బరువు తగ్గడానికి పెరుగును ఎలా తినాలో తెలుసా?

By Shivaleela Rajamoni  |  First Published Jul 12, 2024, 2:34 PM IST

అవును పెరుగు కూడా  మీరు ఆరోగ్యంగా బరువు తగ్గడానికి సహాయపడుతుందని ఓ  అధ్యయనంలో తేలింది. మరి బరువు తగ్గాలనుకునేవారు పెరుగును ఎలా తినాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 


పెరుగు మన ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుంది. పెరుగు ప్రోబయోటిక్స్, ప్రోటీన్లకు మంచి వనరు. పెరుగులో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి బరువు తగ్గడానికి పెరుగు బెస్ట్ ఫుడ్ అంటున్నారు నిపుణులు. పెరుగును తినడం వల్ల మీరు కేలరీలు తీసుకోవడం చాలా వరకు తగ్గుతుంది అలాగే మీరు ఆరోగ్యంగా బరువు తగ్గడానికి సహాయపడుతుంది. అమెరికన్ జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్ లో ప్రచురించిన అధ్యయనం ప్రకారం.. ప్రోటీన్ పుష్కలంగా ఉండే ఆహారాలను తినడం వల్ల ఆకలి తగ్గుతుంది. అలాగే ఊబకాయం వచ్చే ప్రమాదం కూడా చాలా వరకు తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. 

పెరుగులో పుష్కలంగా ప్రోబయోటిక్స్ ఉంటాయి. ఇవి మీ గట్ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి బాగా సహాయపడతాయి. అలాగే మీ జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. ఇవన్నీ మీరు ఆరోగ్యంగా బరువు తగ్గడానికి సహాయపడతాయి. ఆరోగ్యకరమైన గట్ మైక్రోబయోమ్ బరువును నియంత్రించడంతో సంబంధం కలిగి ఉంటుంది.

Latest Videos

100 గ్రాముల పెరుగులో 98 కేలరీలు మాత్రమే ఉంటాయి. కేలరీలను తగ్గించుకోవాలనుకునే వారికి బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్న వారికి పెరుగు ఒక గొప్ప ఆహారం. మరి బరువు తగ్గడానికి పెరుగును ఎలా తీసుకోవాలంటే. 

పండ్లతో పెరుగు: బరువు తగ్గాలనుకుంటే మీరు సాదా పెరుగును తీసుకుని అందులో బెర్రీలు, ఆపిల్, అరటిపండ్లు వంటి పండ్లను కలపండి. ఈ పండ్లలో ఫైబర్, విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఈ పండ్లతో పెరుగును తీసుకోవడం వల్ల మీ ఆకలి చాలా వరకు తగ్గుతుంది. అలాగే కేలరీలు తీసుకోవడం కూడా చాలా వరకు తగ్గుతుంది. 

స్మూతీలు: పెరుగును టేస్టీ టేస్టీ స్మూతీగా కూడా తీసుకోవచ్చు. మీకు ఇష్టమైన పండ్లు, గుప్పెడు బచ్చలికూర జోడించి స్మూతీ తయారు చేసి తినండి. 

సలాడ్: బరువు తగ్గడానికి మీరు పెరుగును సలాడ్ రూపంలో కూడా తీసుకోవచ్చు.  ఎక్కువ కేలరీల మయోన్నైస్ లేదా క్రీమ్ కు బదులుగా పెరుగును ఉపయోగించండి.

మసాలా దినుసులతో కలిపి: పెరుగులో జీలకర్ర, పసుపు లేదా దాల్చినచెక్క వంటి మసాలా దినుసులను కలిపి కూడా తీసుకోవచ్చు.  ఈ మసాలా దినుసులు రుచిని పెంచడమే కాకుండా జీవక్రియను పెంచడానికి కూడా సహాయపడతాయి. ఇవి మీరు వేగంగా బరువు తగ్గడానికి సహాయపడతాయి. 

click me!