ఆమ్రపాలి ఐఏఎస్ ఇప్పుడు ఎక్కడున్నారు..? ఏం చేస్తున్నారు..?

Published : Feb 20, 2026, 07:21 PM ISTUpdated : Feb 20, 2026, 07:32 PM IST

తెలంగాణలో ఉండగా తరచూ వినిపించే ఆమ్రపాలి ఐఏఎస్ పేరు ఇప్పుడెందుకు వినిపించడంలేదు. ఆమె ప్రస్తుతం ఎక్కడున్నారు..? ఏ విధులు నిర్వర్తిస్తున్నారు..? అనేది చాలామందికి తెలియదు.

PREV
15
ఆమ్రపాలి ఐఏఎస్ ఏమైపోయారు..?

Amrapali IAS : ఐఏఎస్ ఆమ్రపాలి... తెలుగు ప్రజలకు పరిచయం అక్కర్లేని పేరు. సినిమా తారలు, టాప్ క్రికెటర్ల స్థాయిలో గుర్తింపు పొందిన డైనమిక్ ఐఏఎస్ ఆఫీసర్ ఆమె. తన పాలనాపరమైన నిర్ణయాలతోనే కాదు అందంతో ఈ తెలుగింటి ఆడపడుచు ప్రజల్లో మంచి ఫాలోయింగ్ సంపాదించారు. తెలంగాణలోనే కాదు కేంద్రంలో కీలక బాధ్యతలు చేపట్టిన ఆమ్రపాలి పేరు గతంలో ఎక్కువగా వినిపించేది... కానీ ఇప్పుడు ఆమె ఎక్కడా కనిపించడంలేదు. దీంతో ఆమె ఎక్కడున్నారు..? ఏం చేస్తున్నారు? అనేది తెలుసుకునేందుకు తెలుగు ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు.

25
ఆమ్రపాలి ఐఏఎస్ ఎక్కడ..?

ఆమ్రపాలి ఐఏఎస్ ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ లో ఉంటున్నారు. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ విభజన సమయంలో ఆమెను తెలంగాణ కేడర్ కేటాయించగా... ఇటీవల అనూహ్యంగా ఏపీకి బదిలీకావాల్సి వచ్చింది. డివోపిటి (Department of Personnel and Training) ఆమ్రపాలితో పాటు మరికొందరు ఐఏఎస్ లను తెలంగాణ నుండి ఏపీకి బదిలీచేసింది.

అయితే ప్రస్తుతం ఆమె బదిలీ వ్యవహారం సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ (CAT), తెలంగాణ హైకోర్టులో నలుగుతోంది. ఏపీ కేడర్ లో కొనసాగుతున్న ఆమ్రపాలి టూరిజం శాఖలో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆంధ్ర ప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పోరేషన్ (APTDC) మేనేజింగ్ డైరెక్టర్, ఏపీ టూరిజం అథారిటీ సీఈవో గా కొనసాగుతున్నారు. గతంలో తన పనితీరుతో తెలంగాణ ప్రభుత్వం, ప్రజలచేత ప్రశంసలు పొందిన ఈ డైనమిక్ ఐఏఎస్ ఆఫీసర్ ఇప్పుడు సొంతరాష్ట్రంలో తన మార్క్ చూపిస్తున్నారు... టూరిజం డెవలప్ కోసం సరికొత్త వ్యూహాలతో ముందుకు వెళుతున్నారు.

ఆసక్తికరమైన విషయం ఏంటంటే తన సొంత రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్ లో పనిచేసేందుకు ఆమ్రపాలి సుముఖంగా లేరు... తనకు తిరిగి తెలంగాణ కేడర్ కేటాయించాలని న్యాయపోరాటం చేస్తున్నారు. తెలంగాణ హైకోర్టులో ఆమె క్యాడర్ వ్యవహారంపై వాదోపవాదాలు జరుగుతున్నాయి… కోర్టు నిర్ణయంపై ఆమె భవిష్యత్ లో ఎక్కడ పనిచేస్తారన్నది ఆధారపడి ఉంది.

35
ఆమ్రపాలికి తిరిగి తెలంగాణ కేడర్ దక్కుతుందా..?

డివోపిటి తనను తెలంగాణ నుండి ఏపీకి బదిలీ చేయడంపై ఆమ్రపాలి ఐఏఎస్ కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్ ని ఆశ్రయించారు... దీంతో ఆమె తిరిగి తెలంగాణకు కేటాయించబడ్డారు. కానీ క్యాట్ తీర్పును తెలంగాణ హైకోర్టు తాత్కాలికంగా నిలిపివేసింది... దీంతో కథ మళ్లీ మొదటికి వచ్చింది. ఆమ్రపాలి ఏపీ నుండి తెలంగాణకు రావాలన్న ప్రయత్నాలకు అడ్డుకట్ట పడింది... దీంతో ఇప్పటికీ ఆమె ఏపీ టూరిజంలో కొనసాగుతున్నారు. త్వరలోనే ఆమ్రపాలి వ్యవహారంపై తెలంగాణ హైకోర్టు క్లారిటీ ఇవ్వనుంది.

45
తెలంగాణలో ఆమ్రపాలి కీలక విధులు..

ఉమ్మడి రాష్ట్రంలోనే కాదు విభజన తర్వాత కూడా తెలంగాణలో కీలక బాధ్యతలు నిర్వర్తించారు ఐఏఎస్ ఆమ్రపాలి. అతి చిన్న వయసులో ఐఏఎస్ సాధించిన ఈమె ఉమ్మడి రాష్ట్రంలో వికారాబాద్ సబ్ కలెక్టర్, రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ గా పనిచేశారు. ఇక రాష్ట్ర విభజన తర్వాత వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్ జిల్లాల కలెక్టర్ గా కూడా వ్యవహరించారు. వరంగల్ అర్భన్ జిల్లా తొలి మహిళా కలెక్టర్ ఈమే.  

తెలంగాణ రాజధాని హైదరాబాద్ పాలనా బాధ్యతలు కూడా చూసుకున్నారు ఆమ్రపాలి. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ (GHMC), హైదరాబాద్ మెట్రోపాలిటిన్ డెవలప్మెంట్ అథారిటీ (HMDA) కమీషనర్ గా వ్యవహరించారు. అంతేకాదు మూసీ అభివృద్ధి సంస్థ ఇన్‌చార్జ్‌ ఎండీగా కూడా పనిచేశారు.

ఇక కేంద్ర సర్వీసులో కూడా ఆమ్రపాలి పనిచేశారు... ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయంలో డిప్యూటీ సెక్రటరీగా కీలక బాధ్యతలు చేపట్టారు. కిషన్ రెడ్డి కేంద్ర హోంశాఖ సహాయమంత్రిగా ఉండే సమయంలో ఆయన ప్రైవేట్ సెక్రటరీగా కూడా వ్యవహరించారు. ఇలా ఆమ్రపాలి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో అత్యున్నత బాధ్యతలు చేపట్టారు.

55
ఆమ్రపాలి వ్యక్తిగత జీవితం...

ఆమ్రపాలి 1982, నవంబరు 4న విశాఖపట్నంలో జన్మించారు... తండ్రి కాట వెంకట్, తల్లి పద్మావతి. తండ్రి ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ గా పనిచేసి రిటైర్ అయ్యారు. ఆమ్రపాలి ప్రాథమిక విద్యాభ్యాసం విశాఖపట్నంలోనే సాగింది... సాయి సత్య మందిర్ స్కూల్లో చదివారు. ఇంటర్మీడియట్ వరకు విశాఖలోనే చదివిన ఆమ్రపాలి ఐఐటీలో సీటు సాధించడంతో చెన్నైకి వెళ్లారు. ఐఐటీ మద్రాస్ నుండి ఇంజనీరింగ్, బెంగళూరు ఐఐఎం నుండి మాస్టర్స్ ఇన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ లో పట్టా సాధించారు. అనంతరం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్ష రాసి ఆల్ ఇండియా 39 వ ర్యాంక్ ను సాధించారు... సొంత రాష్ట్రంలోని ఐఏఎస్ కు ఎంపికయ్యారు. ఆమె భర్త సమీర్ శర్మ కూడా ఐఏఎస్ అధికారే కావడం విశేషం. 

Read more Photos on
click me!

Recommended Stories