ఆవు, గేదె పాలు vs ప్లాంట్ బేస్ట్ మిల్స్ ... ఏది తాగితే హెల్త్ కు మంచిదో తెలుసా?

Published : Mar 07, 2025, 09:30 PM IST
ఆవు, గేదె పాలు vs ప్లాంట్ బేస్ట్ మిల్స్ ...  ఏది తాగితే హెల్త్ కు మంచిదో తెలుసా?

సారాంశం

Plant Based Milk : ఆవు, గేదె పాల గురించి అందరికీ తెలుసు. కానీ ఈ ప్లాంట్ బేస్డ్ పాల గురించి తెలుసా? మొక్కల నుంచి తీసే ఈ పాలతో ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో తెలుసా?   

Plant Based Milk ప్రముఖ కవి, మాజీ రాజకీయ నేత కుమార్ విశ్వాస్ కూతురు అగ్రత శర్మ వివాహం ఇటీవల అంగరంగ వైభవంగా జరిగింది. ఉదయ్ పూర్ లోని లీలా ప్యాలస్ లో మూడు రోజులపాటు అగ్రతా శర్మ-పవిత్ర ఖండేల్వాల్ వివాహం అట్టహానగా జరిగింది. డిల్లీలో జరిగిన వివాహ రిసెప్షన్ కు ప్రధాని నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తదితర రాజకీయ ప్రముఖులతో పాటు సినీ, వ్యాపార ప్రముఖులు హాజరయ్యారు. 

ఇలా ఘనంగా వివాహం జరగడంతో అగ్రతా శర్మ, పవిత్రి ఖండేల్వాల్ పేరు దేశవ్యాప్తంగా మారుమోగింది. ఈ క్రమంలోనే పవిత్ర ఖండేల్వాల్ గురించి ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. అతడు ప్లాంట్ బేస్డ్ ఫుడ్ స్టార్టప్ బెటర్ బెట్ (Better Bet)  కో-ఫౌండర్... ఇది ప్లాంట్ బేస్డ్ పాలు అమ్ముతుంది.

అయితే ఆవు, గేదె పాల గురించి తెలుసు... చివరకు మేక, గాడిద పాాలగురించి విన్నాం... మరి ఈ మొక్కల పాలు ఏంటనేగా మీ అనుమానం. ఇప్పుడిప్పుడే ఈ ప్లాంట్ బేస్డ్ పాలు బాగా ఫేమస్ అవుతున్నాయి. సెలబ్రిటీల నుంచి హెల్దీగా ఉండాలనుకునే వాళ్ల వరకు ప్లాంట్ బేస్డ్ పాలు వాడుతున్నారు. ఈ ప్లాంట్ బేస్డ్ పాల గురించి తెలుసుకుందాం.

ప్లాంట్ బేస్డ్ పాలు అంటే ఏంటి? (What is plant-based milk)

మొక్కల నుంచి తీసే పాలను ప్లాంట్ బేస్డ్ పాలు అంటారు. డెయిరీ పాలు అంటే ఆవులు,గేదెల నుండి తీసే పాలతో పోలిస్తే మొక్కల నుంచి వచ్చే పాలు ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. అంతేకాదు ఆరోగ్యానికి చాలా మంచిది. ప్లాంట్ బేస్డ్ పాలలో బాదం పాలు, సోయా పాలు, బియ్యం పాలు, బంగాళాదుంప పాలు ఉంటాయి. ప్లాంట్ బేస్డ్ పాలలో మొక్కను బట్టి పోషకాలు ఉంటాయి. ఎవరికైతే డైరీ ప్రొడక్ట్స్ పడవో వాళ్లు వీటిని వాడవచ్చు. వెజిటేరియన్స్ కూడా ఈ పాలను వాడుకోవచ్చు.

ప్రోటీన్ ఎక్కువగా ఉండే సోయా మిల్క్ (Soy milk of protein)

240 ml సోయా పాలలో 80 క్యాలరీలు ఉంటాయి. మార్కెట్ లో సోయా ఫోర్టిఫైడ్ మిల్క్ దొరుకుతుంది. వీటిలో కాల్షియం, విటమిన్ ఏ, బి12 లాంటి మినరల్స్ ఉంటాయి. సోయా పాలు బాడీలో పోషకాల లోపాన్ని తగ్గిస్తాయి, ఈజీగా జీర్ణం అవుతాయి.

ఇంట్లో ప్లాంట్ బేస్డ్ పాలు చేసుకోవచ్చు (Plant based milk at home)

బాదం పాలు లేదా కొబ్బరి పాలు, ప్లాంట్ బేస్డ్ పాలను ఇంట్లోనే చేసుకోవచ్చు. మార్కెట్ లో చాలా కంపెనీలు ఫ్లేవర్డ్ ప్లాంట్ బేస్డ్ పాలు అమ్ముతున్నాయి. అనుష్క శర్మ నుంచి జాన్ అబ్రహం వరకు ప్లాంట్ బేస్డ్ పాలు తాగుతారు.

PREV
click me!

Recommended Stories

Green Peas: చలికాలంలో పచ్చి బఠానీలు ఎందుకు తినాలి?
రోజూ ఒక స్పూన్ మునగాకు పొడి తీసుకుంటే జరిగే మ్యాజిక్ ఇదే