కిడ్నీ స్టోన్స్ ఉన్నవాళ్లు ఈ ఫుడ్స్ ను అస్సలు తినకూడదు

By Shivaleela Rajamoni  |  First Published Jul 23, 2024, 1:08 PM IST

మూత్రపిండాల్లో రాళ్లు కరిగిపోవాలంటే మీ ఆహారపు అలవాట్లు బాగుండాలి. అయితే వీళ్లు కొన్ని రకాల ఆహారాలను అస్సలు తినకూడదు. ఒకవేళ తింటే కిడ్నీలో రాళ్లు పెరుగుతాయి. 
 


మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడటానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. మీకు తెలుసా? నీళ్లను తక్కువగా తాగే వారికే లేనిపోని రోగాలు వస్తుంటాయి. వీటిలో కిడ్నీ స్టోన్స్ ఒకటి. సరిపడా నీళ్లను తాగకపోవడం వల్ల యూరిక్ యాసిడ్ శరీరం నుంచి పూర్తిగా తొలగిపోదు. ఇది మూత్రాన్ని ఆమ్లంగా చేస్తుంది. ఇదే కిడ్నీ స్టోన్స్ కు ప్రధాన కారణం. ఆహారపు అలవాట్లు సరిగ్గా లేనివారికి కూడా కిడ్నీ స్టోన్స్ వచ్చే ప్రమాదం ఉంది. నిజానికి కొన్ని రకాల ఆహారాలు మూత్రపిండాల్లో రాళ్లను ఏర్పరుస్తాయి. 

కిడ్నీల్లో స్టోన్స్ ఏర్పడితే తట్టుకోలేనంత నొప్పి వస్తుంది. కిడ్నీ స్టోన్స్ పెద్దగా ఉంటే మాత్రం ఖచ్చితంగా హాస్పటల్ కు వెళ్లాలి. అయితే ఈ సమస్యను మొదట్లోనే చాలా సింపుల్ గా తగ్గించుకోవచ్చు తెలుసా? కిడ్నీ స్టోన్స్ ను హెల్తీ ఫుడ్ తో నయం చేయొచ్చు. కిడ్నీ స్టోన్స్ ను కరిగించొచ్చు. అందుకే కిడ్నీ స్టోన్ సమస్య ఉంటే ఏం తినాలి? ఏం తినకూడదో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

Latest Videos


కిడ్నీ స్టోన్స్ ఉంటే ఏం తినకూడదు?

రెడ్ మీట్:  కిడ్నీ స్టోన్స్ ఉన్నవారు రెడ్ మీట్ వంటి మాంసాహారం తినకూడదు. ఎందుకంటే ఇవి మూత్రంలో యూరిక్ యాసిడ్ లెవెల్స్ ను పెంచుతాయి. ఇది మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడటానికి దారితీస్తుంది.  అలాగే వీళ్లు స్వీట్లు, కెఫిన్ ను కూడా తీసుకోకూడదు. ఎందుకంటే ఇవి కూడా మూత్రంలో కాల్షియం లెవెల్స్ ను పెంచి మూత్రపిండాలలో రాళ్లు ఏర్పడటానికి కూడా దారితీస్తుంది.

ఆల్కహాల్: కిడ్నీ స్టోన్స్ ఉన్నవారు పొరపాటున కూడా ఆల్కహాల్ ను తాగకూడదు. ఎందుకంటే ఇది శరీరంలో వాటర్ లెవెల్స్ ను తగ్గిస్తుంది. అలాగే మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడటానికి దారితీస్తుంది. 

ఉప్పు: కిడ్నీ స్టోన్స్ తో బాధపడుతున్నవారు ఉప్పును చాలా వరకు తగ్గించాలి. ఎందుకంటే ఉప్పు ఎక్కువగా ఉండే ఆహారాలను తింటే మూత్రపిండాల్లో రాళ్లు మరింత పెరుగుతాయి. అదనపు సోడియం కాల్షియం ఏర్పడటాన్ని పెంచుతుంది. అందుకే కిడ్నీ స్టోన్స్ ఉన్నవారు జంక్ ఫుడ్, పిజ్జా, బర్గర్ వంటివి తినకూడదు.

సిట్రస్ పండ్లు: సిట్రస్ పండ్లు ఆరోగ్యానికి చాలా మంచివి. వీటిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది ఇమ్యూనిటీ పవర్ ను పెంచుతుంది. ఈ సిట్రస్ పండ్లు ఆరోగ్యానికి మంచివే అయినా.. వీటిని ఎక్కువగా తింటే ఆక్సలేట్ ఉత్పత్తి పెరుగుతుంది. దీనివల్ల కిడ్నీలో రాళ్లు ఏర్పడతాయి. కాబట్టి కిడ్నీలో రాళ్లు ఏర్పడితే వీటిని తినడం మానేయండి. 

సోడా:  సోడా టేస్టీగా ఉంటుంది. కానీ ఇది మీ మూత్రపిండాల్లో రాళ్ల సైజును మరింత పెంచుతుంది. ఈ సోడాలో ఉండే ఉండే ఫాస్బారిక్ యాసిడ్ కిడ్నీ స్టోన్స్ ఏర్పడటాన్ని మరింత పెంచుతుంది.

కిడ్నీ స్టోన్స్ ఉన్నవారు ఏం తినాలి? 

మూత్రపిండాల్లో రాళ్లు ఉన్నవారు శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుకోవడం చాలా ముఖ్యం. అందుకే వీళ్లు నీటిని పుష్కలంగా తాగడంతో పాటుగా ఇతర ద్రవాలను తాగాలి. వీళ్లు ప్రతిరోజూ రెండు నుంచి మూడు లీటర్ల నీటిని తాగాలి. 

అలాగే వీళ్లు కాల్షియాన్ని కూడా పుష్కలంగా తీసుకోవాలి. ఇందుకోసం పాల ఉత్పత్తులు, ఆకుకూరలను బాగా తినాలి. మీరు కాల్షియాన్ని తక్కువగా తీసుకుంటే మీ మూత్రంలో ఆక్సలేట్ లెవెల్స్ పెరుగుతాయి. అలాగే పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, తక్కువ ప్రోటీన్ కలిగిన ఆహారాలను తినండి. 

click me!