కొత్త రేషన్‌ కార్డులు వచ్చేస్తున్నాయి...లిస్ట్‌ లో మీ పేరుందా లేదో తెలుసుకోండి!

Published : Jul 05, 2025, 01:07 PM IST

ఏపీ ప్రభుత్వం స్మార్ట్ రేషన్ కార్డులు అందించేందుకు సిద్ధమైంది. క్యూఆర్ కోడ్, ఫోటో, కుటుంబ సభ్యుల వివరాలతో కార్డులు తయారు చేస్తున్నారు.

PREV
17
స్మార్ట్ రేషన్ కార్డు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రేషన్ వ్యవస్థను మరింత ఆధునీకరించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను అందించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఇప్పటివరకు ఉపయోగిస్తున్న సాధారణ పేపర్ రేషన్ కార్డులకు బదులుగా, ఈసారి ఆధునిక సాంకేతికత ఆధారంగా డిజిటల్ పద్ధతిలో స్మార్ట్ కార్డులు జారీ చేయనున్నారు.

27
ఏటీఎం కార్డుల మాదిరిగా

ఈ స్మార్ట్ రేషన్ కార్డులు బ్యాంక్‌ ఏటీఎం కార్డుల మాదిరిగా ఉండబోతున్నాయి. ముద్రణ నాణ్యత కూడా అత్యుత్తమంగా ఉంటుంది. కార్డు ముందు భాగంలో రాష్ట్ర ప్రభుత్వ చిహ్నం, కార్డు దారుడి ఫోటో, రేషన్ కార్డు నంబరు, రేషన్ షాపు నంబరు వంటి ముఖ్యమైన వివరాలు ఉంటాయి. వెనుక భాగంలో మాత్రం కుటుంబంలోని సభ్యుల వివరాలు స్పష్టంగా ప్రింట్ చేసి ఉంటాయి.

37
సరఫరాలో పారదర్శకత

ఈ స్మార్ట్ కార్డుల ప్రధాన లక్ష్యం – రేషన్ సరఫరాలో పారదర్శకత తీసుకురావడం. ఈ కార్డులను ఈ-పోస్ యంత్రాల సాయంతో స్కాన్ చేస్తే, సంబంధిత కుటుంబానికి సంబంధించిన మొత్తం డేటా వెంటనే కనిపిస్తుంది. ఎంత సబ్సిడీ వస్తుంది, ఏవేం వస్తువులు తీసుకున్నారు అనే వివరాలు వెంటనే అధికారులు చూసేలా ఈ వ్యవస్థను తయారు చేస్తున్నారు.

47
ఏపీ టెక్నాలజీ సర్వీసెస్

ప్రస్తుతం ఈ స్మార్ట్ రేషన్ కార్డుల ముద్రణకు సంబంధించిన ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ (ఏపీటీఎస్) సంస్థ టెండర్ ద్వారా ముద్రణ పనులను చేపట్టింది. అన్నీ కుదిరితే వచ్చే నెల నుంచే రాష్ట్రవ్యాప్తంగా వీటిని పంపిణీ చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

57
దరఖాస్తుల పెండింగ్‌

ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 1.46 కోట్ల రేషన్ కార్డులు ఉన్నాయని సమాచారం. కానీ గత ప్రభుత్వ హయాంలో లక్షలాది దరఖాస్తులు పెండింగ్‌లోనే ఉండిపోయినట్లు తెలుస్తోంది. కొత్త కూటమి ప్రభుత్వం అధికారికంగా అర్హత కలిగిన వారికి రేషన్ కార్డులు మంజూరు చేస్తున్నది.

ఇందులో భాగంగా మే నెల నుంచి రేషన్ కార్డులకు సంబంధించి దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతున్నది. కుటుంబంలో నుంచి వేరుపడ్డ పిల్లలు కొత్తగా దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే కార్డు మీద సభ్యుల పేర్లు జోడించడం, తొలగించడం, చిరునామా మార్పులు చేసుకోవడం కూడా ఈ ప్రక్రియలో భాగమే.

67
Service Request Status Check'

ఇంకా, కొత్తగా దరఖాస్తు చేసిన వారు తమ రేషన్ కార్డు స్టేటస్‌ను ఇంటి నుంచే ఆన్‌లైన్‌లో చెక్ చేసుకునే సౌకర్యం కల్పించారు. దీని కోసం ఏపీ సేవా పోర్టల్ (https://vswsonline.ap.gov.in/) ను ఓపెన్ చేయాలి. హోమ్‌పేజీలో 'Service Request Status Check' అనే లింక్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసి దరఖాస్తు సమయంలో పొందిన రిఫరెన్స్ నంబర్‌ను ఎంటర్ చేయాలి. తరువాత స్క్రీన్‌పై కనిపించే క్యాప్చాను ఫిల్ చేసి సెర్చ్ బటన్‌ను నొక్కితే, మీ కార్డు ఏ దశలో ఉందో, ఎవరి వద్ద పెండింగ్‌లో ఉందో, ఇంకా ఎంత రోజుల్లో పూర్తి అవుతుందో అన్న సమాచారం మొత్తం తెలుస్తుంది.

77
సరఫరాలో స్పష్టత

ఈ స్మార్ట్ రేషన్ కార్డులు అందడం వల్ల పౌరుల సమాచారం త్వరగా తెలుసుకునే అవకాశంతోపాటు, రేషన్ సరఫరాలో స్పష్టత కూడా పెరిగే అవకాశం ఉంది. అనర్హులు తొలగించబడి, అర్హులకు ప్రయోజనం అందేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇకపై లబ్ధిదారులు తాము ఏ రేషన్ తీసుకున్నారు, ఎన్ని సార్లు తీసుకున్నారు వంటి వివరాలన్నీ డిజిటల్ రికార్డులో చూసుకునే వీలుంటుంది.

Read more Photos on
click me!

Recommended Stories