ప్రచారం: తిరుపతి సభకు తెలంగాణ సీఎం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికలకు సిద్దమౌతుంది. కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ అధ్యక్ష బాధ్యతలను వై.ఎస్. షర్మిల చేపట్టిన తర్వాత తొలిసారిగా తిరుపతి వేదికగా ఆ పార్టీ భారీ సభను ఏర్పాటు చేయనుంది
ఆంధ్రప్రదేశ్‌లో రేవంత్ ప్రచారం: తిరుపతి సభకు తెలంగాణ సీఎం
ఈ నెల 25న కాంగ్రెస్ పార్టీ తిరుపతిలో నిర్వహించనున్న సభలో తెలంగాణ , కర్ణాటక రాష్ట్రాల ముఖ్యమంత్రులు అనుముల రేవంత్ రెడ్డి, సిద్దరామయ్యలు పాల్గొంటారు. ఈ సభ ద్వారానే ఎన్నికల ప్రచారాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రారంభించే అవకాశం ఉంది.
ఆంధ్రప్రదేశ్‌లో రేవంత్ ప్రచారం: తిరుపతి సభకు తెలంగాణ సీఎం
దక్షిణాదిలో కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. రానున్న ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెరుగైన ఓట్లు, సీట్లను సాధించాలని ఆ పార్టీ భావిస్తుంది. ఈ క్రమంలోనే వైఎస్ఆర్‌సీపీ వైపు వెళ్లిన ఓటు బ్యాంకును తిరిగి తమ వైపునకు తిప్పుకొనేందుకు కాంగ్రెస్ పార్టీ వ్యూహ రచన చేస్తుంది. ఈ క్రమంలోనే తిరుపతి వేదికగా సభను నిర్వహిస్తుంది.
ఆంధ్రప్రదేశ్‌లో రేవంత్ ప్రచారం: తిరుపతి సభకు తెలంగాణ సీఎం
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సమయంలో విస్తృతంగా ప్రచారం చేసేలా ఆ పార్టీ ప్లాన్ చేస్తుంది.కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేస్తున్న పథకాల గురించి కాంగ్రెస్ పార్టీ వివరించనుంది.
ఆంధ్రప్రదేశ్‌లో రేవంత్ ప్రచారం: తిరుపతి సభకు తెలంగాణ సీఎం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడం కోసం పార్టీ తన సేవలను ఏ రకంగా ఉపయోగించుకున్నా అందుకు తాను సహకరిస్తానని రేవంత్ రెడ్డి గతంలో ఓ టీవీ చానెల్ ఇంటర్వ్యూలో ప్రకటించిన విషయం తెలిసిందే.
ఆంధ్రప్రదేశ్‌లో రేవంత్ ప్రచారం: తిరుపతి సభకు తెలంగాణ సీఎం
వై.ఎస్. షర్మిల తనయుడు వై.ఎస్. రాజారెడ్డి వివాహం ఈ నెల 17న పూర్తైంది. దీంతో ఇక పూర్తి సమయం షర్మిల పార్టీ కోసం కేటాయించే అవకాశం ఉంది. ఈ వివాహం కారణంగానే ఈ సభను ఈ నెల 25న ఏర్పాటు చేశారని సమాచారం.
ఆంధ్రప్రదేశ్‌లో రేవంత్ ప్రచారం: తిరుపతి సభకు తెలంగాణ సీఎం
వై.ఎస్. షర్మిల రాష్ట్రంలో విస్తృతంగా పర్యటిస్తూ కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నింపే ప్రయత్నం చేస్తున్నారు. పార్టీ బాధ్యతలు చేపట్టిన తర్వాత గతంలో కాంగ్రెస్ లో కీలకంగా పనిచేసిన నేతలతో కూడ షర్మిల సమావేశమౌతున్నారు. పార్టీలో చేరాలని ఆహ్వానిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో రేవంత్ ప్రచారం: తిరుపతి సభకు తెలంగాణ సీఎం
2014లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగింది. రాష్ట్ర విభజనకు కారణమని కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉనికిని కోల్పోయే పరిస్థితి నెలకొంది. ఆ పార్టీకి చెందిన కీలక నేతలు వైఎస్ఆర్‌సీ, తెలుగు దేశం పార్టీల్లో చేరారు. కొందరు నేతలు రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. అయితే వై.ఎస్. షర్మిల కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు చేపట్టిన తర్వాత రాష్ట్రంలో పార్టీ యంత్రాంగాన్ని తిరిగి యాక్టివ్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు.
కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రయత్నాలు ఏ మేరకు ఫలితాన్ని ఇస్తాయో ఎన్నికల ఫలితాలు తేల్చనున్నాయి.