బ్రేక్ ఫాస్ట్ లో ఏం చేసుకుని తింటే ఆరోగ్యంగా ఉంటారో తెలుసా?

By Shivaleela Rajamoni  |  First Published Jul 23, 2024, 4:58 PM IST

ఆరోగ్యంగా ఉండాలంటే ఉదయాన్నే హెల్తీ బ్రేక్ ఫాస్ట్ ను తినాలి. అసలు ఎలాంటి బ్రేక్ ఫాస్ట్ లు హెల్తీవో తెలుసా? ఉదయం ఏవి తింటే ఆరోగ్యంగా ఉంటారో తెలుసా? 
 


ఉదయం ఏం తినాలి? ఏం తినకూడదో? చాలా మందికి తెలియవు. ఇక కొంతమంది అయితే బరువు తగ్గాలని, లేదా టైం లేక బ్రేక్ ఫాస్ట్ ను అసలే తినరు. కానీ మీరు ఆరోగ్యంగా ఉండాలంటే మాత్రం ఖచ్చితంగా బ్రేక్ ఫాస్ట్ ను చేయాలి. అది కూడా హెల్తీది అయ్యి ఉండాలి. అయితే చాలా మంది ఉదయం టీ లేదా కాఫీని తాగేసి.. మధ్యాహ్నం తింటుంటారు. కానీ ఇలా అస్సలు చేయకూడదు. ఉదయం హెల్తీ బ్రేక్ ఫాస్ట్ తింటేనే మీరు ఆరోగ్యంగా ఉంటారు. హెల్తీగా ఉండాలంటే ఉదయం ఏం తినాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

గుడ్లు: గుడ్లు మన ఆరోగ్యానికి ఎంతో మంచివి. వీటికి మంచి హెల్తీ బ్రేక్ ఫాస్ట్ ఏవీ ఉండవు. దీనిలో ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. అలాగే ఇవి జీర్ణం కావడానికి చాలా సమయం పడుతుంది. కాబట్టి గుడ్లను తిన్న తర్వాత మీ కడుపు ఎక్కువ సేపు నిండుగా ఉంటుంది. గుడ్లు మెదడును, కాలెయాన్ని కూడా ఆరోగ్యంగా ఉంచుతాయి. 

Latest Videos

undefined

బొప్పాయి: ఉదయాన్నే పరిగడుపున బొప్పాయి పండును తినడం వల్ల మీరు ఎన్నో లాభాలను పొందుతారు. ఎందుకంటే బొప్పాయి మీ కడుపును శుభ్రపరుస్తుంది.అలాగే శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. కానీ దీన్ని తిన్న తర్వాత కనీసం గంట వరకు మరేమీ తినకూడదు. 

ఓట్ మీల్: ఓట్ మీల్ మంచి బ్రేక్ ఫాస్ట్ ఫుడ్. ఓట్స్ లో  ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి బాగా సహాయపడుతుంది. అలాగే ఇది మీ కడుపును ఎక్కువసేపు నిండుగా కూడా ఉంచుతుంది. ఇది మీరు అతిగా తినకుండా కాపాడుతుంది. వోట్మీల్ లో ఇనుము, విటమిన్ బి, మెగ్నీషియం, జింక్ లు మంచి మొత్తంలో ఉంటాయి. 

గ్రీన్ టీ: ఉదయాన్నే గ్రీన్ టీ తాగడం ఆరోగ్యానికి చాలా మంచిది. ఎందుకంటే గ్రీన్ టీలోని కెఫిన్ మిమ్మల్ని రిఫ్రెష్ గా చేస్తుంది. అలాగే ఇది మిమ్మల్ని మూడీ నుంచి బయటకు తీసుకొస్తుంది. ఒత్తిడిని తగ్గిస్తుంది. మీ ఎనర్జిటిక్ లెవెల్స్ ను పెంచుతుంది. 

చియా విత్తనాలు: చియా విత్తనాలు మంచి పోషకాలకు వనరులు. వీటిలో ఫైబర్ కూడా మెండుగా ఉంటుంది. వీటిని తింటే మీకు ఆకలిగా అనిపించదు. అలాగే ఇవి మీ షుగర్ లెవెల్స్ ను కూడా నియంత్రణలో ఉంచుతాయి. 
 

click me!