టేస్టీ రవ్వ దోశ... సింపుల్ గా చేయడమేలా..?

By telugu news team  |  First Published Jul 16, 2021, 11:36 AM IST

ఈ రవ్వ దోశ బయట కొనుక్కొని తిన్నంత టేస్టీగా ఇంట్లో చేస్తే రాదని చాలా మంది అంటుంటారు.  అయితే... ఈ ఈ కింద చెప్పిన విధంగా చేస్తే.. రవ్వ దోశ చాలా సింపుల్ గా.. టేస్టీగా తయారు చేయవచ్చు. 


కరకరలాడే రవ్వ దోశని ఇష్టపడని వారు ఎవరూ ఉండరు. అయితే..  ఈ రవ్వ దోశ బయట కొనుక్కొని తిన్నంత టేస్టీగా ఇంట్లో చేస్తే రాదని చాలా మంది అంటుంటారు.  అయితే... ఈ ఈ కింద చెప్పిన విధంగా చేస్తే.. రవ్వ దోశ చాలా సింపుల్ గా.. టేస్టీగా తయారు చేయవచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం..

Latest Videos

undefined

రవ్వదోశకు కావాల్సిన పదార్థాలు..

బియ్యం పిండి: 1cup మైదా: 1cup సూజి(రవ్వ): 1cup శెనగపిండి: 1/4(అవసరమనుకొంటేనే) పచ్చిమిర్చి: 4-6 కరివేపాకు: రెండు రెమ్మలు క్యారెట్ తురుము: 1tbsp జీలకర్ర: 1/2tsp ఉప్పు : రుచికి సరిపడా నూనె: సరిపడా 
తయారు చేయు విధానం: 1. ముందుగా పచ్చిమిర్చిని శుభ్రం చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే కరివేపాకును కూడా కట్ చేసి పెట్టుకోవాలి. 

2. తర్వాత మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో బియ్యం పిండి, మైదా, సూజి(సన్న రవ్వ), శెనగపిండి, పచ్చిమిర్చి, క్యారెట్ తురుము, కరివేపాకు తురుము, జీలకర్ర పొడి, ఉప్పు, తగినన్ని నీళ్ళు పోసి(అప్రాక్సిమేట్ గా ఒక ఆరు కప్పులు)దోసె పిండిలా జారుడుగా కలుపుకోవాలి. 

3. ఇప్పుడు పది పదిహేను నిమిషాల తర్వాత స్టౌ వెలిగించి, దోసె పాన్ పెట్టి వేడయ్యాక దోసె పోసుకొని పాన్ పూర్తిగా దోసెను రౌండ్ గా దిద్దుకొని పైన కొద్దిగా నూనె చల్లుకొని రెండు వైపులా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకూ తక్కువ మంట మీద కాల్చుకోవాలి.

 4. తర్వాత సర్వింగ్ ప్లేట్ లోనికి తీసుకొని మీకు ఇష్టమైన చట్నీ తో సర్వ్ చేసుకోవాలి.

click me!