చుక్క నూనె లేకుండా ఆలూ చిప్స్ ఎలా చేయాలో తెలుసా?

By Shivaleela Rajamoni  |  First Published Oct 1, 2024, 2:11 PM IST

ఆలూ చిప్స్ ను పిల్లలే కాదు పెద్దలు కూడా ఇష్టంగా తింటారు. కానీ ఈ చిప్స్ ను తయారుచేయాలంటే పక్కాగా ఆయిల్ ను వాడాల్సిందే. కానీ ఆయిల్ ను ఎక్కువగా తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదు. అయితే మీరు చుక్క నూనె లేకుండా ఈ చిప్స్ ను తయారుచేయొచ్చు. అదెలాగంటే? 


బంగాళాదుంపలతో మనం రకరకాల కూరలను చేసుకుని తింటుంటాం. దీనితో చేసిన ఏ వంటకమైనా టేస్ట్ అదిరిపోతుంది. అంతేకాదు ఇది మన ఆరోగ్యానికి కూడా కొన్ని ప్రయోజనాలను కలిగిస్తుంది. అయితే చాలా మంది ఆలుగడ్డలతో చిప్స్ ను కూడా చేసుకుని తింటుంటారు. 

పొటాటో చిప్స్ ను కొంతమంది షాపుల్లో కొని తింటే.. మరికొంతమంది మాత్రం ఇంట్లోనే తయారుచేస్తుంటారు. నిజానికి ఈ చిప్స్ ను పిల్లలే కాదు పెద్దలు కూడా ఇష్టంగా తింటుంటారు. అందుకే ఆడవారు ఇంట్లో వీటిని ప్రిపేర్ చేస్తుంటారు. ఈ బంగాళాదుంప చిప్స్ చాలా చాలా టేస్టీగా ఉంటాయి. కానీ దీనిలో పిండి పదార్థాలు, ట్రాన్స్ ఫ్యాట్, నూనె ఎక్కువగా ఉంటుంది. అందుకే ఇది ఆరోగ్యానికి మంచిది కాదని చెప్తుంటారు. 

Latest Videos

undefined

ఆలూ చిప్స్ ను ప్రిపేర్ చేయాలంటే వీటిని నూనెలో డీప్ ఫ్రై  చేయాలి. దీనివల్ల వీటికి నూనె అంటుకుంటుంది. వీటిని తింటే బరువు పెరగడమే కాదు.. ఒంట్లో ఫ్యాట్స్ కూడా బాగా పెరిగిపోతాయి. అందుకే చాలా మంది దీనికి భయపడి ఈ చిప్స్ ను తినకుండా ఉంటారు. కానీ మీరు ఆలూ చిప్స్ ను నూనెలో డీప్ ఫ్రై చేయకుండానే తయారుచేయొచ్చు. అలా అని టేస్టీగా ఉండవని అనుకోకండి. ఇవి చాలా చాలా టేస్టీగా ఉంటాయి. 

అంతేకాకుండా ఆయిల్ లేకుండా చేసిన బంగాళాదుంప చిప్స్ నవరాత్రి ఉపవాసం ఉన్నవారికి కూడా ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. నవరాత్రి ఉపవాసం వల్ల గ్యాస్, ఎసిడిటీ సమస్యను ఎక్కువగా ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇలాంటి పరిస్థితిలో మీరు నూనెలో డీప్ ఫ్రై చేసిన, వేయించిన పదార్థాలను తింటే మీ ఆరోగ్యం మరింత దెబ్బతింటుంది. కానీ ఆయిల్ లేకుండా చేసిన ఆలూ చిప్స్ ను తింటే మీకు ఎలాంటి సమస్యలు రావు. వీటిని మీరు ఉపవాసం సమయంలో అల్పాహారంగా తినొచ్చు. మీరు కూడా నూనె చుక్క కూడా వాడకుండా బంగాళాదుంప చిప్స్ తయారు చేయాలనుకుంటే ఈ రెసిపీని ప్రయత్నించండి. 

