ఆవకాయ పెట్టిన కొత్తల్లో ముక్కలు మొత్తం ఇష్టంగా లాగించేస్తాం. ఆ తర్వత ముక్కలు అయిపోయానని చెప్పి.. పచ్చడి జోలికి పోరు. లేదంటే.. మిగిలిన ముక్కలు లేని పచ్చడిని తినకుండా వదిలేస్తారు.. పారేస్తారు.
ఎండాకాలం రాగానే.. మనలో చాలా మంది చేసే మొదటి పని.. మామిడికాయ పచ్చడి పెట్టుకోవడం. దాదాపు మన అందరి ఇళ్లల్లో ఆవకాయ కచ్చితంగా ఉంటుంది. ఎవరి ప్రాంతాన్ని బట్టి.. ఎవరి రుచికి తగినట్లుగా.. సంవత్సరం మొత్తానికి సరిపోయేలా ఆవకాయ పెట్టుకుంటాం.
అయితే.. ఆవకాయ పెట్టిన కొత్తల్లో ముక్కలు మొత్తం ఇష్టంగా లాగించేస్తాం. ఆ తర్వత ముక్కలు అయిపోయానని చెప్పి.. పచ్చడి జోలికి పోరు. లేదంటే.. మిగిలిన ముక్కలు లేని పచ్చడిని తినకుండా వదిలేస్తారు.. పారేస్తారు.
అయితే.. ఆ మిగిలిపోయిన పచ్చడితో.. మళ్లీ పచ్చడి చేసుకోవచ్చని స్పెషలిస్టులు చెబుతున్నారు.
కేవలం అందుకు ఉల్లిపాయలు ఉంటే సరిపోతుందట. ఉల్లిపాయలతో మళ్లీ కొత్తగా లేటేస్ట్ గా ఆవకాయ తినొచ్చని చెబుతున్నారు.
మామిడికాయ పచ్చడిలో ముక్కలు అయిపోతే.. ఆ కారంలో.. చిన్న ఉల్లిపాయలు వేయాలి. తెల్ల ఉల్లిపాయలు తీసుకొని వాటిని తొక్కు తొలగించుకోవాలి.
ఓ పచ్చడి జాడీ తీసుకొని.. అందులో.. మామిడికాయ కారం.. అందులో ఈ ఉల్లిపాయలను వేయాలి. తర్వాత దానిలో అవసరాన్ని బట్టినూనె కలుపుకోవాలి. ఇప్పుడు దీనిని రెండు రోజులపాటు ఎండతగిలే ప్రాంతంలో ఉంచి.. తర్వాత.. తింటే.. చాలా రుచిగా ఉంటుంది.
కొత్త రకం పచ్చడి తిన్నామనే భావన కలగడంతోపాటు.. పచ్చడి వేస్ట్ అయ్యిందనే బాధ కూడా ఉండదు. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేయండి.