కొంతమంది లావుగా ఉన్నామే అని బాధపడితే మరికొంతమంది మాత్రం సన్నగా ఉన్నామే.. అని బాధపడిపోతుంటారు. బరువు పెరగాలని బయటి ఫుడ్స్ ను బాగా తింటుంటారు. కానీ బరువు పెరగడానికి బయటి ఫుడ్స్ ను తిన్నారంటే ఆరోగ్యం దెబ్బతింటుంది జాగ్రత్త. మరి ఏ హెల్తీ ఫుడ్స్ ను తింటే బరువు పెరుగుతామో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
ప్రస్తుత కాలంలో చాలా మంది ఊబకాయంతో బాధపడుతున్నారు. ఈ ఊబకాయం మిమ్మల్ని ఎన్నో వ్యాధుల బారిన పడేస్తుంది. ఊబకాయం ఎంత పెద్ద సమస్యో.. ఉండాల్సిన బరువు కంటే తక్కువగా ఉండటం కూడా సమస్యే. మరీ బక్కగా ఉన్నవారు లావుగా అవ్వాలంటే ఏం తినాలో చాలా మందికి తెలియదు. అవేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
బంగాళదుంపలు: బంగాళదుంపలను తింటే బరువు ఖచ్చితంగా పెరుగుతారు. ఎందుకంటే బంగాళాదుంపల్లో కార్బోహైడ్రేట్లు, చక్కెరలు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇవి మీరు ఆరోగ్యంగా బరువు పెరగడానికి ఎంతగానో సహాయపడతాయి. బరువు పెరగాలంటే బంగాళాదుంపలను రోజూ తినాలి. ఇందుకోసం బంగాళాదుంపలను ఉడకబెట్టి తినొచ్చు. లేదా ఆవిరిలో ఉడికించి లేదాపెరుగుతో తినొచ్చు.
undefined
నెయ్యి : నెయ్యిని తింటే కూడా మీరు బరువు పెరుగుతారు. ఎందుకంటే నెయ్యిలో కేలరీలు ఎక్కువగా ఉంటాయి. రోజూ నెయ్యిని తీసుకుంటే మీరు బరువు ఖచ్చితంగా పెరుగుతారు. మీరు బరువు పెరగాలంటే రోటీలో నెయ్యి వేసుకుని తినొచ్చు. అలాగే అన్నం, పప్పులలో కూడా నెయ్యిని వేసుకుని తినొచ్చు.
గుడ్లు: గుడ్లలో కొవ్వులు, కేలరీలు మెండుగా ఉంటాయి. వీటిని మీరు రోజూ తినడం వల్ల ఆరోగ్యంగా బరువు పెరుగుతారు. దీనిలో మంచి మొత్తంలో ప్రోటీన్లు ఉంటాయి. గుడ్లు మీ బరువును పెంచడమే కాకుండా.. మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి. బరువు పెరగడానికి ఉడికించిన గుడ్లు తినొచ్చు. లేదా ఆమ్లేట్ తినొచ్చు.
అరటిపండు: అరటిపండులో కేలరీలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మీ శరీరానికి శక్తిని అందించడమే కాకుండా మీ బరువును ఆరోగ్యంగా పెంచడానికి కూడా సహాయపడతాయి. అరటిపండ్లను అలాగే లేదా పాలతో పాటు తినొచ్చు.