నూనె లేకుండా బంగాళాదుంప చిప్స్ ను ఎలా తయారు చేయాలి?

బంగాళాదుంప చిప్స్ ను తయారుచేయడానికి ముందుగా.. బంగాళాదుంపలను ఎంచుకోండి. అంటే చిప్స్ పెద్దగా ఉండాలంటే పెద్ద సైజు ఆలూ, చిన్న సైజులో ఉండాలంటే చిన్న సైజు ఆలుగడ్డలను పక్కన పెట్టుకోండి. అయితే చిప్స్ ను తయారుచేయడానికి ఆకుపచ్చగా ఉండే ఆలుగడ్డలను అస్సలు తీసుకోకూడదు. ఎందుకంటే ఇవి చిప్స్ రుచిని పాడు చేస్తాయి. 

ముందుగా బంగాళదుంపల తొక్క తీసి శుభ్రంగా కడిగండి. వీటిని మధ్య నుంచి కట్ చేసుకోండి. వీటిని వేలి ఆకారంలో లేదా చిప్స్ ఆకారంలో సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోండి. సన్నని చిప్స్ కావాలంటే ఆలుగడ్డలను స్లైసర్ లో లేదా వెడ్జ్ ఆకారాల్లో కట్ చేసుకోవచ్చు. 

చిప్స్ ను కట్ చేసుకున్న తర్వాత వాటిని ఒకసారి నీళ్లతో కడగండి. తర్వాత ఒక పాత్ర తీసుకుని నీళ్లను వేడి చేయండి. వాటర్ వేడి అయ్యాక అందులో పచ్చి బంగాళాదుంపల చిప్స్ ముక్కలను వేయండి. అలాగే రుచికి సరిపడా పసుపు, ఉప్పు వేసి ఒక నిమిషం పాటు ఉడకనివ్వండి. అయితే ఈ  బంగాళాదుంపల చిప్స్ ను ఎక్కువగా ఉడకబెట్టకూడదు. కేవలం వాటి పచ్చదనాన్ని మాత్రమే తొలగించాలి.

తర్వాత మంటను ఆఫ్ చేసి బంగాళాదుంపల చిప్స్ ను మళ్లీ కూల్ వాటర్ తో కడగండి. అలాగే పేపర్ టవల్ ఉపయోగించి నీటిని వడకట్టండి. ఇప్పుడు ఓవెన్ ను 180 డిగ్రీలకు ప్రీహీట్ చేయండి. చిప్స్ ను  బేకింగ్ ట్రే మీద షీట్ పెట్టి పెట్టండి. తర్వాత వాటిపై కొద్దిగా ఉప్పు చల్లండి. దీన్ని ఓవెన్ లో పెట్టి 3-4 నిమిషాలు బంగారు రంగు వచ్చే వరకు బేక్ చేయండి. అంతే టేస్టీ టేస్టీ ఫింగర్ బంగాళాదుంప చిప్స్ రెడీ అయినట్టే. 

ఇక బంగాళాదుంప చిప్స్ ను నూనె లేకుండా తయారుచేయడానికి ఇంకో పద్దతి కూడా ఉంది. ఇందుకోసం ముందుగా బంగాళాదుంప తొక్కను తొలగించి స్లైసర్ తో సన్నగా కోయండి. వీటిని ఓవెన్ ట్రేలో ఉంచి కాస్త ఉప్పు జల్లి ముందుగా ఒక వైపు 4-5 నిమిషాల పాటు ఉంచండి.  ఆపై బంగారు రంగు వచ్చే వరకు బేక్ చేయండి. ఇంతే.. చుక్క నూనె లేకుండా బంగాళాదుంప చిప్స్ ను ఇంట్లోనే చాలా ఈజీగా తయారుచేయొచ్చు. 
 

click me!