హైబీపీ లైట్ తీసుకునేంత చిన్న సమస్య కాదు. ఎందుకంటే ఈ వ్యాధి మన ప్రాణాలను రిస్క్ లో పెడుతుంది. అందుకే ఈ సమస్య ఉన్నవారు రక్తపోటు అదుపులో ఉండటానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
పెద్దలే కాదు చిన్న పిల్లలు కూడా హైబీపీ సమస్యతో బాధపడుతున్నారు. అధిక రక్తపోటు వల్ల గుండెపోటు, స్ట్రోక్, డయాబెటీస్ వంటి ఎన్నో ప్రాణాంతక రోగాలు వస్తాయి. అందుకే ఈ వ్యాధిని బాగా కంట్రోల్ చేయాలి. పెరకుండా చూసుకోవాలి. ఆరోగ్య నిపుణుల ప్రకారం.. అధిక రక్తపోటును, మధుమేహాన్ని నియంత్రించడానికి ఆహారం కీలక పాత్ర పోషిస్తుంది. గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉన్న ఆహారం డయాబెటీస్ ప్రమాదాన్ని చాలా వరకు తగ్గిస్తుంది. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. అధిక రక్తపోటును, బీపీని కంట్రోల్ చేయడానికి ఎలాంటి ఆహారాలు సహాయపడతాయో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
వైట్ బ్రెడ్
undefined
వైట్ బ్రెడ్ ను చాలా మంది ఇష్టంగా తింటుంటారు. కానీ వైట్ బ్రెడ్ లో కార్బోహైడ్రేట్లతో పాటుగా గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను చాలా ఫాస్ట్ గా పెంచుతాయి. అలాగే ఇది డయాబెటీస్ ఉన్నవారికి చాలా డేంజర్. ఇది రక్తపోటును కూడా బాగా పెంచుతుంది. వైట్ బ్రెడ్ ను అతిగా తింటే బరువు పెరుగుతారు.
తెల్ల బియ్యం
వైట్ బ్రెడ్ మాదిరిగానే వైట్ రైస్ లో కూడా పిండి పదార్ధాలు ఎక్కువగా ఉంటాయి. ఇది కూడా రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతుంది. అలాగే రక్తపోటు కూడా పెరుగుతుంది. వైట్ రైస్ ను రెగ్యులర్ గా తింటే టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఉంది. అందుకే దీనికి బదులుగా బ్రౌన్ రైస్, బార్లీ వంటి ఆరోగ్యకరమైన ఆహారాలను తినండి. ఇవి బీపీని, బ్లడ్ షుగర్ లెవెల్స్ ను నియంత్రించి గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి.
పాస్తా
వైట్ పాస్తా రక్తంలో చక్కెర స్థాయిలు వేగంగా పెరగడానికి కారణమవుతుంది. అందుకే డయాబెటీస్ ఉన్నవారు పొరపాటున కూడా పాస్తాను తినకూడదని డాక్టర్లు చెప్తుంటారు. అధిక రక్తపోటు ఉన్నవారికి కూడా ఇది చాలా డేంజర్. వైట్ పాస్తా వేగంగా జీర్ణమయ్యి ఇన్సులిన్ పెరుగుదలకు దారితీస్తుంది. ఇది బరువు పెరగడానికి, రక్తపోటు పెరగడానికి కారణమవుతుంది.
ఆలుగడ్డ
బంగాళాదుంపలు కూడా రక్తంలో చక్కెర స్థాయిలను ఫాస్ట్ గా పెంచుతాయి. అధిక రక్తపోటు ఉన్న రోగులు కూడా వీటిని తినకపోవడమే మంచిది. ఎందుకంటే బంగాళాదుంపల్లో సోడియం కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది హైపర్ టెన్షన్ పెరుగుతుంది.
చక్కెర
చక్కెర ను వివిధ రకాల ఆహారాల్లో ఉపయోగిస్తుంటారు. దీన్ని ఎక్కువగా వివిధ ప్రాసెస్ చేసిన ఆహారాలు, పానీయాల్లో వేస్తుంటారు. కానీ చక్కెరను ఎక్కువగా తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. ఇది బరువు పెరగడానికి దారితీస్తుంది. అలాగే బీపీ పెరుగుతుంది. ఇన్సులిన్ నిరోధకత పెరుగుతుంది.