జీడిపప్పును పాలలో నానబెట్టి తింటే ఎంత మంచిదో తెలుసా?

By Mahesh Rajamoni  |  First Published Feb 12, 2023, 2:50 PM IST

జీడిపప్పును ఎన్నో రకాలుగా తింటారు. కొంతమంది అలాగే తింటే.. ఇంకొంతమంది వాటిని నానబెట్టి మరుసటి రోజు తింటుంటారు. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. జీడిపప్పులను పాలలో నానబెట్టి తింటే మంచిది. 


జీడిపప్పు చాలా టేస్టీగా ఉంటుంది. అందుకే వీటిని ప్రతి ఒక్కరూ తినడానికి ఇష్టపడతారు. నిజానికి జీడిపప్పులో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగున్నాయి. జీడిపప్పులో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్, ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన శరీరాన్ని ఎన్నో వ్యాధుల నుంచి రక్షిస్తాయి. 

100 గ్రాముల జీడిపప్పులో 18.22 గ్రాముల ప్రోటీన్ కంటెంట్ ఉంటుంది. దీనిలో మోనోశాచురేటెడ్ కొవ్వు ఆమ్లాల లక్షణాలను కూడా ఉంటాయి. ఈ గింజల్లో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. డయాబెటిస్ పేషెంట్లు వీటిని తింటే రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. ఈ గింజల్లో యాంటీ డయాబెటిస్ లక్షణాలు కూడా ఉంటాయి. జీడిపప్పును తింటే గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఈ పప్పులో మంచి ఫ్యాట్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. అంతేకాదు కొవ్వు ఆమ్ల వర్గానికి చెందిన ఒలేయిక్ ఆమ్లం పరిమాణం కూడా ఎక్కువగా ఉంటుంది. ఇది గుండె జబ్బులతో పోరాడటానికి సహాయపడుతుంది. జీడిపప్పులో ఉండే మెగ్నీషియం రక్తపోటును తగ్గిస్తుంది.

Latest Videos

అయితే జీడిపప్పును ఒక్కొక్కరు ఒక్కోలా తింటుంటారు. కొందరు పచ్చి జీడిపప్పును తింటే ఇంకొంతమంది వీటిని రాత్రి నానబెట్టి ఉదయం తింటుంటారు. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. జీడిపప్పును పాలలో నానబెట్టి తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. అసలు జీడిపప్పును పాలలో నానబెట్టి తింటే ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలో కలుగుతాయంటే? 

ఎముకల ఆరోగ్యానికి మంచిది

పాలలో నానబెట్టిన జీడిపప్పు తినడం వల్ల ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయి. రాత్రి నానబెట్టి మరుసటి రోజు ఉదయం వీటిని తింటే మన శరీరానికి కాల్షియం బాగా అందుతుంది. ఎందుకంటే పాలలో క్యాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఇది ఎముకల ఆరోగ్యానికి మేలు చేస్తుంది. జీడిపప్పులో విటమిన్ కె, మెగ్నీషియం, విటమిన్ బి 6, మెగ్నీషియం కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ ఎముకల ఆరోగ్యాన్ని కాపాడటానికి సహాయపడతాయి. 

మలబద్దకం

జీడిపప్పులో ఫైబర్ కంటెంట్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఇది మలబద్దకాన్ని నివారించడానికి, జీర్ణక్రియ ప్రక్రియ మెరుగ్గా జరగడానికి సహాయపడుతుంది. అందుకే పాలలో నానబెట్టిన జీడిపప్పును ప్రతిరోజూ ఉదయాన్నే తినండి. 

రోగనిరోధక శక్తి 

విటమిన్లు, రాగి, ఐరన్, జింక్ పుష్కలంగా ఉండే జీడిపప్పు రోగనిరోధక శక్తిని పెంచడానికి ఎంతో సహాయపడుతుంది. జీడిపప్పును పాలలో నానబెడితే వాటి ప్రయోజనాలు రెట్టింపు అవుతాయి. ఇది మీ రోగనిరోధక శక్తిని పెంచడానికి బాగా సహాయపడుతుంది. జీడిపప్పులో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఈ జీడిపప్పులు సూక్ష్మక్రిములు శరీరంలోకి ప్రవేశించకుండా నిరోధించడానికి సహాయపడతాయి. 

వీటిని ఎలా తయారుచేయాలి?

రాత్రిపూట గ్లాసు పాలలో మూడు లేదా నాలుగు జీడిపప్పులను వేయండి. మరుసటి రోజు ఈ జీడిపప్పపులను తిని పాలను తాగండి. ఆరోగ్యానికి మంచిదని మోతాదుకు మించి తింటే ఆరోగ్యం దెబ్బతింటుంది జాగ్రత్త.. 
 

click me!