అమరావతి శాశ్వత రాజధాని... చంద్రబాబు చేసిన ఈ చట్టాన్ని, రేపు జగన్ రెడ్డి మళ్ళీ మార్చగలడా.?

Published : Mar 29, 2026, 10:08 AM IST

Andhra Pradesh: అమరావతిని శాశ్వత రాజధానిగా కొనసాగించాలంటూ కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన తీర్మానాన్ని ఏపీ అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో తాజాగా మ‌రో కీల‌క అంశంప తెర‌పైకి వ‌స్తోంది. 

PREV
15
అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం: అమరావతి రాజధానిగా కొనసాగాలని నిర్ణయం

అమరావతిని నవ్యాంధ్రప్రదేశ్‌కు శాశ్వత రాజధానిగా గుర్తించాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం శ‌నివారం ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాన్ని నిర్వహించింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా కూటమి పార్టీలకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు తమ అభిప్రాయాలు వెల్లడించారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ కూడా మాట్లాడారు. రాజధాని లేని రాష్ట్రంగా ఏపీ ఉండడం బాధాకరం అని వారు పేర్కొన్నారు. సభలో ఎలాంటి వ్యతిరేకత లేకుండా ఈ తీర్మానం ఆమోదం పొందింది. తరువాత దీనిని కేంద్ర ప్రభుత్వానికి పంపాలని నిర్ణయించారు. పార్లమెంటులో చట్ట సవరణ చేసి అమరావతిని అధికారికంగా రాజధానిగా గుర్తించాలన్నది రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం.

25
అసలు సమస్య ఇదే..

2014లో వచ్చిన ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ చట్టం ప్రకారం హైదరాబాద్‌ను రెండు రాష్ట్రాలకు 10 సంవత్సరాల పాటు ఉమ్మడి రాజధానిగా నిర్ణయించారు. ఆ తర్వాత తెలంగాణకు హైదరాబాద్ పూర్తిగా చెందుతుంది. కానీ ఆంధ్రప్రదేశ్‌కు ఏ నగరం రాజధాని అవుతుందో ఆ చట్టంలో స్పష్టంగా పేర్కొనలేదు. దీంతోనే అమరావతి ఎంపిక జరిగినప్పటికీ అది పూర్తిగా పార్లమెంటు చట్టంలో నమోదు కాలేదు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కోరుతున్నది ఏమిటంటే.. ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ చట్టంలోనే “అమరావతి” అనే పేరును అధికారికంగా రాజధానిగా చేర్చాలని. ఇలా జరిగితే రాజధానికి చట్టబద్ధత వస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.

35
జగన్ మళ్లీ అధికారంలోకి వస్తే రాజధాని మారుస్తారా?

ఇది ప్రస్తుతం ఎక్కువగా చర్చ జరుగుతున్న అంశం. 2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు రాజధానుల ప్రతిపాదన తీసుకువచ్చింది. అమరావతి – శాసన రాజధాని, విశాఖ – పరిపాలన రాజధాని, కర్నూలు – న్యాయ రాజధాని అనే మోడల్ ప్రతిపాదించారు. కానీ ఈ చట్టాలను రైతులు కోర్టులో సవాలు చేశారు. 2022లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఆ తీర్పు ప్రకారం అమరావతి అభివృద్ధి చేయాలని ప్రభుత్వం బాధ్యత వహించాలి. రాజధాని మార్పుపై రాష్ట్ర అసెంబ్లీకి పూర్తి అధికారాలు లేవు. ఈ విషయంలో పార్లమెంటు పాత్ర ముఖ్యమని సూచించింది. అంటే ఒక ప్రభుత్వమే నిర్ణయం తీసుకుని రాజధాని మార్చడం అంత సులభం కాదు.

45
పార్లమెంటులో చట్టంగా మారితే పరిస్థితి ఎలా ఉంటుంది?

ఇప్పుడు జరుగుతున్న ప్రక్రియలో ముఖ్యమైనది ఇదే. అసెంబ్లీ తీర్మానం తర్వాత కేంద్రం పార్లమెంటులో చట్ట సవరణ చేస్తే.. అమరావతి రాజధానిగా అధికారికంగా చట్టంలో చేరుతుంది. గెజిట్ నోటిఫికేషన్ కూడా వస్తుంది. అప్పటి నుంచి రాజధాని స్థితి మరింత బలపడుతుంది. అలాంటి పరిస్థితిలో భవిష్యత్తులో ప్రభుత్వం మారినా రాజధాని మార్పు చాలా కష్టమవుతుంది. మళ్లీ పార్లమెంటు చట్ట సవరణ అవసరం అవుతుంది. అందుకే ఈ ప్రక్రియను “చట్టబద్ధ భరోసా”గా ప్రభుత్వం భావిస్తోంది.

55
వైసీపీ వైఖరి ఏమిటి? భవిష్యత్తు రాజకీయ సమీకరణాలు

ఈ సమయంలో వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలు కూడా ఆసక్తికరంగా మారాయి. ఆయన చెప్పిన వివ‌రాల ప్ర‌కారం తమ పార్టీ అమరావతికి వ్యతిరేకం కాదని, అభివృద్ధి వికేంద్రీకరణే తమ సిద్ధాంతమని, రాజధాని పేరిట అవినీతి జరిగిందనే సందేహాలు ఉన్నాయని అన్నారు. అంటే అమరావతి అనే నగరాన్ని పూర్తిగా వ్యతిరేకించడం లేదని వైసీపీ స్పష్టం చేసింది. ఇంకో ముఖ్యమైన అంశం కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కొనసాగుతూ, రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చినా రాజధాని మార్పు వెంటనే జరగడం అంత సులభం కాదు. ఎందుకంటే పార్లమెంటు చట్టం అవసరం, కోర్టు తీర్పులు కూడా ప్రభావితం చేస్తాయి, రైతుల భూముల ఒప్పందాలు కూడా కీలకం. ఈ కారణాల వల్ల అమరావతి ప్రాజెక్టు పూర్తిగా ఆగిపోవడం ఇప్పుడు గతంలా సులభం కాదు.

మొత్తం మీద అమరావతిని శాశ్వత రాజధానిగా చేయాలనే ప్రయత్నం ఇప్పుడు చట్టపరమైన దశలోకి వెళ్లింది. పార్లమెంటు చట్టంగా మారితే భవిష్యత్తులో ఏ ప్రభుత్వం వచ్చినా రాజధాని మార్చడం చాలా క్లిష్టమవుతుంది. అయితే రాజకీయంగా వివాదాలు పూర్తిగా ముగిసిపోయాయని మాత్రం ఇప్పుడే చెప్పలేం

Read more Photos on
click me!

Recommended Stories