పండ్లను, కూరగాయలను కడగకుండా తింటే ఏమౌతుందో తెలుసా?

Published : Aug 23, 2024, 01:15 PM IST
 పండ్లను, కూరగాయలను కడగకుండా తింటే ఏమౌతుందో తెలుసా?

సారాంశం

కొంతమందికి పండ్లను కానీ, కూరగాయలను కానీ కడిగే అలవాటు అస్సలు ఉండదు. కానీ వీటిని కడగకుండా తింటే ఏమౌతుందో తెలిస్తే మళ్లీ ఇలా అస్సలు చేయరు.   

పండ్లు, కూరగాయలు మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. వీటిలో మనల్ని ఆరోగ్యంగా ఉంచే ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలు మెండుగా ఉంటాయి. అన్నం తక్కువగా, పండ్లను, కూరగాయలను ఎక్కువగా తినాలని డాక్టర్లు, ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. కానీ వీటిని కడగకుండా తింటే మాత్రం మీరు ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అసలు వీటిని కగడకుండా తింటే ఏమౌతుందో తెలుసా? 

పురుగుమందులు: కూరగాయలకు, పండ్లకు రకరకాల పురుగు మందులను పిచికారి చేస్తుంటారు. ఈ పురుగుమందులు కూరగాయలు, పండ్లపై అలాగే ఉంటాయి. వీటిని తింటే మన శరీరంపై చెడు ప్రభావం పడుతుంది. 

హార్మోన్ల అసమతుల్యత: పురుగుమందులతో కలుషితమైన పండ్లను, కూరగాయలను తింటే హార్మోన్ల అసమతుల్యత ఏర్పడుతుందని డాక్టర్లు చెబుతున్నారు. ఈ ప్రభావం ఎన్నో తరతరాలపై పడుతుంది.

అలెర్జీ: పండ్లు, కూరగాయలపై ఉండే పురుగుమందులు కంటి, చర్మపు చికాకును కలిగిస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వీటిని తిన్న మనకు వాంతులు, మూర్ఛ, వికారం, శ్వాస ఆడకపోవడం వంటి సమస్యలు వస్తాయి. 

జనన సమస్యలు: గర్భిణీలు క్రిమిసంహారక మందులు పిచికారీ చేసిన పండ్లను, కూరగాయలను అలాగే తినడం వల్ల పిండం అభివృద్ధిపై చెడు ప్రభావం పడుతుంది. అలాగే ప్రసవంలో సమస్యలు తలెత్తుతాయి. 

మానసిక ఆరోగ్య సమస్యలు: క్రిమిసంహారక మందులున్న పండ్లను, కూరగాయలను కడగకుండా తింటే పిల్లల్లో ఏకాగ్రత లోపిస్తుంది. అలాగే వారు హైపర్యాక్టివిటీ వంటి సమస్యల బారిన పడతారు. 

పండ్లను, కూరగాయలను ఎలా కడగాలి:  ఒక గిన్నెలో పండ్లు, కూరగాయలను వేసి దాంట్లో నీళ్లు పోయండి. దీంట్లో కొద్దిగా వేయండి.  దీన్ని 15 నిమిషాల పాటు ఉడకబెట్టి. తర్వాత పండ్లు, కూరగాయలను కడగాలి. ఫలితంగా పండ్లు, కూరగాయల నుంచి 98 శాతం పురుగుమందులు తొలగిపోతాయి.


 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Ragi Java: చలికాలంలో రాగి జావ తాగితే ఏమౌతుంది?
రాత్రి పడుకునే ముందు పాలు తాగితే ఏమౌతుంది?