వర్షాకాలంలో కూరగాయలు, పండ్లు ఎలా క్లీన్ చేయాలో తెలుసా?

By ramya SridharFirst Published Jul 1, 2024, 3:04 PM IST
Highlights

ఈ సీజన్ లో జలుబు, జ్వరం లాంటివి వచ్చే అవకాశం చాలా ఎక్కువ. వీటి బారినపడకుండా ఉండాలంటే.. ఆహారం విషయంలో జాగ్రత్తవహించాలి. 

 వర్షాకాలంలో పండ్లు, కూరగాయలను సరిగ్గా శుభ్రం చేయడం చాలా ముఖ్యం. ఎందుకంటే.. ఈ సీజన్ లో.. కీటకాల ఎటాక్ ఎక్కువగా ఉంటుంది. అందుకే మంచిగా శుభ్రం చేయాలి. మరి.. వీటిని ఈజీగా  క్లీన్ చేసే హ్యాక్స్ ఏంటో ఓసారి చూద్దాం...

నిన్న మొన్నటి వరకు  మన దేశంలో ఎండలు మండిపోయాయి. వర్షాలు పడటం మొదలుపెట్టాయి. దీంతో.. కాస్త హాయిగా అనిపిస్తూ ఉంటుంది. వాతావరణం మనకు ఎంత హాయిగా అనిపించినా.. ఈ సీజన్ లో జలుబు, జ్వరం లాంటివి వచ్చే అవకాశం చాలా ఎక్కువ. వీటి బారినపడకుండా ఉండాలంటే.. ఆహారం విషయంలో జాగ్రత్తవహించాలి. 

పండ్లు, కూరగాయలు తినడం ఎంత ముఖ్యమో.. వాటిని నీట్ గా శుభ్రం చేసి తినడం అంతకంటే చాలా ముఖ్యం. ఎందుకంటే.. ఈ సీజన్ లో కీటకాల తాకిడి చాలా ఎక్కువగా ఉంటుంది. మంచిగా శుభ్రం చేయకుండా తినడం వల్ల ఆరోగ్య సమస్యలు ఎక్కువగా వచ్చే ప్రమాదం ఉంది. మరి.. పండ్లు, కూరగాయలను ఎలా శుభ్రం చేయాలో ఇప్పుడు చూద్దాం...

దాదాపు చాలా మంది మార్కెట్లో కొనుగోలు చేసిన కూరగాయలను డైరెక్ట్ గా తీసుకువచ్చి.. ఫ్రిడ్జ్ లో పెట్టేస్తూ ఉంటారు. కానీ.. ఇది చాలా పెద్ద తప్పు. పండ్లు, కూరగాయలను విడివిడిగా ఉంచాలి. తర్వాత నీటితో కడగాలి. అది కూడా.. వాటర్ ఫ్లో ఎక్కువగా ఉన్న సమయంలో వాటి కింద ఈ పండ్లు, కూరగాయలు ఉంచాలి. దాని వల్ల.. వాటిపై ఉన్న మురికి సులభంగా వదులుతుంది.


ఆపిల్, బంగాళదుంపలు ,క్యారెట్లు వంటి గట్టి చర్మం గల పండ్లు, కూరగాయలను శుభ్రం చేయడానికి మృదువైన బ్రష్‌ను ఉపయోగించండి. బెర్రీలు, ద్రాక్ష , ఆకు కూరలు వంటి సున్నితమైన పండ్లు , కూరగాయలను కాస్త నెమ్మదిగా కడగాలి. ఆకుకూరలను సైతం ఒక్కొక్కటిగా వేరు చేసి మరీ శుభ్రం చేయాలి. 

 పండ్లు, కూరగాయల్లోని బ్యాక్టీరియాను చంపడానికి, మురికిని తొలగించడానికి, ఒక పాత్రలో 1 భాగం వెనిగర్, 4 భాగాల నీటిని కలపడం ద్వారా ద్రవాన్ని సిద్ధం చేయండి. ఇప్పుడు అందులో కూరగాయలు, పండ్లను వేసి 10 నుంచి 15 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. తర్వాత ఆ నీటిలో నుంచి వాటిని తొలగిస్తే సరిపోతుంది. పండ్లు , కూరగాయలను కడిగిన వెంటనే వాటిని కలిపి ఉంచడం వలన కుళ్ళిపోయే మరియు చెడిపోయే ప్రమాదం పెరుగుతుంది. వాటిలో ఉన్న అదనపు తేమను తొలగించడానికి, వాటిని  శుభ్రమైన టవల్ లేదా కాగితంపై ఉంచండి. నీరు ఆరిపోయి.. వాటి తడిపోయేలా టవల్ తో వాటిని తుడవాలి. ఆ తర్వాత.. దేనికి దానిని సపరేటు చేసి.. ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకుంటే సరిపోతుంది.

కూరగాయలు, పండ్లు శుభ్రం చేసే క్రమంలో చేయకూడని పొరపాట్లు ఇవే.. 
పచ్చి మాంసం లేదా చేపలు మొదలైన వాటిని కడిగిన ప్రదేశంలో పండ్లు , కూరగాయలు కడగడం మానుకోండి.
వాషింగ్ కోసం ఎల్లప్పుడూ శుభ్రమైన నీటిని ఉపయోగించండి.
పండ్లు , కూరగాయలను శుభ్రం చేయడానికి సబ్బు, డిటర్జెంట్ లేదా ఇతర రసాయన ఉత్పత్తులను ఉపయోగించడం మానుకోండి.
పండ్లు, కూరగాయలను దీర్ఘకాలికంగా నిల్వ చేయడానికి ఉపయోగించే పాత్రలు , పరికరాలను శుభ్రపరచండి. ఈ పొరపాట్లు చేయకపోతే.. మనం ఎక్కువ కాలం ఆరోగ్య సమస్యలకు దూరంగా ఉండొచ్చు.


 

click me!