Andhra Police: మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టు అబూబకర్ సిద్ధిక్.. సంచలన విషయాలు వెల్లడించిన ఏపీ పోలీసులు

Published : Jul 05, 2025, 08:08 PM IST

Andhra Police: రాయచోటిలో అరెస్టైన అబూబకర్ సిద్ధిక్ బాంబుల తయారీలో నిపుణుడిగా గుర్తించిన ఏపీ పోలీసులు.. అతను పలు తీవ్రవాద ఘటనల్లో పాలుపంచుకున్నాడని సంచలన విషయాలు వెల్లడించారు.

PREV
14
అబూబకర్ సిద్ధిక్‌ పెద్ద ముళ్ల చేప.. ఉగ్రదాడులతో సంబంధాలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాయచోటిలో ఇటీవల తమిళనాడు ఎంటీ-టెర్రరిజం స్క్వాడ్ (ఎటిఎస్) అరెస్టు చేసిన ఇద్దరు అనుమానిత తీవ్రవాదుల్లో ఒకరైన అబూబకర్ సిద్ధిక్ అలియాస్ నాగూర్ ను పెద్ద ముళ్ల చేపగా ఆంధ్రప్రదేశ్ పోలీసులు పేర్కొన్నారు. ఇతడు అత్యంత ప్రమాదకరమైన బాంబుల తయారీలో నిపుణుడిగా ఉన్నాడని కర్నూల్‌ రేంజ్ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీఐజీ) కొయ ప్రవీణ్ తెలిపారు.

ఒంటరిగా పనిచేసే తీవ్రవాది అబూబకర్ సిద్ధిక్

"ఈ వ్యక్తి సాధారణంగా ఉండే వ్యక్తి కాదని ఇప్పుడు స్పష్టమవుతోంది. ఇతడు దేశం మొత్తం పర్యటించి, గల్ఫ్ దేశాలకు కూడా తరచుగా ప్రయాణించిన వ్యక్తి. జకీర్ నాయక్‌ ఆలోచనా ధారలో నడిచే, ఒంటరిగా పనిచేసే తీవ్రవాది. ఐఈడీలు, టైమర్ బాంబులు, ఇతర ఎలక్ట్రానిక్ పేలుళ్ల పరికరాల తయారీలో నిపుణుడు" అని డీఐజీ ప్రవీణ్ తెలిపినట్టు పీటీఐ నివేదించింది.

తమిళనాడు ఎటిఎస్ ఇటీవల అబూబకర్ సిద్ధిక్, అతని సహచరుడు మొహమ్మద్ అలీని అనంతపురం జిల్లా రాయచోటిలో అరెస్టు చేసింది.

24
అబూబకర్ సిద్ధిక్ నుంచి ఆయుధాలు, పరికరాలు స్వాధీనం

అబూబకర్ సిద్ధిక్ నివాసంలో ఇటీవల నిర్వహించిన తనిఖీల్లో ఎలాంటి పేలుడు పదార్థాలు లభించకపోయినా, పోలీసులు కొన్ని కీలక పత్రాలు, పెన్ డ్రైవ్‌లు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటికే స్వాధీనం చేసిన వస్తువుల్లో కత్తులు, కర్రలు, డిజిటల్ టైమర్లు, క్లాక్ స్విచ్‌లు, స్పీడ్ కంట్రోలర్లు, బాల్ బెరింగ్స్, నట్స్ అండ్ బోల్ట్స్, బైనాక్యులర్లు, వాకీటాకీలు, మొబైల్ ఫోన్లు, హ్యాకింగ్ సాఫ్ట్‌వేర్ ఉన్నాయి.

అంతేకాక, పెద్ద నగరాల మ్యాప్లు, కోడింగ్ మాన్యువల్స్, ఐసిస్ ప్రభావిత సాహిత్యం, ఆస్తి పత్రాలు, డిజిటల్ స్టోరేజ్ పరికరాలు, చెక్ బుక్స్, అనుమానాస్పద ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన రికార్డులు కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

34
బీజేపీ కార్యాలయంలో బాంబు దాడిలో అబూబకర్ సిద్ధిక్ పాల్గొన్నట్టు ఆరోపణ

డీఐజీ ప్రకారం.. అబూబకర్ సిద్ధిక్ రాయచోటిలో స్థిరపడిన తర్వాత, బెంగళూరులోని బీజేపీ మల్లేశ్వరం కార్యాలయంలో జరిగిన బాంబు పేలుళ్లలో ప్రమేయం ఉన్నట్టు గుర్తించారు.

ఈయనపై మరో తీవ్రవాద దాడి కేసు కూడా ఉంది. 2011లో తమిళనాడు మధురైలో బీజేపీ సీనియర్ నాయకుడు, మాజీ ఉప ప్రధాని ఎల్‌కే అద్వానీ నిర్వహించిన రథయాత్ర సమయంలో పైప్ బాంబులను అమర్చే యత్నంలో అబూబకర్ సిద్ధిక్ పాత్ర ఉందని అనుమానిస్తున్నారు.

44
పార్సెల్ బాంబును నిర్వీర్యం చేసిన పోలీసులు

జూలై 3న పోలీసులు అబూబకర్ సిద్ధిక్, అలీ వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న పార్సెల్ బాంబును సురక్షితంగా నిర్వీర్యం చేశారు. ఈ చర్యలన్నింటిని కేంద్ర ఇంటెలిజెన్స్, ఎన్‌ఐఏ, ఇతర అంతర్జాతీయ స్థాయి ఏజెన్సీల సమన్వయంతో కొనసాగిస్తున్నారు.

అబూబకర్ సిద్ధిక్ ఒంటరిగా ఉంటూ తీవ్రవాద భావజాలాన్ని వ్యాప్తి చేస్తూ, టెక్నికల్ నిపుణతను ఇతరులతో పంచుకుంటున్నట్లు అధికారులు గుర్తించారు. జకీర్ నాయక్‌ మాటల ప్రభావంతో సిద్ధిక్ మారిపోయినట్టు సమాచారం.

పోలీసులు ప్రస్తుతం స్వాధీనం చేసుకున్న డేటాను విశ్లేషిస్తూ, అబూబకర్ సిద్ధిక్ గల సంబంధాలు, విస్తృత నెట్‌వర్క్‌ను గుర్తించే పనిలో ఉన్నారు. ఇప్పటికే కేంద్ర గూఢచార సంస్థలు ఆ విషయమై దృష్టి సారించాయి.

Read more Photos on
click me!

Recommended Stories